Wednesday 15 January 2014

జగన్‌బాబుకు బై బై - సగానికి సగం తగ్గిన బలం

జగన్‌బాబుకు బై బై

Published at: 14-01-2014 04:13 AM

 4  1  0 

 



యువనేత వైఖరితో బెంబేలు
బెదిరిపోతున్న సీనియర్లు
పార్టీకి దూరం దూరం
పోటీకి పొట్లూరి వెనుకంజ..రఘరామ కూడా వెనక్కి!
బాలశౌరి మనస్తాపం..అడుసుమిల్లి ఆవేదన
సబ్బం,సుబ్బారెడ్డి ,తదితర అనేకమందిదీ అదే పరిస్థితి
కుటుంబ సభ్యుల కినుక!
బంధువుల నమస్కారం!
సన్నిహితుల స్వస్తి!
పెట్టుబడిదారులు.. కాంట్రాక్టర్లు.. 

బడా వ్యాపారులు.. దూరం దూరం!
తొలుత ఎగబడ్డవారే.. ఇప్పుడు ఎందుకొచ్చానురా బాబూ అంటున్నారు! తొలుత ఉబలాటపడిన వాళ్లే.. ఇప్పుడు ఉసూరంటున్నారు! ఇప్పటికే సొమ్ములు ముట్టచెప్పిన వాళ్లు గోడకు కొట్టిన సున్నమని నీళ్లు వదిలేసుకున్నారు! ఇప్పుడు జగన్మోహన రెడ్డి పార్టీలో పరిస్థితి ఇదీ!
న్యూఢిల్లీ,హైదరాబాద్, జనవరి 13:వైసీపీలో తొలుత దుకాణం తెరిచారు. 50, 60 కోట్లిస్తే టికెట్ ఇస్తామన్నారు. దీంతో కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులు ఎగబడ్డారు. ముడుపులు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. జగన్‌ను జైల్లోనే కలిసి బేరసారాలు ఆడారు. రహస్యంగా ఫోన్లలో మాట్లాడారు. కానీ, జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రమంగా ఆయన గ్రాఫ్ పడిపోతోందని తెలుసుకుని జారుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది. అంతేనా.. టికెట్ల కోసం వచ్చిన వారి పట్ల జగన్ దురుసు వైఖరి.. మైసూరా రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా ఆయన దగ్గర లేచి నిలబడాల్సి రావడం.. ఎప్పుడు ఏ విధంగా విరుచుకుపడతారో అనే భయం వెంటాడడం.. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని కంటికి రెప్పలా కాపాడిన బాబాయ్ సుబ్బారెడ్డి, సొంత చెల్లెలు షర్మిల తదితర కుటుంబ సభ్యులే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి శ్రేయోభిలాషులు.. జగన్ కోసం మంత్రి పదవినే తృణప్రాయంగా భావించిన కొండా సురేఖ.. నైతికంగా పార్టీకి అండగా నిలిచి.. మూడేళ్లపాటు అడుగడుగునా సమర్థించిన సబ్బం హరి వంటి రాజకీయ నాయకులు.. మారెప్ప వంటి దళిత నాయకులు ఆ పార్టీకో నమస్కారం పెట్టడంతో ఆత్మగౌరవం ఉన్న వారెవరికీ జగన్ పట్ల నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది.
పోటీ పడి.. వెనక్కి
పార్టీ పెట్టకముందు.. పెట్టిన తర్వాత జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రలకు జనం ఎగబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు సోదరి షర్మిల చేసిన పాదయాత్రలకూ జనం పోటెత్తారు. ఆ ప్రజాదరణను చూసి అబ్బురపడిన పలువురు కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు సీట్లు రిజర్వు చేసుకున్నారని, భారీ ఎత్తున ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధపడ్డారని, కానీ, ఇప్పుడు వారే వెనక్కు తగ్గుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉదాహరణకు నర్సాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు రఘురామరాజు కూడా ఇప్పుడు జగన్ పార్టీ తరపున పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు. తాను ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు గోడకు కొట్టిన సున్నం లాంటిదని అనుకుంటానని, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే మరింత వదుల్చుకోవడమే కాక గెలిచే గ్యారంటీ కూడా లేదని అభిప్రాయపడుతున్నట్లు వినికిడి. మరో ప్రము ఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కూడా తొలుత విజయవాడ లోక్‌సభకు పోటీ చేయాలనుకున్నారు.
ఈ మేరకు తొలుత ఢిల్లీకి చెందిన టుడే చాణక్య సంస్థతో సర్వే చేయించారు. గెలుస్తారని తేలడంతో రంగంలోకి దిగా రు. తాజా సర్వేలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మనసు మార్చుకున్నారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒకటి రెండు సీట్లను తాను చెప్పిన వారికి ఇవ్వాలని, వారి అసెంబ్లీ ఎన్నికల ఖర్చును కూడా తాను భరిస్తానని ఆయన కోరారని, అందుకు జగన్ తిరస్కరించారని తెలిసింది. దీంతో, పూర్తిగా పోటీ చేసే యోచననే పొట్లూరి విరమించుకున్నారు. జగన్ పార్టీ తరఫున అనిల్ ఆయన వద్దకు వచ్చి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినా పొ ట్లూరి మనసు మార్చుకోలేదు. పొట్లూరితోపాటు జగన్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగాలనుకున్న మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ తొలుత వైసీపీ నాయకుడు అన్న పేరుతో ప్రకటనలు విడుదల చేసేవారు. ఇప్పుడు తాను వైసీపీలో లేన ని, కేవలం మాజీ ఎమ్మెల్యేగానే తనను భావించాలని ఆ యన అందరికీ చెబుతున్నారు. ప్రకటనలు కూడా అలాగే విడుదల చేస్తున్నారు.
మనసు విరిగిన కుటుంబసభ్యులు
ఇప్పటికే ఒంగోలు సీటు ఇవ్వడానికి నిరాకరించడంతో వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి జగన్‌కు దూరమయ్యారు. కడప నుంచి పోటీ చేయాలనుకున్న షర్మిల కూడా ఆ సీటును అవినాశ్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించడంతో అలిగారు. విశాఖ నుంచి పోటీకి ఆమె నిరాకరిస్తున్నారు.
మైసూరా మనోవేదన
మైసూరా రెడ్డి వంటి సీనియర్ నేత కూడా జగన్ ముందు నిలబడాల్సి రావడం చాలా మందికి బాధ కలిగిస్తోంది. ఎందుకొచ్చానురా భగవంతుడా.. వైఎస్‌నే ఢీకొన్న వాడిని జగన్ వద్ద తలవంచుకోవాల్సి వస్తోందని బాధపడుతున్నట్లు సమాచారం. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిర్వహించిన సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఇప్పుడు అంత విలువ లేదని, పత్రిక నిర్వహణలో కూడా పాత్రను తగ్గించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పాపం.. బాలశౌరి!
ఏలూరు లోక్‌సభ నుంచి పోటీ చేయాలనుకున్న తోట చంద్రశేఖర్ కూడా తన మనసు మార్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక జగన్‌కు తాజాగా ఆంతరంగికుడుగా మారిన మాజీ ఎంపీ బాలశౌరి కూడా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. జగన్‌కు బెయిల్ రావడానికి తానే కారణమని ఆయన చెప్పుకోవడంతో బాలశౌరిని దూరంగా పెట్టారని, ఆయన కోరిన సీటు ఇవ్వడానికి కూడా జగన్ నిరాకరించారని తెలుస్తోంది. గతంలో విజయలక్ష్మి, భారతిలను ఒక పాత మారుతీ కారులో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ వద్దకు బాలశౌరి తీసుకు వెళ్లారని, ఆ తర్వాత అహ్మద్ పటేల్ వారిని సోనియావద్దకు తీసుకువెళ్లారని, అక్కడే డీల్ కుదిరిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అలాంటి బాలశౌరి కూడా ఇప్పుడు మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది.
హరి.. హరీ!
జగన్‌తో ఒకసారి దెబ్బతిన్నవారు మరోసారి ఆయన వద్దకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారనడానికి సబ్బం హరి ఉదంతమే సాక్ష్యం. జగన్‌కు బెయిల్ వస్తుందని ముందుగా చెప్పిన పాపానికి హరిని శోభా నాగిరెడ్డితో తిట్టించి ఆయనను దూరం చేసుకున్నారు. తన తరఫున మూడున్నరేళ్లు మీడియాలో బలంగా మాట్లాడి, ఢిల్లీ పెద్దల వద్ద మధ్యవర్తిత్వం నెరిపిన సబ్బంను దూరం చేసుకున్న తర్వాత జగన్ కొంత పశ్చాత్తాపం చెందారని తెలిసింది. పార్లమెంట్ సమావేశాల్లో హరన్నా.. హరన్నా.. అంటూ జగన్ ఎంతగా వెంటపడినా హరి పట్టించుకోకపోవడం గమనార్హం. హరి ఉదంతం తర్వాత చాలామంది వెనకాడుతున్నారని, రెండు కోట్లు ఖర్చుపెట్టి కటౌట్లు కూడా తయారుచేసుకున్న పొట్లూరి.. ఇప్పుడు మనసు మార్చుకున్నారని తెలుస్తోంది.
దళిత నేతలకు మొండిచేయి
జిల్లా నాయకులు తనను పట్టించుకోవడం లేదని జగన్‌ను కలిసి చెప్పిన పాపానికి దళిత నేత మారెప్పను తీవ్రంగా అవమానించడంతో ఆయన కూడా దూరమై ఇప్పుడు రోజుకో విధంగా తిట్టిపోస్తున్నారు. ఏకంగా జగన్ బాధితుల సంఘాన్నే పెట్టాలని ఆయన చెప్పారు. జగన్ కారణంగా ఎంతమంది బాధ పడుతున్నారు.. ఎంతమంది అవమానాలకు గురయ్యారన్న విషయంపై ఆయన వద్ద ఎన్నో సాక్ష్యాలున్నాయి. చివరకు మరో దళిత నేత జూపూడి ప్రభాకర్ రావును కూడా జగన్ అవమానిస్తున్నారని, ఆయనకు అసెంబ్లీ సీటు కేటాయించడానికి నిరాకరించారని మారెప్ప చెబుతున్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/54048#sthash.GTiSRQMx.dpuf



జగన్ డౌన్... సగానికి సగం తగ్గిన బలం

Published at: 16-01-2014 02:46 AM
 5  0  0 
 
 

యువనేత సర్వేలు తేల్చిన నిజం... వైసీపీలో మథనం
రెండేళ్లలో భారీగా పడిపోయిన ప్రజా మద్ధతు
కోస్తాంధ్రతో పాటు సీమలోనూ అదే సీన్
తెలంగాణలో పార్టీ పరిస్థితి దయనీయం
జైలు నుంచి వచ్చాక మరింత దిగదుడుపు
65 సీట్లకుమించి రావని ముఖ్యుల ఆందోళన?
అభ్యర్థులు, ఆశావహుల్లో గుబులు గుబులు
"రాష్ట్రవ్యాప్తంగా మన పార్టీకి 60 నుంచి 65 సీట్లకంటే ఎక్కువరావని అంతర్గత సర్వేల్లో తేలింది. ఇలా ఎందుకు జరుగుతోంది? మనం ఆలోచించాలి?
- సన్నిహితులతో వైసీపీ ముఖ్యనేత
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)  ఆల్ ఈజ్ నాట్ వెల్... వైసీపీ భవిష్యత్తుపై ఆ పార్టీలోని ముఖ్య నేతల తాజా అంచనా ఇది. సాధారణ ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో, రాజకీయ వాతావరణంపై సమీక్ష జరుపుతున్న వైసీపీ అగ్ర నేతలు, పార్టీ పనితీరు అంత ఆశావహంగా కనిపించడం లేదని పెదవి విరుస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కి, అధికారాన్ని దక్కించుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. విభజన వివాదం నేపథ్యంలో 'వైఎస్ సానుభూతి' పవనాలు మాయమవడం, తురుపుముక్కగా భావించిన జగన్ పాపులారిటీ నానాటికీ తీసికట్టుగా మారడం, ఇటీవల ఎత్తిన సమైక్య జెండాకు కూడా 'హైకమాండ్‌తో కుమ్మక్కు' వల్ల చిల్లులు పడడం పార్టీ ముఖ్యులను కలవర పెడుతోంది. దీనికితోడు జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక ప్రజాదరణ మరింత తగ్గడం, జగన్ చేయించే సర్వేలు దీన్ని «ద్రువీకరించడం వారిని భవిష్యత్తుపై భయపెడుతోంది. పార్టీ పెట్టి మూడేళ్లు కాకముందే ముప్పు ముంచుకొస్తోందా అని వారు ఆందోళన చెందుతున్నారు. పార్టీ పరిస్థితిని, ప్రజాదరణను అంచనా వేయడానికి జగన్ తరచూ వేర్వేరు మార్గాల్లో సర్వేలు చేయిస్తుంటారు. పార్టీ పెట్టకముందు నుంచే చేయిస్తున్న ఈ రహస్య సర్వేల ద్వారా మూడు నాలుగు నెలలకోసారి ఆయన ప్రజల నాడి పట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.
సర్వేల కోసం ఆయన సొంత మీడియా సంస్థ సాక్షి నెట్‌వర్క్, బెంగళూరుకు చెందిన పొలిటికల్ ఎడ్జ్, నీల్సన్ అనే మూడు సంస్థలను వినియోగిస్తున్నారు. వీటితో 2009 డిసెంబర్ - 2013 డిసెంబర్ మధ్య ఇలా దాదాపు 12 సర్వేలు జరిపించారు. ఆ ఫలితాలన్నింటినీ సమీకృత పరిచి, పరిశీలించిన పార్టీ ముఖ్యులకు ఇటీవల దిమ్మదిరిగే 'ఫలితాలు' కనిపించినట్టు వైసీపీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2009 డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 46 శాతం మంది జగన్‌కు మద్దతుపలకగా... రెండేళ్ల తర్వాత అంటే 2011 డిసెంబర్‌లో ఆ సంఖ్య 49 శాతానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2013 డిసెంబర్‌కు జగన్‌కు మద్దతిచ్చేవారి సంఖ్య ఏకంగా 24 శాతానికి దిగజారింది. జగన్ ప్రభావం వేగంగా క్షీణిస్తోందన్న రాజకీయ నిపుణుల అంచనాను వైసీపీ సర్వేలు ఇంచుమించుగా «ద్రువీకరించడం విశేషం. ఇటీవలి కాలంలో అటు కోస్తాంధ్రలోనూ, ఇటు జగన్ సొంతగడ్డ రాయలసీమలోనూ కూడా వైసీపీ దారుణంగా దెబ్బతింది. సమైక్య నినాదాన్ని చేపట్టడం, అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్‌తో జగన్ కుమ్మక్కైన సంగతిని 'అంధ్రజ్యోతి' బయటపెట్టడంతో వైసీపీ పట్ల ప్రజల వైఖరిలో పూర్తి తేడా వచ్చింది. 2012 డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా సగటున 40 శాతం మందిదాకా జగన్‌కు మద్దతు పలకగా, 2013 డిసెంబరులో ఇది 23 శాతానికి పడిపోయింది. సీమలో కూడా జగన్ గ్రాఫ్ ఒక్క ఏడాదిలోనే 12 శాతం పడిపోయింది. సమైక్య నినాదం కారణగా తెలంగాణలో అయితే పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.
ఇలా పైపైకి...
తండ్రి వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రి పదవిని ఆశించి... భంగపడి ఆ తర్వాత జగన్ తన దారి తాను చూసుకున్నారు. 2011 మార్చిలో వైసీపీ ఏర్పాటు చేశారు. అయితే... 2009 డిసెంబర్ నుంచే ఆయన సర్వేలు మొదలుపెట్టారు. వ్యక్తిగత ఇమేజ్, పార్టీ పెడితే విజయావకాశాలపై అప్పట్లో సర్వే జరిగేది. అప్పట్లో సగం రాయలసీమ 'జై జగన్' అని నినదించింది. రాష్ట్రవ్యాప్తంగా 46 శాతం మంది 'మేమంతా నీ వెంటే' అని ఎలుగెత్తి ఘోషించినట్లు తేలింది. అప్పటి నుంచి జగన్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఏడాది తర్వాత అంటే... 2010 నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 శాతం మంది జగన్.. జగన్... అంటూ ఊగిపోయారు. ఈ సర్వే ఫలితాలు చూసి, ఇక తనకు తిరుగు ఉండదని జగన్ ఓ నిశ్చయానికి వచ్చి 2011 మార్చి 12 సొంత జెండా ఎగరేశారు. డిసెంబర్ 2011లో జరిగిన సర్వేలోనూ జగన్ పార్టీకి జేజేలు పలికేవారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. పైగా... ఓ అరశాతం పెరిగింది. జగన్‌కు, ఆయన పార్టీకి సంబంధించి ఇది స్వర్ణయుగం. అంటే... ఆయన ప్రతిష్ఠ అత్యధికంగా ఉన్న కాలం అదే! ఆ తర్వాత..
ఇలా కిందికి..
2012 మే 27... అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయ్యారు. ఆయన మద్దతుదారులు జగన్ చుట్టూ సానుభూతి కోట కట్టారు. అదే సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ ఊపేసింది. ఇతర పార్టీలకు చెందిన చోటామోటా నేతలంతా జగన్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లడం, అక్కడే మంతనాలు జరపడం... బయటికి వచ్చాక పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం... అంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోయేది. కానీ... క్షేత్రస్థాయిలో, జనంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధమని సర్వే లెక్కలు చెబుతున్నాయి. జగన్ జైలుకు వెళ్లిన తర్వాతి నుంచి ఆయన గ్రాఫ్ కూడా పడిపోవడం మొదలైంది. జగన్ అరెస్టయిన ఏడు నెలలకు అంటే... 2012 డిసెంబర్‌లో జరిగిన సర్వేలో వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యే అంకెలు కళ్లముందు కనిపించాయి. 2011 డిసెంబర్ - 2012 డిసెంబర్ మధ్య జనంలో జగన్ బలం 10 శాతం తగ్గిపోయింది. ఆయనకు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య 50.5 నుంచి 40.5 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే... పార్టీ కార్యకలాపాలు మరింత ముమ్మరం చేసి, మరింత ప్రచారం పొందేందుకు అన్నట్లు... రకరకాల దీక్షలు, యాత్రలు, సభలు నిర్వహించారు. మరోవైపు... జగన్‌తో నేతల జైలు ములాఖత్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా... ప్రయోజనం సున్నా. ప్రాంతాలకు అతీతంగా (రాయలసీమతో సహా) జగన్ గ్రాఫ్ కిందికిందికి పడిపోతూనే ఉంది. 'ఇక లాభంలేదు. జగన్ బయటికి రావాలి. ఆయన వస్తేనే అదృష్టచక్రం తిరుగుతుంది' అని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్మారు. జగన్ విడుదల కోసం వేలకళ్లతో ఎదురుచూడసాగారు. వారు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అది... 2013 సెప్టెంబర్ 24. ఆరోజున జగన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఏమైంది...
మరింత దిగజారింది...
జగన్ విడుదలయ్యాక అదృష్ట చక్రం తిరగలేదు సరికదా... దురదృష్టం మరింతగా వెంటాడింది. 2013 డిసెంబర్‌లో చేసిన సర్వే ఫలితాలతో జగన్ పార్టీ నేతల కళ్లకు బైర్లు కమ్మినంత పనైంది. జగన్ గ్రాఫ్ ఘోరాతి ఘోరంగా పడిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40.5 మంది వైసీపీకి మద్దతుపలకగా... 2013 డిసెంబర్‌లో ఆ సంఖ్య 24 శాతానికి పడిపోయింది. అంటే... ఒక్క ఏడాదిలో, అదీ జగన్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత సుమారు 17 శాతం మంది మద్దతుదారులు చేజారిపోయారన్న మాట! తెలంగాణ ప్రాంతంలో జగన్ పార్టీ మద్దతుదారుల సంఖ్య 35 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. విభజనపై వైసీపీ తీసుకున్న వైఖరి నేపథ్యంలో తెలంగాణలో సహజంగానే జగన్ పార్టీకి జనం జెల్లకొట్టారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. కానీ... 'సమైక్య చాంపియన్'గా జగన్ ఎలుగెత్తి చెబుతున్నప్పటికీ, కోస్తాంధ్రలో ఆయన గ్రాఫ్ భారీగా పడిపోవడం గమనార్హం. 2012 డిసెంబర్‌లో కోస్తాలో 46 శాతంమంది జగన్‌కు జై కొట్టగా... ఏడాది తర్వాత ఆ సంఖ్య 28 శాతానికి పడిపోయింది. అంటే... 18 శాతం పడిపోయింది. ఇక రాయలసీమలోనూ దాదాపు అదే పరిస్థితి. ఇక్కడ... జగన్ మద్దతు 42 శాతం నుంచి 28 శాతానికి పడిపోయింది. "జగన్ బలంగా చెప్పుకొనే విశ్వసనీయతపైనే జనంలో సందేహాలు మొదలయ్యాయి. విభజన విషయంలో ఆయన కప్పదాట్లు వేశారు. సొంత కుటుంబ సభ్యులకు, సీనియర్ నేతలకు ఎదురవుతున్న అనుభవాలతో జగన్ అంటే ఏమిటో జనానికి తెలిసి వచ్చింది'' అని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ సమైక్య నినాదం ఉత్తిదేనని... రాష్ట్రం విడిపోయాక సీమాంధ్రకు సీఎం కావడం కోసమే కాంగ్రెస్ రాగానికి తాళం వేస్తున్నారని ప్రజలకు అర్థమైపోయిందని పేర్కొంటున్నారు. ఇందుకు ఆయన సొంతంగా చేయించుకున్న సర్వేల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. "రాష్ట్రవ్యాప్తంగా మనకు 60 నుంచి 65 సీట్లకంటే ఎక్కువరావని అంతర్గత సర్వేల్లో తేలింది. మీరంతా కష్టపడి పనిచేసి మన బలం పెరిగేలా, మన మీడియాలో ప్రచారం చేయాలి'' అని ఇటీవల జగన్ సతీమణి భారతి ఇటీవల తమ సొంత మీడియాలోని కొందరు ముఖ్యులకు కర్తవ్యబోధ చేసినట్లు తెలుస్తోంది.
ఇరుక్కుపోతాము..
ఎందరెందరో సీనియర్లు! రకరకాల కారణాలవల్ల తమ రాజకీయ అనుభవంలో సగం వయసుకూడా లేని జగన్ పంచన చేరారు. కొన్నాళ్లకే అసలు విషయం తెలుసుకున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చినవారితోపాటు సొంత కుటుంబ సభ్యులకూ జగన్ చుక్కలు చూపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. జగన్ గ్రాఫ్ పడిపోతున్న విషయం తెలిసి, ఆయన పార్టీలో చేరాలనుకుంటున్న వారు, ఇప్పటికే టికెట్ ఖరారు చేసుకున్న వారు పునరాలోచనలో పడ్డారు. చాలామంది నేతలు 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అని బెంబేలెత్తుతున్నారు. తమ పార్టీ పరిస్థితి దిగజారుతోందనే విషయాన్ని తెలుసుకుని... కొంత మంది అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. పెద్దపెద్ద మొత్తాలు ఇవ్వడానికి సిద్ధపడి టికెట్ కోసం ఒప్పందాలు కుదర్చుకున్న వారు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇప్పటికే భారీస్థాయిలో డబ్బులు సమర్పించుకున్న వారు... 'అది తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా?' అని ఆరా తీస్తుండగా... మరికొందరు అది గోడకు కొట్టిన సున్నమే అని ఆశలు వదిలేసుకున్నారు. టికెట్ కోసం వెళ్లిన వారిని పార్టీ నిర్వాహకులు నేరుగా డబ్బులు అడుగుతున్నట్లు సమాచారం. దీంతో... భవిష్యత్తులో తమకంటే ఎక్కువ ఇచ్చేవారు వస్తే తమ పరిస్థితి ఏమవుతుందోననే సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి... టికెట్‌తోపాటు ప్రచారం కోసం ఎంతోకొంత పార్టీ ఫండ్‌గా ఇవ్వడం రాజకీయాల్లో పరిపాటి. అలాగే... జగన్ కూడా డబ్బులిస్తారని, తాము కొంత ఖర్చుపెట్టుకుని, తాము మరింత ఖర్చుపెట్టుకుని చాలామంది కలలు కన్నారు. కానీ... 'నాకేంటి' అనే పరిస్థితి తలెత్తడంతో షాక్‌కు గురవుతున్నారు. గుప్పిట మూసి ఉంచినంత వరకే రహస్యం అన్నట్లుగా... జగన్ జైలులో ఉన్నంతకాలం అంతా 'బలమే' అనిపించింది. 'జగన్ బయటికి వచ్చాక పొడిచేస్తాడని, దుమ్ము దులిపేస్తాడని అనుకున్నాం. కానీ... ఆయన బయటికి వచ్చాక పార్టీ నుంచి బయటికి పోయేవారే! చేరిన ప్రముఖులెవరూ లేరు. పైగా పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోంది'' అని పార్టీ ప్రముఖులు వాపోతున్నారు. మరోవైపు... సమైక్యాంధ్ర విషయంలో జగన్ వైఖరి పట్ల పార్టీ ఎమ్మెల్యేలో 75 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తన తల్లినే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం... ఆమె సరిగా మాట్లాడలేకపోవడం అసంతృప్తికి దారితీస్తోంది. 'మేం సమైక్యవాదులం' అని బలంగా చెప్పుకోలేకపోతున్నామని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. విజయలక్ష్మి సరిగా మాట్లాడలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో... ఆమె మనస్తాపానికి గురయ్యారని, వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోనని చెప్పారని తెలుస్తోంది.
విశాఖ సీటు వెల 91 కోట్లు!
వైసీపీతో టీఎస్సార్ ఒప్పందం?

హైదరాబాద్, జనవరి 15 : 'విశాఖపట్నం నాది'... సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి కొన్నాళ్లుగా ఘంటాపథంగా చెబుతున్న మాట ఇది. ఈ విషయంలో విశాఖ ఎంపీ పురందేశ్వరితోనూ తీవ్రస్థాయిలో పంచాయతీ నడిచింది. ఇదంతా చూసి... ఎలాగైనా పట్టుపట్టి, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి టికెట్ సాధిస్తారని అంతా అనుకున్నారు. అయితే... ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్‌పైనా కన్నేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది. విశాఖ సీటుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వైసీపీలో బేరసారాలకు తెర లేచిందని, రూ.91 కోట్లు ఇచ్చి సీటు సొంతం చేసుకునేందుకు సుబ్బిరామిరెడ్డి సై అన్నారని చెబుతున్నారు. దీనిపై జగన్‌తో ఒప్పందం కుదిరినట్లు రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ సీటు కోసం ఓ రాయి విసిరి చూసినప్పటికీ... 'ధర' మరీ ఎక్కువ కావడంతో ఆయన వదిలేసినట్లు చెబుతున్నారు. ఇక... కాంగ్రెస్‌లో ఉంటూనే జగన్ శ్రేయోభిలాషిగా పని చేసిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరికూడా విశాఖపై గతంలో ఆశలు పెట్టుకున్నారు. అయితే, సబ్బం హరికి పార్టీతో సంబంధం లేదంటూ జగన్ పార్టీ ప్రకటించడంతో ఆయన మన స్సు విరిగిపోయింది. తాజాగా సుబ్బిరామిరెడ్డి రంగ ప్రవేశం చే సి.. రూ.91 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/54371#sthash.pmbuId64.dpuf

No comments:

Post a Comment