Monday 17 March 2014

బీసీకి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది బీజేపీయే

నమ్మక ద్రోహానికి అర్థం తెలియనివాళ్లే బీజేపీని విమర్శిస్తున్నారు : వెంకయ్య

Published at: 17-03-2014 15:15 PM
గుంటూరు, మార్చి 17 : 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, సీపీఐలు టీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకుని ప్రత్యేక తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు సీమాం«ద్రులు ఎందుకు నోరు మెదపలేదని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. సోమవారం గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి అర్థం తెలియనివాళ్లే బీజేపీని విమర్శిస్తున్నారని అన్నారు.
దేశంలో అధికారంలోకి బీజేపీ వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సభలో బిల్లును అడ్డుకోవడమే నమ్మకద్రోహం అవుతుందని, బీజేపీని విమర్శించేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. సొంతప్రాంతంపై జరుగుతున్న అన్యాయంపై రాజ్యసభలో సీమాంధ్ర ప్యాకేజీ కోసం పోరాటం చేశారని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రాంతాల పేర్లు తెలియనివాళ్లు రాష్ట్రాన్ని విభజించారని ఆయన తెలిపారు.
దేశంలొ మొట్టమొదటి సారిగా బీసీకి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది బీజేపీయేనని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనసేన పార్టీ విధి విధానాలు ప్రకటించిన తర్వాతే ఆ పార్టీతో పొత్తుపై బీజేపీ ఆలోచన చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్పి కాంగ్రెస్ ఏకపక్షంగా విభజించిందని, అందుకే సీమాంధ్రలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని వెంకయ్యనాయుడు వెల్లడించారు.

No comments:

Post a Comment