Sunday 27 December 2015

నన్ను పెళ్లాడతావా?

నన్ను పెళ్లాడతావా?

Others | Updated: December 09, 2014 20:53 (IST)
నన్ను పెళ్లాడతావా?
అమెరికాను గడగడలాడించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను బుట్టలో వేసుకునేందుకు రష్యా ప్రయత్నించిందని ఆ దేశానికి చెందిన మాజీ గూఢచారి ఒకరు వెల్లడించారు. తమకు బద్దశత్రువైన అమెరికాకు కొరుకుడుపడని స్నోడెన్ ను తమ దారికి తెచ్చుకునేందుకు మహిళా గూఢచారిని రష్యా ప్రయోగించిందని పేర్కొన్నారు. ఇందుకోసం అన్నా చాప్ మాన్(32) అనే 'వేగు' చుక్కను రంగంలోకి దించిందని కేజీబీ మాజీ ఏజెంట్ బోరిస్ కార్పిచ్ కోవ్ వెల్లడించారు.

ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చాప్ మాన్ తన సోయగాలతో స్నోడెన్ ను వలవేసిందన్నారు. అతడిని ఒక్కసారే కలిసినప్పటికీ పెళ్లి ప్రతిపాదన చేసిందని తెలిపారు. 'స్నోడెన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ ట్వీటర్ లో కోరింది. ఇదంతా పథకం ప్రకారం జరిగిందని కార్పిచ్ కోవ్ పేర్కొన్నారు. ఒకవేళ చాప్ మాన్ ప్రతిపాదనను స్నోడెన్ అంగీకరిస్తే రష్యా పౌరసత్వం తీసుకునేందుకు అర్హుడవుతాడు. ఫలితంగా అతడు శాశ్వతంగా రష్యాలో ఉండిపోవాల్సి రావొచ్చు. పౌరసత్వం వచ్చిన విదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సివుంటుందని వివరించారు.

స్నోడన్ కు చేసిన పెళ్లి ప్రతిపాదనపై స్పందించేందుకు చాప్ మాన్ ఓ ఇంటర్వ్యూలో నిరాకరించింది. రష్యా దౌత్తవేత్త పుత్రిక అయిన చాప్ మాన్ 2010లో వార్తాల్లోకి వచ్చింది. రష్యా ఏజెంటుగా అమెరికాలో పనిచేశానని చెప్పి ఆమె సంచలనానికి తెరతీశారు. గూఢచారి అని బయట ప్రపంచానికి తెలియకముందు న్యూయార్క్ సిటీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఆమె పనిచేసింది. అమెరికా నుంచి రష్యాకు తిరిగొచ్చిన తర్వాత మోడల్ గానూ పనిచేసి ప్రాచుర్యం పొందింది. అమెరికా నుంచి తప్పించుకున్న స్నోడెన్ కు రష్యా ఆశ్రయం ఇచ్చింది. మూడున్నరేళ్లు తమ దేశంలో ఉండేందుకు అతడికి అనుమతినిచ్చింది.

No comments:

Post a Comment