ఆగస్టు కల్లా రాజధాని!
ఐదుగురు నిపుణులతో రాజధాని ఎంపిక కమిటీ
ఆగస్టు 31లోగా నివేదిక.. నేడు నోటిఫికేషన్
ప్రత్యూష్ నేత్వత్వంలో కేంద్ర సర్వీసుల విభజన కమిటీ
ఆగస్టు 31లోగా నివేదిక.. నేడు నోటిఫికేషన్
ప్రత్యూష్ నేత్వత్వంలో కేంద్ర సర్వీసుల విభజన కమిటీ
న్యూఢిల్లీ, మార్చి 28 : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై అధికారిక కమిటీ ఖరారైంది. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి కొత్త రాజధానిపై స్పష్టత రానుంది. పట్టణాభివృద్ధి, పునరావాసం, పట్టణ నిర్మాణ రంగాల్లో నిష్ణాతులైన ఐదుగురితో కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతటా పర్యటించి, ఆయా ప్రాంతాలను పరిశీలించి, ప్రతిపాదనలు-ప్రత్యామ్నాయాలపై చర్చించి... ఆగస్టు 31వ తేదీలోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ కమిటీని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రొఫెసర్ కె. శివరామకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. ఇందులో... ప్రొఫెసర్ కె.టి. రవీంద్రన్, ప్రొఫెసర్ జగన్‌షా, అరోమార్ రవి, డాక్టర్ రతిన్ రాయ్‌లను సభ్యులుగా నియమించాలని నిర్ణయించుకున్నారు. దీనిపై శనివారం కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. "రాజధాని ఏర్పాటుకు తగిన మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఈ సూత్రాలకు అనుగుణంగా పలు ప్రతిపాదనలను స్వీకరించాలి. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పౌర సంఘాలు, ఎన్జీవోలు మొదలైన అనేక వర్గాలనుంచి సూచనలను స్వీకరించి... ఆగస్టు 31లోపు తగిన నిర్ణయం చేయాలి'' అని ఈ కమిటీ విధి విధానాల్లో పేర్కొంటారని తెలిసింది.
ఆ ఐదుగురు...
శివరామకృష్ణన్: పట్టణాభివృద్ధి రంగ నిపుణుడు. కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవోగా, పట్టణ యాజమాన్యంలో ప్రపంచ బ్యాంకులో సీనియర్ సలహాదారుగా పనిచేశారు.
కేటీ రవీంద్రన్: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో అర్బన్ డిజైన్ విభాగం అధిపతిగా పని చేశారు. రిక్స్ స్కూల్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ డీన్ ఎమిరటస్‌గా వ్యవహరించారు. ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఆధునిక నగరాల నిర్మాణంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది.

జగన్‌షా: జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు. పట్టణ నిర్మాణ నమూనాల్లో అనుభవం గడించారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పన నిపుణుడు.
అరోమర్ రవి: మానన పునరావాసాల సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పట్టణీకరణకు చెందిన సమస్యల పరిష్కార నిపుణుడు.
రతిన్ రాయ్: ప్రజా విత్త విధాన జాతీయ సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. యూఎన్‌డీపీలో కూడా ఆయన పనిచేశారు.

No comments:
Post a Comment