Sunday, 24 April 2016

Solar Airplain

ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ప్రపంచాన్ని చుట్టిన విమానం
24-04-2016 21:44:49

కలాఫోర్నియా : అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అవకాశం సాంకేతికతలోనే ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతాలు చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలో పెట్టింది టెక్నాలజి. ఇప్పుడు ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ఒక విమానం ప్రపంచాన్ని చుట్టింది. సుమారు రెండున్నర్ర రోజులపాటు ఈ ఆకాశ వాహనం గగనంలో విహరించి కాలిఫోర్నియాలో లాండ్ అయ్యింది. ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా.. సోలార్ ఎనర్జీతో ప్రయాణం చేసింది కాబట్టి. ఈ విమానం పేరు సోలార్ ఇంపల్స్-2, దీని రెక్కలకు పొడవాటి సోలార్ ప్లేట్లు అమర్చి ఉంచడం వల్ల నడిచేందుకు కవాల్సిన ఎనర్జీకి ఢోకా ఉండదు. ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుని నుంచి వచ్చే కిరణాల ద్వారా తీసుకునే శక్తితో విమానం నిరంతరాయంగా నడుతస్తూనే ఉంటుంది. ఈ విమానం పేరు సోలార్ ఇంపల్స్-2, దీన్ని నడిపిన వ్యక్తి స్విట్జర్లాండ్‌ దేశస్తుడు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతోతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతమవుతాయని పైలెట్ పిక్కర్డ్ అంటున్నాడు.

No comments:

Post a Comment