Sunday 16 March 2014

మళ్లీ మాదే విజయం - Rahul Gandhi

మళ్లీ మాదే విజయం

Published at: 17-03-2014 02:48 AM
ఇప్పటిక్టఏ ఎక్కువ సీట్లు గెలుస్తాం
'అల్లర్ల మోదీ'కి క్లీన్‌చిట్ ఇవ్వలేం
స్కాముల్లో మునిగిన బీజేపీతో అనినీతి నిర్మూలన అసాధ్యం
సరైన అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా
పీటీఊ ఇంటర్వ్యూలో రాహుల్
న్యూఢిల్లీ, మార్చి 16: 'కాంగ్రెస్ అండర్‌డాగ్ కానే కాదు. పదేళ్లు అధికారంలో కొనసాగిన యూపీఏ-2పై ప్రజల్లో కొంత వ్యతిరేకత సహజమే. అయితే, అది ప్రస్తుత ఎన్నికలలో మేం ఓడిపోయేంత కాదు' అని కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్న చిదంబరం వ్యాఖ్యలపై రాహుల్ ఇలా స్పందించారు. సార్వత్రిక ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుని ముందుకెళ్తున్నామని అందులో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 206 సీట్లు సాధించిన 2009 నా టి ఎన్నికల కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తామ న్నారు. యూపీఏ-3 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్.. పలు అంశాలను ప్రస్తావించారు. గత పదేళ్ల పరిపాలనలో ప్రజలకు కాంగ్రెస్ చేరువ కాలేకపోయిందన్న ప్రశ్నలకు తాము ఎంతో పారదర్శకమైన పాలన అందించామని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామ ని రాహుల్ చెప్పారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్ ఇవ్వడం తొందరపాటైన చర్య అని రాహుల్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన చేతుల మరకలను తుడిచేశారని ఆరోపించారు.
అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన నైతిక బాధ్యతతోనైనా దానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీకి క్లీన్‌చిట్ ఇస్తూ సుప్రీం కోర్టు నియమించిన సిట్ తప్పులతడక నివేదిక ఇచ్చిందని, దానిపై ఇప్పటి వరకూ పై కోర్టుల్లో పరిశీలన జరగలేదని ఆయన చెప్పారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. దేశంలో పేదలకు చోటుండరాదు.. వివిధ మతాలు, భావాలు ఇక్కడ కొనసాగరాదన్నది బీజేపీ విధానమైతే.. ప్రతి ఒక్కరి స్వేచ్ఛను గౌరవించాలన్నది కాంగ్రెస్ విధానమని రాహుల్ చెప్పారు. దేశంలోని మెజార్టీ ప్రజల ఆలోచనలను అణగదొక్కాలని బీజేపీ చూస్తోందని, అధికారాన్ని కేంద్రీకరించి.. వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఆ పార్టీ చూస్తోందని ఆరోపించారు.
ఈ విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మోదీతో దేశానికి ముప్పేనని అన్నారు. యూపీఏ పాలనతో నిస్పృహకు గురైన ప్రజలు మోదీ వంటి బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నది వాస్తవం కాదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. దేశం బలమైన నాయకత్వాన్ని కోరుకుంటుందని తానూ ఒప్పుకొంటానని, అయితే, బలమైన అనే పదానికి అర్థం ఏమిటో లోతుగా ఆలోచించాల్సి ఉందన్నారు. బలవంతంగా అందరినీ తొక్కుకుంటూ అరాచకంగా ముందుకు పోవడం బలం కాదని చెప్పారు. అవినీతి, అక్రమాలలో ఘనమైన చరిత్ర ఉన్న బీజేపీతో అవినీతి నిర్మూలన అసాధ్యమని చె ప్పారు. సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రధాని మన్మోహన్ క్షమాపణలు చెప్పారని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా విచారం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మీరేందుకు క్షమాపణ చెప్పరన్న ప్రశ్నకు.. 'అమాయకులైన ప్రజలు చాలామంది ఆ అలర్లలో మరణించారు. ఇలాంటి సంఘటనలు వాంఛనీయం కాదు' అని బదులిచ్చారు.
కాంగ్రెస్ అండర్ డాగ్
"మా చేయి(కాంగ్రెస్ గుర్తు) బలహీనమైందనుకోవచ్చు. అయితే, అది బలోపేతం కాదని అనుకోవద్దు. ప్రస్తుత పరిస్థితులలో చాలా కష్టతరమైన ఒక పనిని(ఎన్నికలను) మేం భుజానికెత్తుకున్నాం. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ని అండర్‌డాగ్ (గెలవడంపై ఏ మాత్రం అంచనాలు లేని జట్టు)గా పేర్కొంటున్నారు. అయినా మేం విజయం సాధిస్తాం''
- శనివారం తమిళనాడులో చిదంబరం
సరైన అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా
న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీకి ఓ హోదా ఉంది! ఆయన పెళ్లి చేసుకుంటారా లేదా.. ఇప్పటికే 43 ఏళ్లు వచ్చేశాయి.. చేసుకుంటే ఎప్పుడు.. కాంగ్రెస్ నేతల నుంచి సామాన్యుల దాకా చాలా మందికి వచ్చే సందేహాలివి!! ఈ సందేహాలకు రాహుల్ ఆదివారం సమాధానమిచ్చారు. సరైన అమ్మాయి దొరకగానే సప్తపది ఖాయమని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆ సంభాషణ ఇలా సాగింది..
మీ పెళ్లెప్పుడు?
ఈ ప్రశ్న ప్రతిసారీ ప్రస్తావనకు వస్తూనే ఉంది.. ప్రతిసారీ!! ప్రస్తుతానికైతే నేను ఎన్నికల పోరులో నిమగ్నమై ఉన్నాను. దురదృష్టవశాత్తూ నా వ్యక్తిగత జీవితంపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను.
రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటారా? లేక ఏడాది తర్వాతా?
నాకు సరైన అమ్మాయి దొరికినప్పుడు.
అంటే ఇప్పటిదాకా మీకు సరైన అమ్మాయి కనిపించలేదా?
నాకు సరైన అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను.
మీ అభిరుచులు ఏమిటి?
నేను బాగా చదువుతాను. ఎక్కువగా.. నాన్‌ఫిక్షన్. అలాగే.. హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ ఎఫైర్స్.. ఇలా నా పనికి సంబంధించినవి చాలా ఎక్కువగా చదువుతాను. ఇంకా.. మధ్యప్రాచ్యం, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, చైనాల గురించి ఎక్కువగా చదువుతాను. ప్రియాంక (సోదరి) చూసినన్ని హిందీ సినిమాలు నేను చూడను. హాలీవుడ్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాలు నన్ను తరచుగా నిరాశకు గురి చేస్తాయి. నాకు అభిమాన నటీనటులంటూ ఎవరూ లేదు.

No comments:

Post a Comment