Tuesday 4 March 2014

సుప్రీం స్టే ఇస్తే రాజకీయాల్లో కొనసాగుతా


సుప్రీం స్టే ఇస్తే రాజకీయాల్లో కొనసాగుతా
రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్డు స్టే ఇస్తే తిరిగి రాజకీయాల్లో కొనసాగుతా. పదవిలో లేకున్నా ప్రజలకు సేవలు అందిస్తా. నాతోపాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో సహకరించిన మిగిలిన ఎంపీలకు కృతజ్ఞతలు. వారు ఏ పార్టీ నుంచి పోటిచేసినా పిలిస్తే ప్రచారం చేస్తా.
-కృష్ణా జిల్లా తిరువూరులో విలేకర్లతో లగడపాటి రాజగోపాల్
అలాగైతే..టీడీపీ తెలుగు కాంగ్రెస్ అవుతుంది
కాంగ్రెస్ నుంచి వచ్చే వారందరినీ పార్టీలో చేర్చుకుంటే టీడీపీ కూడా తెలుగు కాంగ్రెస్‌గా మారిపోతుంది. పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి కొద్ది రోజులు కూడా ఖాళీగా ఉండలేకే మాజీ మంత్రులు టీడీపీలో చేరుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పని అయిపోయింది. మరో రెండున్నర దశాబ్దాల వరకు ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. అందుకే అధికార దాహంతో తాజా మాజీ మంత్రులు మా పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అవకాశం ఇస్తే కాసు వెంకట కృష్ణారెడ్డి, పార్థసారథితోపాటు పలువురు తాజా మాజీ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సేవాభావం, మంచి ప్రవర్తన ఉన్న నేతలనే మా పార్టీ చేర్చుకుంటుంది. పార్టీ బలహీనంగా ఉన్న చోట, నాయకత్వలేమి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ నుంచి వలస వచ్చే నాయకులకు అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలూ, మాజీ మంత్రులు టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు, హత్యాకాండకు పాల్పడ్డారు. అలాంటి వారిని టీడీపీ ఉపేక్షించదు.
-గుంటూరులో విలేకర్లతో టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు
పేదలను ముంచి..ప్రభువును వంచింది...
'చంద్రబాబు పాత తరం మనిషి' అంటూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొత్త తరం అవినీతికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. జగన్ అన్నట్లు చంద్రబాబు పాతతరం అనుభవం, విలువలు కలిగిన మనిషే. కొత్తతరం ఆలోచనలు, సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసి చూపారు. ప్రస్తుతం కుంటుపడిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపే సత్తా కూడా ఆయనకే ఉంది. అధికారంలోకి రాగానే సీమాంధ్ర చరిత్ర మార్చే సంతకాలు చేస్తానని జగన్ ప్రకటన చేశారు కదా.. మొదటి సంతకం ఖనిజ సంపద దోపిడిపై, రెండో సంతకం భూముల ఆక్రమణపై, మూడో సంతకం లంచాల క్రమబద్ధీకరణపై, నాలుగో సంతకం దొంగ నోట్లు, దోపిడీదారుల రక్షణపై చేస్తారు. వైఎస్ఆర్.. పేదలను ముంచి సొమ్ము కట్టబెడితే, జగన్ తన తల్లిని, చెల్లిని అడ్డం పెట్టుకుని ప్రభువును వంచించి సోనియా కాళ్ల దగ్గర కాపలా కాస్తున్నారు. ఇప్పటికే జగన్ మీద సీమాంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కేసులు నమోదైనాయి. సోనియా పదవి పోగానే ఢిల్లీలో కూడా కేసులు నమోదవుతాయి. ఇకపై జగన్.. నాలుగు రాష్ట్రాల జైళ్లలోనూ సంతకాలు పెడుతూ తిరుగాల్సి ఉంటుంది. -టీడీపీ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్
జైరాం కాదు జైరావణ్
'సీమాం«ద్రుల రాజధానిని నిర్ణయించడానికి నీవెవరు?' గుంటూరు పర్యటనకు అధికసంఖ్యలో పోలీసుల రక్షణ అవసరమా? 'యుద్ధానికి ఏమైనా వచ్చావా?' గుంటూరు కారాన్ని ఒక్కసారి రుచి చూపిస్తే సీమాంధ్రుల పవరేంటే ఏమిటో తెలుస్తుంది. మీరు చెప్పేవన్నీ నిజాలైతే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లేదా గుంటూరు నుంచి పోటీ చేయండి. మీవి తప్పుడు మాటలు.. తప్పుడు విధానాలు.. సీమాంధ్ర గురించి, వారి అవసరాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. రాష్ట్ర రాజధాని, హైకోర్టు కొన్ని రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల ఉన్నాయంటున్నారు. అత్యధిక రాష్ట్రాల్లో ఒకే చోట ఉన్న విషయం మీకు తెలియకపోవడం దురదృష్టకరం. సీమాంధ్రకు సంబంధించి ఆయా అంశాలను నిర్ణయిస్తారని చెబుతున్న నిపుణులు... ఏ కుంభకోణంలో నిపుణులు? ఏ దోపిడీలో నిందితులు? సీమాంధ్రకు మీ దొంగల కమిటీ అవసరం లేదు. మీరు జైరాం కాదు 'జై రావణ్'. సీమాం«ద్రుల పాలిట రావణుడివి. మీకు శ్రీరాముడి వంటి చంద్రబాబు నాయకత్వంలో సీమాం«ద్రులు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాచుకోండి.
- కేంద్ర మంత్రి జైరాం రమేష్‌పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి ధ్వజం
- See more at: http://www.andhrajyothy.com/node/72282#sthash.TAXtcRWx.dpuf

No comments:

Post a Comment