Friday 14 October 2016

Roja on Chandrababu

చంద్రబాబు కుటుంబానికి ఆ ధైర్యం ఉందా?
Sakshi | Updated: October 14, 2016 13:57 (IST)
 చంద్రబాబు కుటుంబానికి ఆ ధైర్యం ఉందా? వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వింతగా మాట్లాడుతున్నారని, ఆయనకు వెంటనే మానసిక చికిత్స చేయించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో మాట్లాడినప్పటి న్యూస్ వీడియో క్లిప్పింగ్ లను చూపించారు.

గతంలో చంద్రబాబు అన్న మాటలు
మాకు అవకాశం ఉంటే నేను, వెంకయ్య అమెరికాలో పుట్టేవాళ్లం
ఎస్సీలలో పుట్టాని ఎవరు మాత్రం కోరుకుంటారు?
కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా
ఎప్పుడో బ్రిటిష్‌ వాళ్లు కట్టిపోయిన రైల్వేలైన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.. మనవాళ్లు కట్టిన హైవే వరదలకు తెగిపోయింది
మన ఇంజనీర్లు ఎంత గొప్పవాళ్లు, ఎంత తెలివైనవాళ్లంటే.. వాళ్లకు కమిట్‌మెంట్ లేదు
మనవాళ్లకు ఇస్తే స్లమ్స్ కడతారు, మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయి
మన ఇంజనీర్లకు కమిట్ మెంటు లేదు.. మనవాళ్లు కడితే బ్రిడ్జిలు తెగిపోతాయి
రైతులు నన్ను నమ్మలేదు, వరుణుడిని నమ్మారు.. అందుకే కరువు వచ్చింది
అయ్యప్పస్వాముల వల్ల నెల రోజుల పాటు లిక్కర్ అమ్మకాలు తగ్గిపోతున్నాయి
ఏ కులంలో ఉన్నా డబ్బులుంటే చాలు, గౌరవం ఉంటుంది.. డబ్బు లేనప్పుడే రిజర్వేషన్ గుర్తుకొస్తుంది
నాకు ఇంగ్లీషు తెలియదంట.. నేను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, పీహెచ్‌డీ కూడా చేశాను

చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా స్పందన

చంద్రబాబుకు తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు ఎవరూ గుర్తురాలేదు గానీ, వెంకయ్య నాయుడు గుర్తుకొచ్చాడంటే ఆ అవిభక్త కవలలు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఎలా తోడుగా ఉన్నారో తెలుస్తుంది
వీళ్లిద్దరూ కలిసి అమెరికాను ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించాలి
మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయంట.. ఈయన కోటీశ్వరుడి కొడుకు కాదు, రెండెకరాల నుంచే వచ్చారు. అంత అహంకారం ఎందుకు?
ప్రపంచంలో గొప్ప కట్టడాలన్నీ ఇండియన్లే కడుతున్నారు. నాసాలో 50 శాతం మంది భారతీయ ఇంజనీర్లే ఉన్నారు
ఇంత నీచంగా మాట్లాడుతున్న చంద్రబాబును ఏం చేయాలి?
ఎన్నికల్లో మహిళలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు గానీ.. ఆడబిడ్డలంటే  భారతీయులంటే ఆయనకు ఎందుకింత అలుసు
తెల్లగా ఉంటే చాలు.. గొప్పోళ్లని అనుకోవడం దురదృష్టకరం
అన్ని దేశాల్లో అణుప్లాంట్లు మూసేస్తుంటే.. ఇక్కడ రష్యా అణు ప్లాంట్లు కట్టడానికి అవకాశం ఇస్తున్నారు
పీహెచ్‌డీ చేశానని అంటున్నారు. అప్లికేషన్ అయినంత మాత్రాన పీహెచ్‌డీ చేసినట్లు కాదు
సీఎంగా ఉండి ఇలా పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారంటే ఎంత మోసం చేస్తున్నారో తెలుస్తుంది
చివరకు భారతీయులను అవమానించడంలో అడ్వకేట్ జనరల్ కూడా ముందున్నారు
మనకు గాడిదలు వద్దు.. సింగపూర్ గుర్రాలు కావాలన్నారు
ప్రజలు వీళ్లకు ఏ శిక్ష విధించాలో ఆలోచించుకోవాలి
తెలుగువారిని ఇంతగా అవమానించిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో
కేజ్రీవాల్ ఒక చిన్న వ్యాఖ్య చేస్తే ఆయనను దేశద్రోహిగా అందరూ పేర్కొన్నారు
ఇది కూడా దేశద్రోహమేనని ప్రకటించాలి.. చంద్రబాబును సీఎం పదవి నుంచి తీసేసి రాష్ట్రం నుంచి బహిష్కరించాలి
తన కొడుకు మీద వచ్చిన ప్రచారాన్ని తప్పించుకోడానికి నల్లధనం అంశాన్ని ఎలా ముందుకు తెచ్చారో చూశాం
నల్లధనం విషయం చంద్రబాబుకు కూడా తెలిసిందంటే అది ఆయన డబ్బు గానీ, ఆయన బినామీల డబ్బు గానీ అయి ఉండాలి
చంద్రబాబు బ్లాక్ మనీ కి బ్రాండ్ అంబాసిడర్, చీటింగ్‌ను ఛీర్ గర్ల్‌లా ప్రమోట్ చేస్తారు, కమీషన్లకు ముద్దుబిడ్డ, కరప్షన్ కన్నబిడ్డ
ఆయన దొంగతనాన్ని కప్పి పుచ్చుకోడానికి ఆయన పెంపుడు పొలిటీషియన్లు ఉమా లాంటివాళ్లు మాట్లాడుతున్నారు
చంద్రబాబు, ఆయన కొడుకు, కోడలు వాళ్ల ఆస్తుల మీద విచారణకు ఎందుకు సిద్ధం కావట్లేదు
వాళ్లకు సిగ్గు, లజ్జ ఉంటే జగన్ మీద చేసిన ఆరోపణలను నిరూపించాలి
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారని యనమల అంటున్నారు.. ఆయన మతి ఉండే మాట్లాడుతున్నారా?
రెండున్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు
నిజంగా మీ దగ్గర ఆధారాలుంటే వాటిని ఎందుకు బయట పెట్టడం లేదు
పెదబాబుకు తోడు చినబాబు బయల్దేరాడు.. ఆయన సిమ్ కార్డు లేని సెల్ ఫోన్ లాంటివాడు పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ
కనీసం మండల కమిటీ ఎలా నియమిస్తారో కూడా తెలియని ఈయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అట, ఈయన జగన్‌కు పోటీ అట
లోకేష్ తెలుసుకో.. నిన్ను కన్న చంద్రబాబుతో పాటు మోదీ, పవన్ కలిసికట్టుగా ఎన్నికలకు వస్తే.. రాయలసీమ గడ్డమీద పుట్టిన దమ్మున్నోడిగా ఒంటరిగా పోటీపడ్డ వ్యక్తి జగన్
నిన్ను చూసి జగన్ భయపడాల్సిన అవసరం లేదు
చంద్రబాబును దేశద్రోహిగా చిత్రీకరించాలి
సింగపూర్‌లో బ్యాంకులన్నీ నిండిపోయాయి కాబట్టి అమెరికాకు వెళ్లిపోవాలనుకుంటున్నారు
ఈయన రాజీనామా చేసేవరకు ప్రజలు వదలకూడదు
చంద్రబాబు యావద్దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
నల్లధనం విషయంలో ఆయనకు సవాలుచేస్తున్నాం.. నిజంగా నువ్వు తప్పు చేయకపోయి ఉంటే చంద్రబాబు, ఆయన భార్య, కొడుకు, కోడలు.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకునే ధైర్యం ఉందా అని సవాలు చేస్తున్నాం

No comments:

Post a Comment