Thursday 9 June 2016

నటుడి కిడ్నాప్ కేసులో ఛానల్ సీఈవో అరెస్ట్

నటుడి కిడ్నాప్ కేసులో ఛానల్ సీఈవో అరెస్ట్

Sakshi | Updated: June 09, 2016 13:45 (IST)
నటుడి కిడ్నాప్ కేసులో   ఛానల్ సీఈవో అరెస్ట్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : సినీనటుడు  కాలెపు శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో మొత్తం11మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఛానల్ సీఈవో  శివకుమార్ సహా సీఐడీ హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 74వేల నగదు, హ్యాండీ క్యామ్సదరు ఛానల్మైక్, కారు, గోల్డ్ చైన్, 13 సెల్ ఫోన్లు, బంగ్లాదేశ్ కు చెందిన పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే సీఐడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డు ఎస్ అవతారం ఎత్తాడు. ఛానెల్లో పనిచేస్తున్న డ్రైవర్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు మహిళా రిపోర్టర్ అవతారం ఎత్తారు. అంతా కలిసి సినీ నటుడి ఇంట్లోకి ప్రవేశించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నావంటూ బెదిరించి డబ్బులు లాక్కున్నారు. అంతేకాకుండా ఇంకా డబ్బు కావాలంటూ కిడ్నాప్కు పాల్పడి పోలీసులకు చిక్కారు.

వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణానగర్లో నివసించే సినీ నటుడు కాలెపు శ్రీనివాసరావు(48) నివాసంలోకి గత నెల 31 తేదీన ఉదయం 10.30 గంటలకు అయిదుగురు యువకులు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. తమను తాము పోలీసులమని, న్యూస్ఛానెల్ ప్రతినిధులమంటూ లాఠీతో పాటు డమ్మీ పిస్టల్, ఛానెల్ లోగోతో లోనికి ప్రవేశించి శ్రీనివాసరావును వ్యభిచారగృహం నిర్వహిస్తున్నావంటూ కెమెరా ఆన్చేసి బెదిరించారు. బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు. బలవంతంగా కారులో తీసుకుని వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బును డ్రా చేయించారు. రూ. 2 లక్షలు ఇస్తే టీవీ ఛానెల్లో రాకుండా చేస్తామంటూ నగరమంతా తిప్పారు. వారి బారినుంచి తప్పించుకొని బయటపడ్డ శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారించగా.. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్ఐగా బిల్డప్ ఇచ్చాడు. టీవీ ఛానెల్ డ్రైవర్గా పని చేస్తున్న మధు కానిస్టేబుల్గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు ఛానెల్ విలేకరినంటూ అదరగొట్టారు. ఛానెల్ యజమానే మీ జీతాలు మీరే సంపాదించుకోండి నాక్కూడా నెలకు ఒక్కొకరు రూ.25 వేలు తెచ్చివ్వండి అని చెప్పడంతో తామంతా రోడ్డు కెక్కామని నిందితులు తెలిపారు. ఛానెల్ ప్రతినిధులమంటూ చెప్పుకున్న జలీల్, జగదీష్, మధు, సంజయ్రెడ్డి, లక్ష్మి, దుర్గ, హోంగార్డు రాజులను అదుపులోకి తీసుకున్నారు.


No comments:

Post a Comment