Thursday 2 January 2014

బిగ్ డిబేట్ జరగాలి - Undavalli

బిగ్ డిబేట్ జరగాలి

Published at: 03-01-2014 04:12 AM

 New  0  0 

 



తెలంగాణ అభివృద్ధిని కళ్లకు కట్టాలి : ఉండవల్లి
రాజమండ్రి, జనవరి 2: "ఇంత వరకూ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బిల్లును వెనక్కి తీసుకునే అవకాశం లేదు. అందువల్ల, 23 వరకు రాష్ట్రపతి ఇచ్చిన అవకాశాన్ని పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్చించాలి. ఇప్పటి వరకూ ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడ జరగలేదు? అనే విషయాన్ని చర్చల ద్వారా సుస్పష్టం చేయాలి. దీనిపై అసెంబ్లీలో బిగ్ డిబేట్ జరగాలి. అసెంబ్లీ తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇది మార్గదర్శకం కావాలి'' అని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు.
రాజమండ్రిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతమంది వ్యతిరేకమో, ఎంతమంది అనుకూలమో తెలిసింది కాబట్టి ఇక చర్చ ఎందుకని కొంతమంది అనుకుంటున్నారని, పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకుంటారులే అని కొందరు భావిస్తున్నారని, అది సరికాదని వివరించారు. "శుక్రవారం నుంచి అసెంబ్లీలో జరిగే చర్చలో నిజంగా తెలంగాణ ఎంతమేర అభివృద్ధి చెందిందో తేల్చి చెప్పాలి. దీనికి గణాంకాలు, టేబుల్స్ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ బట్టబయలు చేస్తే ఏ ప్రాంతం వెనకబడి ఉందో స్పష్టమవుతుంది. ఎమ్మెల్యేలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
లేకపోతే చరిత్ర హీనులవుతారు'' అని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ నిర్ణయాన్ని బట్టే బిల్లును పార్లమెంటుకు పంపించాలో వద్దో రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 175 మంది ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారని, 119లోపు ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారని స్పష్టంగా తెలిసినా కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రకటన చేసిందని, ఈ నిర్ణయం సమాఖ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని ధ్వజమెత్తారు. సర్కారియా, శ్రీకృష్ణ కమిషన్ సిఫారసులను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. 23 తర్వాత బిల్లు పార్లమెంట్‌కు వస్తుందని, అక్కడ తాము ఎదుర్కొంటామని చెప్పారు. ఈసారి కూడా అవిశ్వాస తీర్మానాలను ఇస్తామని, గతంలో మాదిరిగా కాకుండా వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను ధైర్యంగా, నిక్కచ్చిగా బయట పెట్టాలని ఆత్మహత్యలకు పురిగొల్పే నేతలను ఎండగట్టాలని సూచించారు.
రాష్ట్ర విభజన విషయంలో ఫెడరల్ వ్యవస్థను పట్టించుకోకుండా మాట్లాడుతున్న బీజేపీ మత హింస బిల్లు విషయంలో ఫెడరల్ వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోవచ్చునని, కాంగ్రెస్ పని అయిపోయిందని, ఈ పరిస్థితుల్లో ఆయన కూడా ప్రధాని పదవిని ఆశించకపోవచ్చుని అన్నారు. కాంగ్రెస్‌కు 200 సీట్లకు మించి వస్తే కానీ ఆయన ఒప్పుకోరని, అన్ని వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. తాను ఇక పోటీ చేయనన్నారు.
జైపాలే మాట్లాడుతున్నారే...పొన్నం ఎంత?
తనకు ఓట్లు వేయరనే భయంతో.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ కావాలనుకొనే జైపాల్ రెడ్డే ఇటీవల తెలంగాణ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారని, అటువంటప్పుడు పొన్నం నోరు జారడంలో ఆశ్చర్యం ఏముందని ఉండవల్లి అన్నారు. శాఖ మార్చే విషయంలో పూర్తి అధికారం సీఎందేనని, శ్రీధర్‌బాబుకు మంచి శాఖ కేటాయించినట్లు కిరణ్ చెబుతున్నారని, ఆయన ఎప్పుడూ అబద్ధాలు చెప్పరని వ్యాఖ్యానించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/49719#sthash.I5fSd5cL.dpuf

No comments:

Post a Comment