ఎంపీల రవాణా ఖర్చులు ఎంతో తెలుసా?
Others | Updated: December 26, 2015 10:34 (IST)
న్యూఢిల్లీ: 2013-14 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యులు చేసిన ఖర్చు ఎంతో తెలుసా... అక్షరాలా 147.38 కోట్లు. అయితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 135.8 కోట్లుగా ఉంది. సమాచార హక్కు చట్టం కింద వేద్ పటేల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశీయ రవాణా ఖర్చుల కింద ఎంపీల విమాన ప్రయాణాలే కాకుండా రైలు, రోడ్డు ప్రయాణ ఖర్చులు, రోజువారి భత్యాలు కూడా వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం పార్లమెంట్ సంభ్యుల జీత భత్యాలను భారీగా పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంది. బేసిక్ శాలరీని నెలకు 50 వేల నుండి లక్ష రూపాయలకు, నియోజక వర్గ భత్యం 45 వేల నుండి 90 వేలకు, సెక్రటేరియల్, ఆఫీస్ అలవెన్స్ ను కూడా 45 వేల నుండి 90 వేలకు పెంచే ప్రతిపాదన ఉంది.
No comments:
Post a Comment