Saturday 25 January 2014

టీ-బిల్లును తిప్పి పంపాలి - సియం.

టీ-బిల్లును తిప్పి పంపాలని స్పీకర్‌ను కోరిన సీఎం కిరణ్

Published at: 25-01-2014 17:27 PM
 2  1  0 
 
 

హైదరాబాద్, జనవరి 25 : తెలంగాణ ముసాయిదా బిల్లు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బిల్లును వెంటనే తిప్పి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు శనివారం నోటీసు ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చిన బిల్లు తప్పుల తడకని, అసలు బిల్లు రాలేదని, ఇప్పుడు వచ్చింది డ్రాఫ్ట్ బిల్లని, అందుకేత బిల్లును తిప్పి కేంద్రానికి పంపాలని కిరణ్ సభా నాయకుడి హోదాలో సభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్‌కు నోటీసు ఇవ్వగా ఆయన సభాపతికి నోటీసు అందజేశారు.
అనేక వివాదాస్పద అంశాలు ఈ బిల్లలో ఉన్నట్టు నిబంధన 77 ప్రకారం బిల్లును వెనక్కి సీఎం కిరణ్ పంపారు. ఈ బిల్లు చర్చకు అనర్హమైందని ఆయన నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకు కిరణ్ బిల్లును వెనక్కి పంపారా? అని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ తరుణంలో ఇది తెలంగాణ బిల్లు కాదని కేవలం డ్రాఫ్ట్ బిల్లు మాత్రమేనేని, ఈ విషయాన్ని కేంద్రహోంశాఖ కార్యదర్శి చెప్పారని సీఎం తెలిపారు.
- See more at: http://www.andhrajyothy.com/node/58028#sthash.lFuxXEqy.dpuf

No comments:

Post a Comment