ఆర్థిక నగరంగా.. ఉద్ధండరాయునిపాలెం
28-12-2015 06:50:59
రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ఉద్ధండరాయునిపాలెం- వెంకటపాలెం మధ్య ప్రాంతాన్ని ఆర్థిక నగరంగా తయారు చేయాలని తుది మాస్టర్ ప్లానలో నిర్ణయించారు. సెంట్రల్ బిజినెస్ డిసి్ట్రక్ట్‌గా నిర్ణయించిన లింగాయపాలెం - ఉద్ధండరాయునిపాలెం- తాళాయిపాలెం మధ్య ప్రాంతాన్ని ఆర్థిక నగరంగా తీర్చిదిద్ధాలని సీఆర్‌డీఏ భావిస్తోంది.
వాగులే నీటి వనరులు
పాలవాగు, చీకటి వాగు , ఐయ్యన్న వాగు, కోటేళ్ళ వాగులతోపాటు, కొండవీటి వాగు ఉన్నాయి. వాగు నీటిని స్టోరేజ్ చేసి, రాజధానికి అవసరమైన జలాలను నిల్వ చేయటానికి తుది మాస్టర్ ప్లాన్ లో ప్రణాళికలు సూచించినట్టు తెలుస్తుంది. రాజధానిలో ఉన్న మూడు ఎత్తిపోతల పథకాలను సద్వినియోగం చేసుకుంటే నీటి అవసరాలు పూర్తిగా తీరతాయని సీఆర్‌డీఏ భావిస్తున్నట్లు సమాచారం. రాజధాని మా స్టర్ ప్లాన్ ప్రకారం 29 గ్రామాల్లో ఒకేసారి అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నట్లు స్పష్టమవుతుంది.
నది పక్కన బిజినెస్ పార్కులు..
నది పక్కనే ఉన్న తాళ్ళయపాలెం, నెక్కల్లులో సెంట్రల్ బిజినెస్ పార్కులు ఏర్పాటుకు చేయనున్నారు. స్పెషల్ జోన్ కింద ఒక్కో గ్రామంలో కొంత.. మాస్టర్ ప్లాన్‌లో స్పెషల్ జోన్ కింద ఒక్కో గ్రామంలో కొంత భాగాన్ని కేటాయించారు.
ఆధ్యాత్మికం అనంతవరం
రాజధానిలోని అనంతవరం ఆధ్యాత్మికతతో పరిఢవిల్లనుంది. అనంతవరం కొండపై మీసాల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబరు 16న స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతవరం ఆలయాన్ని మినీ తిరుమలగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన. ఇందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది.
విద్యా కేంద్రంగా ఐనవోలు
రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకంలో 99 శాతం భూమి ఇచ్చిన ఐనవోలు, శాఖ మూరు గ్రామాలను విద్యా, విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్ధాలని సీఆర్‌డీఏ తుది మాస్టర్ ప్లానలో ప్రతిపాదించింది. శాఖమూరు భూముల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నాలెడ్జ్ సెంటరును ఏర్పాటు చేయనున్నారు. ఐనవోలు పరిధిలో నూతన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
న్యాయ నగరం..నేలపాడు
రాజధానిలో న్యాయస్థానాలకు అత్యంత ప్రా ధాన్యం ఇవ్వనున్నారు. తుది మాస్టర్ ప్లాన్ ప్రకా రం నేలపాడు- వెలగపూడి మధ్య భూముల్లో జస్టిస్ సిటీ పేరుతో న్యాయనగరాన్ని నిర్మించనున్నా రు. ఈ నగరంలో హైకోర్టుతో పాటు న్యాయస్థానా ల సముదాయం, న్యాయమూర్తుల నివాసాలు, సి బ్బందికి గృహాలు నిర్మించనున్నారు. ఈ సిటీకి అతి సమీపాన రాజధాని ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది.
క్రీడానగరం బోరుపాలెం
లంకమాస్టర్ ప్లానలో క్రీడా నగరాన్ని బోరుపాలెం లంకల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. లంక భూ ములు కావడంతో నదికి సమీపంలో ఉల్లాసభరిత వాతావరణం ఉంటుందని భావించి ఈ ప్రాతిపాదన చేసినట్లు సమాచారం. ఇక్కడే సకల వసతులతో అంతర్జాయ స్థా యి ప్రమాణాలతో స్టేడియం నిర్మించే అవకాశాలున్నాయి. క్రీడాకారులకు శిక్షణ, వ సతి గృ హాలను ఏర్పాటు చేయనున్నా రు.
గవర్నమెంట్ కోర్.. లింగాయపాలెం
నూతన రాజధానిలో అధిక జన సాంద్రత ఉండే లింగాయపాలెంను ప్రభుత్వం ఇప్పటికే సీడ్ క్యాపిటల్‌గా నిర్ణయించింది. లింగాయపాలెం- రాయపూడి- కృష్ణా కరకట్ట మధ్య గవర్నమెంట్ కోర్‌ను ఏర్పాటు చేయాలని తుది మాస్టర్ ప్లానలో పేర్కొన్నారు. అక్కడే శాసనసభ, సచివాలయం నిర్మించాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది.
ఎలక్ర్టానిక్స్ రంగం.. బేతపూడి
ఎలక్ర్టానిక్స్ రంగానికి సీఆర్‌డీఏ ప్రాధాన్యం ఇస్తోంది. కురగల్లు- బేతపూడి మధ్య భూముల్లో ఎలక్ర్టికల్ పరిశ్రమలను ఏర్పాటుకు అనుమతించనున్నట్లు మాస్టర్ ప్లానలో పేర్కొన్నారు. ఎలక్ర్టానిక్ రంగానికి ఉద్ధేశించిన కురగల్లు - బేతపూడి గ్రామాలు కాజా- ఇబ్రహీంపట్నం మధ్య నిర్మించే బైపాస్ రోడ్డుకు అతి సమీపంలో ఉంటాయి.
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో ప్రతి ఊరికి ప్రాధాన్యం
అమరావతి
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో ప్రతి ఊరికి ప్రాధాన్యం
28-12-2015 06:42:53
- అన్ని గ్రామాల్లోనూ కీలక విభాగాలు
రాజధాని ప్రాంతంలో ప్రతి ఊరికి మాస్టర్ ప్లానలో స్థానం లభించింది. రైతులు భూ ములిచ్చిన ప్రతి గ్రామానికి ఏదోక రంగంలో ప్రాధాన్యం కల్పించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో అన్ని గ్రామాల రెవెన్యూ భూములను రాజధాని నిర్మాణానికి వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
తుళ్లూరు, తాడికొండ : రాజధానికి కీలకమైన శాసనసభ, సచివాలయం ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ గా పేర్కొన్న లింగాయపాలెం, రా యపూడి గ్రామాల పరిధిలో రానున్నాయి. అక్కడే అన్ని ప్రభుత్వ ము ఖ్య కార్యాలయాలు నిర్మితం కానున్నట్లు తుది మాస్టర్ ప్లానలో స్ప ష్టంగాఉంది. ముంబాయి తరహా ఆర్ధిక నగరంగా ఉద్ధండరాయునిపా లెం, తాళాయిపాలెం గ్రామాల పరిధిలో ఏర్పాటు కానుంది. న్యాయనగరం నేలపాడు- వెలగపూడి మధ్య నిర్మితం కానుంది. టూరిజానికి ఉం డవల్లి, వైద్య ఆరోగ్యరంగానికి కృష్ణాయపాలెం, శాఖమూరు,ఐనవోలు విద్యా, విజ్ఞాన కేంద్రాలుగానూ, క్రీడలకు బోరుపాలెం, ఆధ్యాత్మికతకు అ నంతవరం, బేతపూ డి- కురగల్లు గ్రామాలను ఎలక్ర్టానిక్ రంగంలో నూ అభివృద్ధి చేయనున్నట్లు మా స్టర్ ప్లానలో చూపారు. మంగళగిరిలో నిర్మించే ఎయిమ్స్, స్టేడియం, మాస్టర్‌ప్లానలో భాగంగానే సీఆర్‌డీఏ పరిగణిస్తోంది. సాధారణ వా ణిజ్య ప్రాంతంగా అనంతవరం, తు ళ్లూరు, దొండపాడు, మల్కాపురం, కృష్ణాయపాలెం, బేతపూడి, కురగల్లు, పెనమాక, బిజినెస్ పా ర్కులుగా నెక్కల్లు, తాళాయిపాలెం, లాజిస్టిక్ జోనగా నులకపేట, బాపూజీనగర్‌ను నిర్ణయించారు. రాజధాని మూడు ప్రధాన జోన్లలో రాయపూడి, లింగాయపాలెంను ప్రభుత్వ జోనగా నిర్ధేశించారు. మాస్టర్ ప్లానలో రాయపూడి, ఉ ద్ధండరాయునిపాలెంతో పాటు వెలగపూడి, పిచ్చుకలపాలెం, నెక్కల్లు, శాఖమూరు, నిడమర్రును ప్రత్యేక జోనగా పరిగణించారు.
పచ్చదనం అమరావతి
సొంతం...పచ్చదనం అమరావతి మణిహారం కానుంది. ఇప్పటికే రాజధాని గ్రామల్లోని 14 ప్రదేశాలలో అటవీ శాఖ నర్సరీలు ఏర్పాటు చేసి మొ క్కలు పెంచుతున్నారు. రాజధాని లో రైతుల ప్లాట్లు కేటాయించగానే భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. కృష్ణా నదీ పరివాహాక ప్రాంతం మొత్తం పచ్చదనం పరుచుకోనుంది.
హెల్త్ సిటీగా కృష్ణాయపాలెం
మంగళగిరి మండలం కృష్ణాయపాలెం హెల్త్ సిటీగా అవతరించనుంది. వెంకటపాలెం- కాజ బైపాస్ రోడ్డుకు దగ్గరలో హెల్త్ సిటీని నిర్మించనున్నారు. ఇక్కడే అతి పెద్ద వైద్యశాలను, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నివాస సముదాయాలను నిర్మించాలని మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించారు.
పర్యాటకంగా ఉండవల్లి
ఉండవల్లి కేంద్రంగా పర్యాటకాభివృద్ధి చేపట్టాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. విజయవాడకు, నూతన రాజధానికి మధ్యలో ఉన్న ఉండవల్లి రానున్న రోజు ల్లో ప్రఖ్యాత పర్యాటక స్థలంగా ప్రపంచ పర్యాటక పటంలో కీలకం కానుంది. ఉండవల్లిలోటూరిజం సర్క్యూట్‌కు సీఆర్‌డీఏ రూపకల్పన చేయనుంది.
No comments:
Post a Comment