సిటీపై డ్రోన్ కన్ను
Sakshi | Updated: June 10, 2016 02:06 (IST)
- బందోబస్తులు, భద్రతా విధుల్లో వినియోగం
- రూ.7 లక్షలతో కొనుగోలు చేసిన సైబరాబాద్ పోలీసులు
అక్కడ నిత్యం ‘రద్దీ’నే..
ప్రతిష్టాత్మక సంస్థలు, అనేక కీలక కేంద్రాలు ఉన్న సైబరాబాద్‌కు నిత్యం వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా వీరికి భద్రతా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ఇతర ఉత్సవాలు తదితరాలు జరిగే సందర్భంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో భాగంగా సైబరాబాద్ పోలీసులు సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం, కమ్యూనిటీలు ఏర్పాటు చేసిన వాటితో పాటు అవసరానికి తగ్గట్టు తాత్కాలిక ప్రాతిపదికన సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు.
రియల్ టైమ్ సమాచారం..
సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం కొనుగోలు చేసిన డ్రోన్ కెమెరా ఖరీదు రూ.7 లక్షలు. ‘త్రీజీ’ పరిజ్ఞానంతో పని చేసే దీనిని రిమోట్ కంట్రోల్ సాయంతో భూమి నుంచి గరిష్టంగా 800 మీటర్ల ఎత్తులో తిప్పే అవకాశం ఉంది. దాదాపు కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాంతంలోని అంశాలను ఇది చిత్రీకరిస్తుంది. ఆ దృశ్యాలను ఎప్పటికప్పుడు(రియల్ టైమ్) సీసీసీలోని కంప్యూటర్లకు అందిస్తుంది. అక్కడ ఉండే సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. సీసీసీకి అనుసంధానించి ఉన్న ఇతర కెమెరాలు అందించే సమాచారం కంటే డ్రోన్ కెమెరా ద్వారా లభించే విజువల్స్ మరింత మెరుగైన ఫలితాలు ఇస్తాయని అధికారులు చెప్తున్నారు.
డ్రోన్ ప్రయోగం సక్సెస్..
ఈ అత్యాధునిక డ్రోన్ కెమెరా పనితీరును సైబరాబాద్ అధికారులు బుధవారం ప్రయోగాత్మకంగా పరీక్షించారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సువిశాలమైన మైదానం లో దీన్ని వినియోగించారు. అందులో ని ప్రతి ప్రాంతాన్నీ సీసీసీలోని సిబ్బం ది ఎలాంటి అంతరాయం లేకుండా చూడగలిగారు. ప్రస్తుతం సీసీసీలో మాత్రమే కనిపిస్తున్న ఈ దృశ్యాలను భవిష్యత్తులో ఉన్నతాధికారులు తమ స్మార్ట్‌ఫోన్లలోనూ ఎప్పటికప్పుడు చూసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డ్రోన్ కెమెరా నిర్వహణపైనా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని ఉన్నతాధికారులు
No comments:
Post a Comment