భారత్ మాతాకీ జై అననివారిపై చట్టపరమైన చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి మహేశ్ శర్మ
24-04-2016 21:08:03
న్యూఢిల్లీ: భారత్ మాతాకీ జై, వందేమాతరం చెప్పనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. ఉత్తరప్రదేశ్ గోండాలో పర్యటించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అనేందుకు సిగ్గుపడేవారందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన మెడపై కత్తిపెట్టినా తాను భారత్ మాతాకీ జై అనబోనని చెప్పడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది
No comments:
Post a Comment