తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి
24-04-2016 19:42:54
విజయవాడ: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉ. 3.30 నుంచి 6 గంటల వరకు విశ్వక్సేనపూజ, వాస్తుపూజ, గణపతి హోమం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సీఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం 4గం. 1నికి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మిస్తున్న నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేశారు. ఈ గదుల్లోనే సీఎం చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.
ముహూర్తం కుదిరింది
ముహూర్తం కుదిరింది
25-04-2016 00:10:08
- తాత్కాలిక సచివాలయానికి ‘లాంఛనంగా’ ప్రారంభోత్సవం
- నాలుగో భవనంలో ఒక గది సిద్ధం
- చంద్రబాబు దంపతుల పూజ, హోమం
తుళ్లూరు/విజయవాడ, ఏప్రిల్ 24: నవ్యాంధ్ర రాజధానిలో తొలి అధికారిక నిర్మాణమైన తాత్కాలిక సచివాలయానికి... ‘అధికారికంగా’ ప్రారంభోత్సవం! మున్ముందు ముహూర్తాలు లేకపోవడతో... సోమవారం బ్రహ్మ ముహూర్తమైన 4.01 గంటలకు తాత్కాలిక సచివాలయ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా ఎల్‌అండ్ టీ నిర్మిస్తున్న నాలుగో భవనంలోని ఒక గదిని ప్రారంభించనున్నారు. ఈ గదిని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేశారు. వేకువజామున 3.30 గంటలకు ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకుంటారు. హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించి సరిగ్గా నాలుగు గంటలా ఒక్క నిమిషానికి తాత్కాలిక సచివాలయంలోని ఒక గదిని ప్రారంభిస్తారు. దాదాపు వెయ్యి మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, జేసీ శ్రీధర్, ఆర్డీవో భాస్కరనాయుడు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు లాంఛనప్రాయంగా సచివాలయానికి ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో... జూనలోపు పూర్తిస్థాయి నిర్మాణాలు పూర్తిచేసి, పరిపాలనను అక్కడికి తరలించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సవ వేడుక అందరికీ పండుగ లాంటిదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
No comments:
Post a Comment