Monday 16 November 2015

రావణుడిని విలనంటారేంటీ?: రామ్‌గోపాల్ వర్మ ట్వీట్

రావణుడిని విలనంటారేంటీ?: రామ్‌గోపాల్ వర్మ ట్వీట్
Updated :16-Nov-2015 : 12:54
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మార్క్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ హీరోలపై, డైరెక్టర్లపై సెటైర్లు వేసే వర్మ ఈసారి ఇతిహాసాల మీద పడ్డాడు. రామాయణంలో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పా? అంటూ ప్రశ్నిస్తున్నాడు. సీతను కిడ్నాప్ చేసిన రావణుడు ఆమెను ఏమీ చేయలేదని చెప్పాడు. సీతతో విలన్‌లాగా రావణాసురుడు ఎప్పుడూ ప్రవర్తించలేదని తెలిపాడు. తాను చదివిన పురాణ పుస్తకాల్లో రాక్షసులు ఎవరూ రాక్షసుల్లాగా ప్రవర్తించలేదని అన్నాడు. రచయితలు రాక్షసుల క్యారెక్టర్లను సరిగా డెవలప్ చేయలేదని చెప్పాడు. సీతను అపహరించడం తప్పయితే. భారత్‌లో ప్రతినెలా 100 మంది విలన్‌లను మనం చూడొచ్చని వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ విషయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసిస్‌ను పెంచి పోషించింది అమెరికా కాదా? అంటూ ప్రశ్నించాడు. వర్మ ట్వీట్లను మీరూ చదవండి.

No comments:

Post a Comment