Sunday, 24 April 2016

Uma Vs Harish

మంత్రి దేవినేని ఉమా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు: హరీష్‌రావు
24-04-2016 20:53:54

హైదరాబాద్: ఏపీ రాజకీయ నేతలపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఏపీ మంత్రి దేవినేని ఉమా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, రాజోలి బండ, పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్లు తరలించుకుపోతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిండి ఎత్తిపోతలకు సమగ్ర సర్వే చేపట్టాలని, సమైక్య రాష్ట్రంలో జీవో ఇచ్చింది వాస్తవం కాదా అని ఏపీ మంత్రులను ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతలకు 2013లోనే సమగ్ర రిపోర్టు తయారు చేయాలని జీవో నెం. 72 జారీ చేశారని ఆయన తెలిపారు. అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని నిలదీశారు. అప్పటి ప్రాజెక్ట్‌లనే తెలంగాణకు అనుకూలంగా మార్చుకుని ఇప్పుడు నిర్మిస్తున్నామని హరీష్‌రావు చెప్పారు.

No comments:

Post a Comment