Tuesday 4 March 2014

తమాషా చేస్తున్నారా?..తోలు తీస్తాం

తమాషా చేస్తున్నారా?..తోలు తీస్తాం

Published at: 05-03-2014 06:23 AM
 1  0  0 
 
 

హైదరాబాద్ సిటీ, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవితో పాటు 60 సీట్లను రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై విధాన నిర్ణయాన్ని నాలుగురోజుల్లోగా తీసుకోవాలని తెలిపాయి. మంగళవారం 96 కుల సంఘాలు, 45 బీసీ సంఘాల కీలక భేటీ జూబ్లీ హాలులో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించిన కృష్ణయ్య.. ఆ తర్వాత వివరాలు ప్రకటించారు. దమ్మున్నవారంతా చట్టసభలకు దూరంగా ఉంటున్నారని, విజ్ఞానంలేని అగ్రకులాలకు చెందినవారు సీఎంలు అవుతున్నారని అన్నారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాలుగు రోజుల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని, తెలంగాణలో సీఎం పదవితో పాటు 60 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 90 సీట్లు ఇచ్చే పార్టీకే మద్దతుఇస్తామని స్పష్టం చేశారు. దొరల రాజ్యానికి గోరీ కడతామని, తమాషా చేస్తే తోలు తీస్తామని హెచ్చరిం చారు. బీసీల్లో రాజకీయ చైతన్యం గుర్తించాకే.. తెలంగాణలో బీసీలకే సీఎం పదవి ఇస్తామని టీడీపీ ప్రకటి ంచిందని తెలిపా రు. జనాభా ప్రాతిపదికన బీసీలకు వాటా అందాలని, జనాభాలో 15 శాతంగా ఉన్న అగ్రకులాలు 66 ఏళ్లు పరిపాలించా యని, బీసీలు ఇంకెన్నాళ్లు అధికారానికి దూరంగా ఉంటారని, ఇక సహించేది లేదని ఆయన అన్నారు. టీడీపీలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ కూడా సీఎం పదవిని బీసీలకు ఇస్తామని ప్రకటించాలని కోరారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, రూ.25 వేల కోట్లతో బీసీలకు రాష్ట్రస్థాయిలో, రూ.50 వేల కోట్లతో జాతీయ స్థాయిలో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ఉద్యోగాల్లో బీసీల సంఖ్య పెరగాలని, దీనికోసం పోరాడాతామని తెలిపారు. రెండు రాష్ట్రాలు కూడా సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్ర కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ (బీసీ యువజన సంఘం), గుజ్జకృష్ణ(బీసీ ప్రజా సమితి), ర్యాగ రమేష్(బీసీ విద్యార్థి సంఘం), పెరిక సురేష్(బీసీ మేధావులు), యెగ్గే మల్లేశం(కురుమ సంఘం), వేముల వెంకటేష్(వడ్డెరసంఘం), జి.మల్లేష్‌యాదవ్ (బీసీ ఫ్రంట్), జాజులకృష్ణ తదితర బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/72110#sthash.kj2nkdmC.dpuf

No comments:

Post a Comment