‘అ,ఆ’లకు కొత్త అర్థం చెప్పిన సీఎం చంద్రబాబు
08-06-2016 19:13:45
కడప: అ అంటే అమరావతి... ఆ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కడపలో చేపట్టిన మహాసంకల్ప కార్యక్రమంలోజిల్లా అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడుతూ క అంటే కడప, ప అంటే పట్టిసీమ గుర్తుకువచ్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం, పేదరికంపై గెలుపు కోసం మహా సంకల్ప దీక్ష చేస్తున్నామని.. ఈ కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచానికి తలమానికంగా అమరావతిని నిర్మాస్తామని చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువును తరిమికొడతామని బాబు అన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమతో రాయలసీమకు ఎలాంటి నష్టం జరగబోదని, అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
No comments:
Post a Comment