Thursday, 9 June 2016

రెండేళ్లలో ఏ వర్గానికీ సంతృప్తి కలగలేదు: బొత్స

రెండేళ్లలో వర్గానికీ సంతృప్తి కలగలేదు: బొత్స 
08-06-2016 23:24:11
http://cdn3.andhrajyothy.com/AJNewsImages/2016/Jun/20160608/Hyderabad/636010250517140802.jpg

హైదరాబాద్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో ఒక్క వర్గానికీ సంతృప్తి కలగలేదని వైసీపీ సీనియర్నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సత్తిబాబు పది ప్రశ్నలు సంధించారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయ్యాయా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి కొత్తగా రైతులకు అందిన రుణాలెంత? మీ వాగ్దానాల్ని నమ్మి రుణాలు చెల్లించని రైతులు అపరాధ వడ్డీగా ఏకంగా రూ.30000 కోట్లు మేర చెల్లించాల్సిన పరిస్థితి రావడం నిజం కాదా?. డ్వాక్రా రుణాల్లో ఒక్క రూపాయైునా మాఫీ చేశారా?. ఇంటికో ఉద్యోగం లేదా రూ.2000 నిరుద్యోగ భృతి అన్నారు? ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ఎవరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా?. ప్రత్యేక హోదా సంకల్పం ఏమైంది? హోదాను విభజన చట్టంలో పెట్టలేదంటూ సాకులు వెతుకుతున్నారు. మరి మీ మేనిఫెస్టోలో పెట్టిన వందల కొద్దీ వాగ్దానాలకు పట్టిన గతి ఏమిటి?. పోలవరం ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పూర్తి చేస్తాం అన్నారు? ఇప్పటికి రెండేళ్లయింది. ఎప్పటికి పూర్తి చేస్తారు? మీరు చెబుతున్న ఏపీ ఆర్థిక వృద్ధి రేటు బోగస్అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం నిజం కాదా?. సీబీఐ విచారణ అంటే భయమెందుకు? రాజధాని భూములు, అమరేశ్వరుడి భూములు, పట్టిసీమ, పారిశ్రామిక రాయితీలు, భూ కేటాయింపులు తదితర అంశాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్చేస్తుంటే ఎందుకు భయపడుతున్నారు? మీ తనయుడు లోకేశ్అవినీతి, పర్సంటేజీలపై విచారణకు సిద్ధపడతారా?. శాసనసభా గౌరవాన్ని దిగజార్చడం నిజం కాదా? పార్టీ కండువా మార్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారిని డిస్క్వాలిఫై చేయకుండా.. విప్జారీకి అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకుండా.. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్రాజ్యాంగబద్ధమని తెలిసీ దానిని కాదనడం ద్వారా శాసనసభా గౌరవాన్ని దిగజార్చలేదా?. తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలులో రేవంత కోట్లు ఇస్తూ దొరికిపోయినప్పుడు ఆడియోలో వాయిస్మీది కాదా? దొరికిపోయిన మిమ్మల్ని ముఖ్యమంత్రిగా భరించాల్సిన పరిస్థితి తెలుగు ప్రజలకు శిక్ష కాదా? మీరు దొరికి ఏడాదైనా కేసీఆర్ప్రభుత్వం చార్జిషీట్దాఖలు చేయలేదంటే.. రాష్ట్ర ప్రయోజనాలతోపాటు, కృష్ణా, గోదావరి జలాలనూ తెలంగాణ సర్కారుకు తాకట్టు పెట్టారా.. లేదా? అంటూ ప్రశ్నలు సంధించారు.

No comments:

Post a Comment