Tuesday 25 October 2016

రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..

రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..
Sakshi | Updated: October 19, 2016 12:41 (IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..
హైదరాబాద్ :  కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు విద్యాసాగర్ రావు అన్నారు. ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ట్రిబ్యునల్ తీర్పును పూర్తిగా పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నికర జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటలెంతో భవిష్యత్ లో తేలుతుందన్నారు. కాగా ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జలాల పంపిణీ చేయాలని బ్రిజేష్ ట్రైబ్యునల్ ఇవాళ తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు వైఖరి వల్లే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలను మూడు రాష్ట్రాల మధ్యే పంచాలని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినా ఎన్డీయేలోని భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఏమాత్రం స్పందించలేదన్నారు. చంద్రబాబు స్పందించకపోవడం వల్లే తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా వచ్చిందని మండిపడ్డారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి
కృష్ణా జలాల పంపీణిపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడి న్యాయం చేయాలని అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఏపీ, తెలంగాణకు న్యాయం జరుగుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ తో చర్చించాకే...
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించిన తర్వాత స్పందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

No comments:

Post a Comment