Saturday 11 June 2016

తాలిబన్ స్థావరాలపై దాడులు చేయండి: అమెరికాను కోరిన పాక్ ఆర్మీచీఫ్

తాలిబన్ స్థావరాలపై దాడులు చేయండి: అమెరికాను కోరిన పాక్ ఆర్మీచీఫ్
11-06-2016 15:20:16

ఇస్లామాబాద్ : అఫ్గనిస్థాన్‌లోని తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ మిలిటెంట్లు, ఆ సంస్థ చీఫ్ ముల్లా ఫజుల్లా రహస్య స్థావరాలపై బాంబు దాడులు చేయాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీప్ అమెరికాను కోరారు. అఫ్గానిస్థాన్‌లోని కమాండర్ రిజల్యూట్ సపోర్ట్ మిషన్‌కు చెందిన జనరల్ జాన్ నికొల్సన్, అఫ్గాన్, పాకిస్థాన్ వ్యవహారాల అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ ఆల్సన్‌కు మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు కోరారు. అఫ్గనిస్థాన్‌ను కేంద్రంగా చేసుకొని పాక్‌లో కుట్రకు పాల్పడే వారిని తాము ఉపేక్షించబోమని షరీఫ్ స్సష్టం చేశారు. అఫ్గనిస్థాన్ లో శాంతి స్థాపనకు చైనా, అఫ్గాన్, అమెరికాతో కలిసి పనిచేయడానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందని షరీఫ్ స్పష్టం చేశారు. మే 21న బలూచిస్తాన్‌లో సిఐఎ డ్రోన్ దాడిలో అఫ్గన్ తాలిబన్ చీఫ్ ముల్లా మన్సూర్‌ను హతం తర్వాత యుఎస్‌కు చెందిన ఉన్నతాధికారులు ఇస్లామాబాద్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. మే 21 తరహాదాడులు పునరావృతం అయితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందంటూ విదేశాంగ వ్యవహారాలలో ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ అమెరికా అధికారులను ఇటీవల
హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా ఉన్నతాధికారులు సర్తాజ్ అజీజ్‌తో సమావేశమయ్యారు.

No comments:

Post a Comment