Thursday 19 November 2015

మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే.. వత్తిడే

మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 300 దాటితే..
Updated :19-11-2015 17:51:23
టొరొంటో: మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో స్నేహితుల సంఖ్య 300 దాటిందా.. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే మీ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ సంఖ్య 300 దాటితే మీపై ఒత్తిడి పెరుగుతుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. 12-17 సంవత్సరాల వయసున్న 88మంది కౌమార దశలో ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారులపై జరిపిన ఈ పరిశోధనలో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ సంఖ్య 300పైగా ఉంటే వారు ఒత్తిడికి లోనవుతారని, ఒత్తిడికి కారణమైన హార్మోన్ కార్టిసోల్ వారిలో అధికంగా విడుదలవుతుందని తేలింది. అయితే అదే సమయంలో ఫ్రెండ్స్ పోస్టింగులకు లైక్‌లు కొట్టడం, రిప్లై మెసేజ్‌లు ఇవ్వడం ద్వారా కార్టిసోల్ హార్మోన్ విడుదల శాతాన్ని కొంత మేరకు తగ్గించవచ్చని పరిశోధనకారులు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం ఎంపిక చేసిన 88ని ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ సంఖ్య, వారిని వారు ప్రమోట్ చేసుకునే తీరు, అలాగే ఫ్రెండ్స్‌ను సపోర్ట్ చేసే తీరు, ఫేస్‌బుక్ ఉపయోగించే విధానంపై పరిశోధన చేశారు. పరిశోధనకు ముందు వీరి నుంచి కార్టిసోల్ శాంపిల్స్‌ను సేకరించి అధ్యయనం చేశారు. ఎఫ్‌బీలో స్నేహితుల సంఖ్య 300 దాటిన వారిలో కార్టిసోల్ స్థాయి 8 శాతం పెరిగినట్టు పరిశోధనలో తేలిందని అధ్యయనకారులు తెలిపారు. ఫ్రెండ్స్ సంఖ్య వెయ్యి, రెండువేలు దాటితే కార్టిసోల్ విడుదల మరింత ఎక్కువయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.

No comments:

Post a Comment