Monday, 3 March 2014

86వ ఆస్కార్ అవార్డుల పండుగ

అట్టహాసంగా 86వ ఆస్కార్ అవార్డుల పండుగ

Published at: 03-03-2014 12:39 PM
 1  0  1 
 
 

లాస్ఏంజిలెస్, మార్చి 3 : హాలీవుడ్‌లో ఆదివారం అర్థరాత్రి అట్టహాసంగా జరిగిన 86వ ఆస్కర్ వేడుకలలో "12 ఇయర్స్ ఎస్లేవ్'' చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. గ్రావిటీ, డల్లాస్ బయ్యర్స్ క్లబ్, హర్ వంటి చిత్రాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని ఈ చిత్రం విజేతగా నిలిచింది. ఈ సంవత్సరం ఉత్తమ సహాయనటుడికి పురస్కార ప్రదానంతో కార్యక్రమం మొదలైంది. 'డల్లాస్ బయ్యర్స్ క్లబ్' చిత్రంలో నటనకు గానూ జారెడ్ లెటో ఈ అవార్డును గెలుచుకున్నారు. ఆస్కార్ ఆవార్డు రేసుల్లో 'గ్రావిటీ' చిత్రం ముందుకు దూసుకెళ్లింది. ఈ చిత్రానికి మొత్తం ఏడు అవార్డులు వరించాయి. అయితే ఉత్తమ చిత్రం అవార్డును '12 ఇయర్స్ ఎస్లేవ్' చిత్రం దక్కించుకుంది. ఉత్తమ నటుడుగా మాథ్యూ మెక్ కొనాప్‌జే, ఉత్తమ నటిగా కేట్ బ్లాంషె అవార్డులు దక్కించుకున్నారు.
* ఉత్తమ చిత్రం - 12 ఇయర్స్ ఎస్లేవ్
* ఉత్తమ నటుడు - మాథ్యూ మెక్ కొనాప్‌జే(డల్లాస్ బయ్యర్స్ క్లబ్)
* ఉత్తమ నటి - కేట్ బ్లాంషె (బ్లూ జాస్మిన్)
* ఉత్తమ దర్శకుడు - ఆల్ఫాన్సో కారియెన్ (గ్రావిటీ)
* ఉత్తమ సహాయ నటుడు - జారెడ్ లెటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)
* ఉత్తమ సహాయ నటి - లుపితా న్యాంగో (12 ఇయర్స్ ఎ స్లేవ్)
* ఉత్తమ కాస్టూమ్స్ డిజైనర్ చిత్రం - దిగ్రేట్ గాట్స్ బీ
* ఉత్తమ విదేశీ చిత్రం - ది గ్రేట్ బ్యూటీ (ఇటాలియన్)
* ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ - మిస్టర్ హూబ్లాట్
* ఉత్తమ యానిమేట్ ప్యూచర్ ఫిల్మ్ - ఫ్రోజెన్
* ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం - 20 ఫీట్ ఫ్రమ్ స్టార్ డమ్
* ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రం - ద లేడీ ఇన్ నెంబర్ 6
* ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - హీలియం
* ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ చిత్రం - డల్లాస్ బయ్యర్స్ క్లబ్
* సాంకేతిక విభాగంలో గ్రావిటి చిత్రానికి 5 అవార్డులు. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్‌మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్ విభాగాల్లో 'గ్రావిటీ' చిత్రం ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.
- See more at: http://www.andhrajyothy.com/node/71610#sthash.LaNo819i.dpuf

No comments:

Post a Comment