Thursday 16 January 2014

కర్నూలును రాజధాని చేస్తే 400 కోట్లు ఇస్తా!

కర్నూలును రాజధాని చేస్తే 400 కోట్లు ఇస్తా!

Published at: 16-01-2014 04:31 AM
 1  0  1 
 
 

200 ఎకరాలు, 200 కోట్ల విరాళం: బాలసాయి
కర్నూలు, జనవరి 15: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలును రాజధానిగా చేస్తే రూ.400 కోట్లు విరాళం ఇస్తానని బాలసాయిబాబా ప్రకటించారు. రూ.200 కోట్ల విలువైన 200 ఎకరాలతోపాటు... అభివృద్ధి కోసం మరో రూ.200 కోట్లు ప్రభుత్వానికి ఇస్తానన్నారు. బాలసాయి బాబా 54వ జన్మదిన వేడుకలు కర్నూలు నగరంలో మంగళవారం వైభవంగా జరిగాయి. బాలసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనిలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దేశ విదేశాలకు చెందిన భక్తులు, అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. బాలసాయిబాబా ప్రసంగిస్తూ... "కర్నూలుకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తే రాజధాని అభివృద్ధి కోసం... నా 200 ఎకరాల స్థలం, ట్రస్టుకు సంబంధించిన మరో రూ.200 కోట్లు అందిస్తాను'' అని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తనకు భక్తులు ఉన్నారని... అందరికీ తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఉన్నంతలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. బాలసాయిబాబా జన్మదిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు బస్వరాజు సారయ్య, టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి తనయురాలు శర్మిష్ట ముఖర్జీ చేసిన కథకళి నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

- See more at: http://www.andhrajyothy.com/node/54427#sthash.Z3b9CFux.dpuf

No comments:

Post a Comment