'బిహార్ కంటే దారుణంగా ఏపీ'
Sakshi | Updated: December 17, 2015 10:42 (IST)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు గతంలో బిహార్ రాష్ట్రం కంటే దారుణమని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిహార్‌కు తాతలా తయారైందని చెవిరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏమన్నారంటే...
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏమన్నారంటే...
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాఫియాను ప్రోత్సహిస్తూ దుశ్శాసన పాలన చేస్తున్నారని విమర్శించారు
- తప్పులన్నీ మీరుచేసి, ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసి, మీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే, వాళ్లను శిక్షించాల్సింది పోయి మా పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. వీళ్ల అదృష్టం వల్ల ఇప్పటివరకూ ఏ ఎన్నికలూ రాలేదు
- ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఎంత కసిగా, ఎంత కోపంతో ఉన్నారో ఏవైనా చిన్న ఎన్నికలొస్తే తెలిసేది
- చంద్రబాబు చెంప ఛెళ్లుమనేలా తీర్పు ఇచ్చేవారు
- తొమ్మిదేళ్ల పాటు సాగిన నరకాసుర పాలన, దుశ్శాసన పాలన మళ్లీ కొనసాగుతోందని ప్రజలు వాపోతున్నారు
- ఎమ్మెల్యేలకు విమాన టికెట్లు ఇచ్చి విదేశాలకు పంపారు
- ఒకే ఇంట్లో ఉండి, తమ్ముడు చేసేది అన్నకి తెలియదంటే ఎవరు నమ్ముతారు? నిఘా డీజీపీయే నిందితులతో ఫొటోలు తీయించుకుంటున్నారు
- మరో నిందితుడు చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు. ఇక్కడ ఆటవిక రాజ్యం కొనసాగుతోంది
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. బీహార్‌కు తాతలా తయారైంది
- అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మీడియా చేతిలో పెట్టుకుని ఏమైనా చేసేయొచ్చని అనుకుంటే ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు
- అందరం చేయి చేయి కలుపుదామని, తప్పు ఎవరు చేసినా శిక్షించేలా ముందుకెళ్దామంటే మహిళలపై జరుగుతున్న దారుణాల మీద మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు
- మాకు విమర్శించాలన్న ఆలోచన లేదు.. తప్పును సరిదిద్దాలన్నదే మా ఆలోచన
- అసెంబ్లీలో కూడా మాట్లాడేందుకు వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోతోంది
No comments:
Post a Comment