నెల్లూరు, మార్చి 12 : విభజన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కేంద్ర మంత్రి జైరాం రమేష్ సీమాంధ్రకు వరాల జల్లు కురిపిస్తున్నారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలో ఐదు నుంచి పదేళ్ల లో భారీగా అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్రలో 11 జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రపంచంలోనే పెద్ద పోర్టులలో ఒకటిగా దుగరాజపట్నం పోర్టును తీర్చిదిద్దుతామన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టులుగా తిరుపతి, విశాఖ, విజయవాడను తయారుచేస్తామన్నారు. విశాఖ నుంచి చెన్నై వరకు రూ.1.50 కోట్లతో ఇండస్టియర్ కారిడార్ ఏర్పాటు చేస్తామని జైరాం రమేష్ హామీ ఇచ్చారు.
Published at: 12-03-2014 11:37 AM
ప్రకాశం, మార్చి 12 : కొందరు తనను సీమాంధ్ర ఏజెంట్ అంటున్నారని, తాను ఏ ప్రాంతానికి ఏజెంట్‌ను కాదని తెలుగు ప్రజల ఏజెంట్‌నని కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను యువరక్తంతో నింపుతామన్నారు. లగడపాటి, రాయపాటి వ్యాపారదృక్పథంతో ఆలోచిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని తెలిపారు. దళితులకే తెలంగాణ సీఎం పదవి అని తాను చెప్పలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని జైరాం రమేష్ వెల్లడించారు.
No comments:
Post a Comment