Tuesday, 14 July 2015

పుష్కర మృతులకు చంద్రబాబు బాధ్యత వహించాలి : చిరంజీవి

రాజమండ్రి ఘటన ప్రభుత్వ వైఫల్యమే
చంద్రబాబు బాధ్యత వహించాలి : చిరంజీవి

హైదరాబాద్‌, జులై 14 : రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాంగ్రెస్‌ నేత చిరంజీవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాటలో 27 మంది మృతిచెందడం దిగ్ర్భాంతికి గురిచేందన్నారు. మీడియాలో తొక్కిసలాట దృశ్యాలు చూస్తుంటే గుండెతరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ప్రచార ఆర్భాటమే తప్ప చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పుష్కరాలకు ఎంతమంది వస్తారనేది అంచనా వేయలేకపోవడం వైఫల్యమే అన్నారు. పుష్కరాలకు అన్ని తానై ఉన్న చంద్రబాబు నాయుడు తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో కృష్ణాపుష్కరాల సమయంలో ఇద్దరు ముగ్గురు చనిపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నానాయాగీ చేశారని మండిపడ్డారు.
 
తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆయన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలన్నారు. కుంభమేళాను మించి అద్భుతంగా ఏర్పాట్లు చేశామని గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ విషాదం జరిగిందని చిరంజీవి ఆరోపించారు.

పుష్కర గోదావరి

పుష్కర గోదావరి
గోదావరి తీరం శోభాయమానంగా వెలిగిపోతున్నది. పుష్కర సంరంభానికి సర్వమూ సిద్ధమైంది. పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసి తరించడానికి లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజన తరువాత వచ్చిన తొలి పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఘనమైన ఏర్పాట్లు చేశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వపరంగానూ, ప్రసారమాధ్యమాల ద్వారా ఈ పుష్కరాలకు విస్తృతమైన ప్రచారం కూడా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కరీంనగర్‌ జిల్లా ధర్మపురిలో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో పుష్కర స్నానాలు ఆచరించబోతున్నారు.
 
నవగ్రహాల్లో ఒకటైన బృహస్పతి ఆయా రాశులలోకి అడుగుపెట్టినప్పుడు దేశంలో ప్రసిద్ధి చెందిన పన్నెండు నదులలో పుష్కరాలు జరుగుతాయి. ఈ పన్నెండు నదులనూ పుష్కర నదులనీ, పన్నెండు రోజూలనూ పుష్కరాలనీ అంటారు. చాంద్రమానం ప్రకారం 27 నక్షత్రాలు, తొమ్మిది పాదాలు కలిపితే ఒక రాశి. ఈ రోజు గురుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో నేటినుంచి గోదావరి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. రాబోయే ఏడాది కన్యారాశి ప్రవేశంతో కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయి. ఒక్కోనదికి ఒక్కోరాశి అధిష్ఠానమై ఉంటుందనీ, పుష్కర సమయంలో ఆ నదిలో సకలదేవతలూ కొలువై ఉంటారనీ, ఆ కాలంలో ఆ నదిని చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల సకల తీర్థాల దేవతలనూ పూజించినట్టవుతుందని విశ్వాసం. అలాగే, ఈ పన్నెండు రోజుల గోదావరి పుష్కరాలను ఆది పుష్కరాలనీ, వచ్చే ఏడాది జూలై 31నుండి ఆగస్టు 11 వరకూ ఆ పన్నెండురోజులనూ అంత్యపుష్కరాలనీ పిలుస్తారు. అవి కూడా పుణ్యప్రదాలే కనుక, ఇప్పుడు అనివార్య కారణాల వల్ల పుష్కరస్నానాలు ఆచరించలేనివారు అప్పుడు చేయవచ్చునని అంటారు. అంత్యపుష్కరాలు గోదావరికి మాత్రమే ప్రత్యేకం.
 
‘ఉత్తమంతు, నదీస్నానం’ అని పెద్దలంటారు. బావి, చెరువు, బకెట్‌ స్నానాలతో పోల్చినపుడు ప్రవహించే నదికి స్నానవిధిలో సహజంగానే ప్రథమస్థానం ఉంటుంది. సాధారణ రోజుల్లోనే నదికి ఈ అగ్రతాంబూలం దక్కినప్పుడు, పవిత్రతలో గంగ కంటే గోదావరినే ముందుగానే పేర్కొనాలని విజ్ఞులు వాదిస్తున్నప్పుడు ఈ పుష్కరస్నానానికి తప్పక ఎంతో ప్రాశస్త్యం ఉంది. గోదావరి తీరంలో నివసించి, ఆ జలాన్ని సేవించినందువల్లే నన్నయ్య మూడున్నర పర్వాల ఆంధ్రమహాభారతాన్ని సునాయాసంగా రచించాడట. ఈ తీరంలో భద్రాద్రి రాముడిని కొలిచిన కంచర్ల గోపన్న వైకుంఠానికీ భద్రాద్రికీ భేదం లేదనీ, అక్కడి విరజానదే ఈ గోదావరి అనీ అన్నాడు. సీతారాముల స్నానంతో ఇది ఎన్నడో పునీతమైనదట. సువిశాలమైన పరీవాహక ప్రాంతం ఉన్న గోదావరి తీరమంతా ప్రసిద్ధపుణ్యక్షేత్రాలకు నిలయం. మహారాష్ట్రలోని త్య్రంబకేశ్వరంలో ఆవిర్భవించినదాది గోదావరి క్రమంగా విస్తృత రూపాన్ని సంతరించుకొంటూ సాగింది. మరాఠా నేలనుంచి వడివడిగా పరుగులు తీస్తూ తెలుగునేలమీద అడుగిడిన ప్రాంతం నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి. గోదావరి, హరిద్ర, మంజీరా నదుల ఈ సంగమ ప్రాంతం ప్రాచీన సంగమేశ్వరాలయానికి నెలవు. ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో సరస్వతి అక్షరాలు దిద్దించి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. కరీనంగర్‌ జిల్లాలో కాళేశ్వరుడు దర్శనమిస్తాడు. కోడెదూడలను కానుకగా అందుకొనే వేములవాడ రాజరాజేశ్వరుడు, ధర్మపురిలో నృసింహస్వామి ఈ నదీతీరానే కొలువైనారు. అఖండ గోదావరి మధ్యలో కొండమీద వెలిసిన వీరభద్రుడితో పట్టిసీమ ప్రాచీన శివక్షేత్రమే కాదు, సుందరమైనది కూడా. కొవ్వూరులోని గోష్పాదక్షేత్రం, రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర రేవులే కాదు, పుణ్యక్షేత్రాలు కూడా. దక్షిణకాశి ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి. పాలకొల్లు, అమరావతి పంచారామక్షేత్రాలకు నిలయాలు. ధవళేశ్వరం తరువాత సప్త గోదావరుల మధ్యలో ఎన్నో క్షేత్రాలున్నాయి. సాగర సంగమంలో ఉన్న అంతర్వేది ప్రాచీన నృసింహస్వామి క్షేత్రం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి తీరం ఇలా అనేక సుప్రసిద్ధ ఆలయాలకు నిలయాలు కావడం వల్ల పుష్కరాలకు అమితమైన ప్రాధాన్యం ఉంది.
 
పుష్కరానుభూతి కలకాలం భక్తుల మదిలో నిలిచిపోయేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ ఘనంగా ఏర్పాట్లు చేశాయి. నీటి లభ్యతకు లోటులేకుండా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులనుంచి నీటిని విడుదల చేస్తూ, మరోపక్క మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నిత్యహారతులతోనూ, అఖండ పుష్కరజ్యోతితోనూ గోదావరి కళకళలాడుతున్నది. తెలుగునేలమీద అడుగుపెట్టిన దగ్గరనుంచి సగరుని దరిచేరే వరకూ గోదావరి తీరం వెంబడి విస్తరించిన గ్రామాలు, ఆలయాలు, క్షేత్రాలు కొత్తకాంతులీనుతున్నాయి. పుష్కర ప్రారంభవేళలో నదీస్నానాలు చేసి జన్మతరింప చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న భక్తులకు స్నానవాటికలు ఘన స్వాగతం పలుకుతున్నాయి.

Sunday, 12 July 2015

ఏపీ కోసం ట్యాపింగ్‌ పరికరాలు!?

ఏపీ కోసం ట్యాపింగ్‌ పరికరాలు!?
‘తెలంగాణపై ప్రయోగానికే’నంటూ హల్‌చల్‌..
వికీ‘లీక్స్‌’తో కొత్త కలకలం (12-Jul-2015)

  • ప్రభాకర్‌ అనే వ్యక్తి నుంచి మెయిల్‌
  • ఖండించిన ఏపీ పోలీసులు, ప్రభుత్వం
హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉన్న సమస్యలు చాలవన్నట్లు... తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైంది. అది... వికీలీక్స్‌తో పుట్టుకొచ్చిన వివాదం! సాధారణంగా అయితే... ఇది ఒక జాతీయ, అంతర్జాతీయ అంశంగానే మిగిలిపోయేది. కానీ... ఓటుకు నోటు, ట్యాపింగ్‌పై ఢీ అంటే ఢీ అంటున్న తెలుగు రాష్ట్రాల మధ్య ‘రచ్చ’గా మారింది. జాతీయ భద్రతతో ముడిపడిన అంశం కాస్తా... ‘ప్రాంతీయ, రాజకీయ’ రంగు పులుముకుంది. యూపీఏ హయాంలో కేంద్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం అత్యాధునిక పరికరాల కొనుగోలుకోసం ప్రయత్నించాయంటూ వికీలీక్స్‌ సంబంధిత ఈ-మెయిల్‌లను బయటపెట్టింది. అంతే... ‘తెలంగాణ మీద ప్రయోగించేందుకే చంద్రబాబు సర్కారు ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు ప్రయత్నించింది’ అంటూ ఒకవైపు నుంచి ప్రచారం మొదలైంది. దీంతో... ఏపీ సర్కారు కూడా దీనిపై వివరణ ఇచ్చుకుంది. నిజానికి... కేంద్ర నిఘా సంస్థలతోపాటు అన్ని రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ బ్యూరోలు ట్యాపింగ్‌కు అవసరమైన పరికరాలను సమకూర్చుకుంటూనే ఉంటాయి. ఉగ్రవాదులు, నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తుల కదలికలను గుర్తించేందుకు ‘ట్యాపింగ్‌’ను ఉపయోగిస్తారు. తగిన అనుమతులతో, అధికారికంగా ట్యాప్‌ చేయడం చట్టబద్ధమే! రాజకీయ కక్ష సాధింపులకు, అవసరాలకు అనధికారికంగా ట్యాపింగ్‌కు పాల్పడటం మాత్రం తీవ్రమైన నేరం. దేశభద్రతకు సంబంధించి ఎంతో ముఖ్యమైన ట్యాపింగ్‌ వ్యవహారం... తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చగా మారడంపై కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు... ‘వికీలీక్స్‌’తో విషయం మరింత విషమిస్తుందని పేర్కొంటున్నాయి. ఉభయ రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘దేశ రక్షణ, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలను ఇలా ఎవరికి వారు తవ్వి తీస్తూ పోతే చాలా కష్టం! రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేసేందుకే నిఘా వర్గాలు పరికరాలను సమకూర్చుకుంటాయనే ప్రచారం ప్రమాదకరం. ఇది అంతిమంగా సంఘ విద్రోహ శక్తులకే ఉపయోగపడుతుంది’’’’ అని ఓ అధికారి పేర్కొన్నారు.
 
అప్పుడు... ఇప్పుడు!
‘తెలంగాణపై ప్రయోగించేందుకే హ్యాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేస్తున్నారు’ అనే ఆరోపణలను ఏపీ ఉన్నతాధికారులు ఖండిస్తున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే అత్యాధునికమైన ట్యాపింగ్‌ పరికరాలను సమకూర్చుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ పరికరాల్లో అత్యధికం తెలంగాణ పోలీసుల వద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు విభాగం కూడా ఆయా పరికరాలను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వికీలీక్స్‌ పత్రాల ప్రకారం... ఏపీ సర్కారు ఈ దిశగానే సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఉండాలి. ఇలా నేరుగా పోలీసులు కంపెనీలను సంప్రదించినట్లుగా మెయిల్స్‌ ఏవీ లేవు. ‘ఏపీ పోలీసుల కోసం’ అంటూ ప్రభాకర్‌ కాసు అనే వ్యక్తి మెయిల్స్‌ పంపించారు. రాష్ట్ర విభజనకు ముందు... 2014 ఫిబ్రవరి 14, మార్చి 7న వెళ్లిన రెండు ఈ-మెయిల్స్‌ ప్రకారం... హ్యాకింగ్‌ టీమ్‌ డాట్‌ కామ్‌కు మరికొందరు వ్యక్తులకు మధ్య మెయిల్‌ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎంఎం భగవత్‌, బి. సుమతి, కె. నారాయణరెడ్డి, పి. రవీంద్రప్రసాద్‌ ఈ పరికరాల కోసం దుబాయికి వస్తున్నారంటూ సమాచారం పంపించారు. గత నెల 12, 17 తేదీల్లోనూ అదే కంపెనీకి కొన్ని ఈ-మెయిల్స్‌ వెళ్లాయి. తన క్లయింట్‌ (ఏపీ పోలీస్‌ ఇంటెలిజెన్స్‌) మొబైల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలను కొనుగోలు చేయాలనుకుంటోందన్నది దీని సారాంశం. 25 నుంచి 50 మొబైల్‌ లైసెన్స్‌లకు ఎంత ఖర్చవుతుందో చెప్పాలని ప్రభాకర్‌ కాసు అనే కన్సల్టెంట్‌ పేరుతో మెయిల్స్‌ వెళ్లాయి. దీనికి 1నుంచి 1.2మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ఖర్చు కావచ్చని హ్యాకింగ్‌ టీమ్‌ డాట్‌ కామ్‌ నుంచి మ్యాగ్లీయెట్టా పేరుతో సమాధానం వచ్చింది. వెరసి... ఏపీ సర్కారు కూడా తెలంగాణను టార్గెట్‌ చేసుకునే ట్యాపింగ్‌ పరికరాల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టినట్లు హల్‌చల్‌ మొదలైంది. ఆ తర్వాత రకరకాల వార్తలు వెలువడ్డాయి.

ఏమీ జరగలేదు: ఏపీ పోలీస్‌
‘‘ఈ-మెయిళ్లలో ఇటాలియన్‌ సప్లయర్‌కు, ఇండియన్‌ ఏజెంట్‌ ప్రభాకర్‌ రెడ్డికి మధ్య సంభాషణలు జరిగినట్లుంది. ఈ అంశానికి సంబంధించి నవ్యాంధ్ర పోలీసులు సదరు కాసు ప్రభాకర్‌ను ఎప్పుడూ సంప్రదించలేదు’’ అని ఏపీ పోలీసు వర్గాలు తెలిపాయి. నిజానికి... రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిఘా వర్గాలకు విక్రయదారులు కొత్త సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీపై ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారని పేర్కొన్నాయి. ఈ ఏడాది మార్చిలో తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికే ఆర్టస్‌ కన్సల్టింగ్‌ సంస్థకు చెందిన కాసు ప్రభాకర్‌ ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చార ని వివరించాయి. మరోవైపు... ఇరు రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఐబీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాలకు తెలంగాణ ఎస్‌ఐబీ కార్యాలయంలో ఇటీవల పలు సమస్యల పరిష్కారంపై ప్రదర్శన ఇచ్చారని పేర్కొన్నాయి. మొబైల్‌ ఇంటర్‌సెప్షన్‌కు సంబంధించిన ప్రెజంటేషన్‌ మాత్రం లేదని తెలిపాయి.

కేరాఫ్‌ బేగంపేట
సంఘ విద్రోశ శక్తుల కదలికలపై కన్నేసేందుకు రాష్ట్ర, జాతీయస్థాయి నిఘా విభాగాలు ట్యాపింగ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చుకుంటూ ఉంటాయి. ఎంపిక చేసిన కొన్ని ఫోన్‌ నెంబర్లకు వచ్చి పోయే కాల్స్‌ను రికార్డ్‌ చేయడం సర్వ సాధారణం. ఈమధ్యనే మరో కొత్తప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చింది. ట్రాకింగ్‌లో ఉన్న ఫోన్ల సంభాషణల్లో ఎంపిక చేసిన కొన్ని పదాలు వినిపిస్తే చాలు... మొత్తం సంభాషణ ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ విభాగం ఇదే పనిలో ఉంటుంది. సంఘ విద్రోహ శక్తులు సైతం ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తూనే ఉంటాయి. అందువల్లే, నిఘా విభాగాలు ఎప్పటికప్పుడు సరికొత్త, అత్యాధునిక పరికరాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రపంచవ్యాప్తంగా నేరపరిశోధనకు వినియోగించే ఆధునిక పరికరాలు ఎక్కడున్నా సమకూర్చుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చకు దారి తీయడంపై పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు.

తప్పుడు వార్తలు: యనమల
‘‘ఫోన్ల హ్యాకింగ్‌పై కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన పత్రికలు, చానళ్లలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం! ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించడానికి కొన్ని పార్టీలు, వాటికి తొత్తులుగా ఉన్న టీవీ చానళ్లు కుట్రలకు పాల్పడుతున్నాయి’’ అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బయటపెడుతున్న ఈ-మెయిల్స్‌కు ఎటువంటి సాధికారత లేదని వికీలీక్స్‌ స్పష్టంగా పేర్కొన్నా... ఆ విషయాన్ని మరుగు పరచడం ఆ చానళ్ల దుర్నీతికి నిదర్శనమని విమర్శించారు. రాజకీయ పార్టీలే పత్రికలు, చానళ్లను స్థాపించి... అసత్య ప్రచారాలే అజెండాగా చేసుకుని... ఇలాంటి నిందాపూర్వక ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే అది వారి ముఖంపైనే పడుతుందని, వారి కుట్ర రాజకీయాలను తెలుగు ప్రజలు తిప్పికొడతారని యనమల పేర్కొన్నారు.

Friday, 3 July 2015

NTR - GO. No. 610

  1. NTR followed in the foot steps of Kasu Brahmananda Reddy (Who passed GO 36 and resigned voluntarily to make way for P.V.Narasimha Rao - a Telanganite) and passed G.O 610 (requiring an audit and implementation of local reservations for telenganites) in December 1985 to be fully implemented by March 1986.[27] He further fought a case against GO 610 in the high court and won!! the right for the chief minister to implement G.0 610. He followed up the court ruling with GO 674 (requiring repatriation of non-local government employees) to conform to GO 610. His support for P.V Narasimha Rao, as Prime Minister by helping him win outside Telengana as an MP were very instrumental is furthering his United Andhra Stand.

Thursday, 2 July 2015

ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం హింసిస్తోంది- అశోక్‌బాబు

ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం హింసిస్తోంది- అశోక్‌బాబు

  • తెలంగాణ సర్కారు వేధిస్తోంది.. 
  • లాయర్లపై దాడులు... 
  • రోడ్లపైకి విద్యుత్‌ ఉద్యోగులు
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని గవర్నర్‌.. 
  • సెక్షన్‌ 8 కోసం ఢిల్లీలో ధర్నా: అశోక్‌బాబు
  • తెలంగాణ గవర్నర్‌లా నరసింహన్‌ వ్యవహారం.. 
  • నవాబులా కేసీఆర్‌: జూపూడి
  • టిఆర్‌ఎస్‌ ఆగడాలపై గవర్నర్‌ ప్రేక్షక పాత్ర.. 
  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
  తుమ్మలగుంట (తిరుపతి), జూలై 2: హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెంటాడి హింసిస్తున్నదని... దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టుల ఫోరం గురువారం తిరుపతిలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వం సాక్ష్యాలు దొరక్కుండా కుట్రపూరితంగా దాడులు చేయిస్తూ... శారీరకంగా, మానసికంగా హింస పెడుతున్నదని ఆరోపించారు. ఏపీ ఉద్యోగులు, మీడియా పట్ల కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని నిషేధించడం గవర్నర్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. కాబట్టే సెక్షన్‌ 8 అమలుకు పోరాటం చేయాల్సి వస్తున్నదని చెప్పారు. హైకోర్టులో తరచుగా ఏపీ న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా, బూతులు తిడుతున్నా స్పందించడం లేదన్నారు. ఏపీ న్యాయమూర్తులకు సైతం కష్టాలు తప్పడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ స్పందించి సెక్షన్‌ 8ని అమలు చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాతో సమానంగా నిధులు కేటాయించి, రాయితీలు కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాయలసీమ నాయకులకు సరైన కమిట్‌మెంట్‌ లేకపోవడంవల్లే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెక్షన్‌ 8 అమలు కోసం విద్యార్థి జేఏసీతో కలసి ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఏపీకి చెందిన 1200 మంది విద్యుత్తు ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రోడ్లపైకి నెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గవర్నర్‌ స్పందించి విద్యుత్తు ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విభజన నాటి నుంచే ఉద్యోగులకు హైదరాబాద్‌లో కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ లేదన్నారు. సెక్షన్‌ 8పై వైసీపీ నోరు మెదపకుండా.. పరోక్షంగా కేసీఆర్‌కు మద్దతు తెలుపుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌ ఆదాయంలో 58 శాతం ఏపీకి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ మాట్లాడుతూ నరసింహన్‌ తెలంగాణ గవర్నర్‌గా మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నిజాం నవాబులా ఫీలవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసుకు, సెక్షన్‌ 8కి లింకు పెట్టి తెలంగాణ వాదులు తప్పించుకోవాలని చూస్తున్నారని, ఆంధ్రవాదులంతా ఏకమై సెక్షన్‌ 8 కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు సుగుణ, తలారి ఆదిత్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఆగడాలపై గవర్నర్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై గవర్నర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడలేకపోయామని, అయినప్పటికీ హోదా సాధిస్తామన్న నమ్మకం ఉందని చెప్పారు.

రేవంత్‌రెడ్డి కేసులో తెలంగాణ లాయర్లు- కపిల్‌సిబల్‌, దుష్యంత్‌దవే, హరేన్‌రావెల్‌

ఢిల్లీ : రేవంత్‌రెడ్డి కేసులో తెలంగాణ లాయర్లు- కపిల్‌సిబల్‌, దుష్యంత్‌దవే, హరేన్‌రావెల్‌

ఢిల్లీ, జూలై 3 : ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ఏసీబీ పక్షాన సుప్రీంకోర్టులో సీనియర్‌ లాయర్లు వాదించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ పక్షాన వాదనలు వినిపించేందుకు సీనియర్‌ లాయర్లు అయిన కపిల్‌సిబల్‌, దుష్యంత్‌దవే, హరేన్‌రావెల్‌లను రంగంలోకి దించనుంది. గురువారం టీఏసీబీ చీఫ్‌ ఏకేఖాన్‌ సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు రేవంత్‌రెడ్డి బెయిల్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని సమాచారం. అందువల్లే సీనియర్‌ లాయర్లను టీ ఏసీబీ పక్షాన వాదించేందుకు సమాయత్తం చేసింది. :

కేసీఆర్‌ను గద్దె దింపుతా.. అదే నా జీవిత లక్ష్యం

కేసీఆర్‌ను గద్దె దింపుతా.. అదే నా జీవిత లక్ష్యం
రేవంత్ వ్యాఖ్యలు.. జైలు నుంచి బెయిల్‌పై విడుదల

  • తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిలబెడతా
  • కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయ సమాధే
  • అవినీతిని ప్రశ్నించినందుకే నాపై కేసులు
  • నాకు బెయిల్‌తో కేసీఆర్‌కు జ్వరం
  • టీడీపీ జెండాను ఎవరూ ముట్టుకోలేరు
  • ఫిరాయింపుదార్లను గెలిపించుకోండి
  • నాలుగేళ్లు మా పార్టీ జెండానే ఎగరేయం
  • టీఆర్‌ఎస్‌కు రేవంత్‌ రెడ్డి సవాల్‌
  • సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి దాకా ర్యాలీ
  • అంబేద్కర్‌కు దండ.. ఎన్టీఆర్‌కు నివాళి
  • ఎన్టీఆర్‌ భవన్‌ సందర్శన.. సన్మానం
  • ఇంటి నుంచి కొడంగల్‌కు పయనం
హైదరాబాద్‌ జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌ను గద్దెదించుతా! కేసీఆర్‌ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టేలా ప్రజలను చైతన్యపరుస్తా. ప్రతి యువకుడిని భుజం తట్టి లేపుతా’’ అని టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఓటుకు నోటు కేసులో బెయిలుపై విడుదలైన తర్వాత... చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా బయలుదేరిన రేవంత్‌... మార్గమధ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు తెలంగాణ మంత్రులను తీవ్ర పదజాలంతో దునుమాడారు. మంత్రుల పేర్లు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అవినీతిని నిలదీసినందునే... కుట్రపూరితంగా తనను కేసులో ఇరికించారని రేవంత్‌ పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తన మొట్టమొదటి సంతకంతోనే మైహోం రామేశ్వరరావుకు 3 వేల కోట్ల భూమిని అక్రమంగా కట్టబెట్టారు. దీనిని నేను ప్రశ్నించాను. మెడికల్‌ ఫీజులు అడ్డగోలుగా పెంచడంపై హైకోర్టులో కేసు వేశాను. కేసీఆర్‌ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెబుతుంటే నిలదీశాను. అందుకే, నాపై కుట్రపన్ని కేసులో ఇరికించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ నాపైనే ప్రయోగించారు. చర్లపల్లి జైలులో 30 రోజుల పెడితే నేను లొంగిపోతానుకుంటే అది కేసీఆర్‌ భ్రమే. మిస్టర్‌ కేసీఆర్‌... 30 రోజుల జైలు జీవితం... అవసరమైతే నీ కుటుంబంపై 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తాను’’ అని రేవంత్‌ హెచ్చరించారు. ఈ రోజు నుంచి టీఆర్‌ఎస్‌ నేతలకు లాగులు తడుస్తాయన్నారు. ‘‘రేవంత్‌ జైల్లో ఏడుస్తున్నాడా అని టీఆర్‌ఎస్‌ మంత్రులు అని జైలు అధికారులను అడిగారట! నేను స్కామ్‌ ఫైళ్లు చదువుతున్నానని, బయటకు వస్తే మీ పని పడతారని జైలు అధికారులు మంత్రులకు చెప్పారు. నిన్న నాకు బెయిల్‌ వచ్చింది. కేసీఆర్‌కు జ్వరం రావడం మాత్రమే కాదు! లాగు తడుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ లేకుండా కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నేను ఉన్నా. నా పార్టీ ఉంది. మా కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం జెండా ముట్టుకునే మగాడు లేదు. ఎవరన్నా ఉంటే రా చూసుకుందాం! తెలంగాణలో పార్టీకి నేనున్నాను. కార్యకర్తలున్నారు. మా నాయకులున్నారు. కేసీఆర్‌లో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే... ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న సన్నాసుల చేత రాజీనామా చేయించాలి. వారిని తిరిగి ఎన్నికల్లో గెలిపించుకుంటే నాలుగేళ్లు తెలంగాణలో మా పార్టీ జెండా ఎగురవేయం. అదే టీఆర్‌ఎస్‌ ఓటమిపాలైతే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నేలకు ముక్కురాస్తారా?’’ అంటూ రేవంత్‌ సవాల్‌ విసిరారు. గతంలో టీడీపీని లేకుండా చేస్తానన్నవ్యక్తి 48 గంటల్లో పావురాల గుట్టలో పావురమై పోయాడని పరోక్షంగా వైఎస్‌ను విమర్శించారు. 
 
మంత్రులపై రేవంత్‌ ఫైర్‌!
‘‘టీవీల్లో టీఆర్‌ఎస్‌ మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నరు. వీళ్లంతా కేసీఆర్‌కు (పేరు ప్రస్తావించకుండానే) తందానా అంటున్నారు. వీరిలో ఒక్కరైనా పాత చెప్పుతో సమానంగా ఉన్నారా?’’ అని విమర్శించారు. వీరికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలకు సేవ చేయటం మాని టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటానికే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘విద్యార్థులకు రూ.7వేల కోట్ల స్కాలర్‌షి్‌పలు ఇవ్వలేదు. తెలంగాణలో పది యూనివర్సిటీలు ఉంటే ఒక్క వీసీని కూడా నియమించలేదు. ముందు ముందు వాళ్లను నియమించు’’ అని రేవంత్‌ సూచించారు. దుబాయ్‌కి జనాన్ని పంపిస్తానని మోసం చేసినట్లు కేసులు నమోదైతే ఢిల్లీలో ఎమెస్సార్‌ ఇంట్లో దాక్కున్నారంటూ కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ‘‘ఆయన ఇప్పుడు పెద్ద ఉద్యమకారుడా! తెలంగాణ జాతిపితా! వీళ్లు తెలంగాణ తెస్తే... బలిదానం చేసుకున్న 1200 మంది విద్యార్థులు ఎవరు?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అని నినదించారు.
 
సన్నాసులు, బద్మాష్‌లు!
టీ-మంత్రులపై రేవంత్‌ విరుచుకుపడ్డారు. సన్నాసులు, బద్మా్‌షలు అనే పదాలను ప్రయోగించారు. వారి పేర్లు ప్రస్తావించకుండానే... ఆలుగడ్డలవాడు, గోచి పెట్టుకునేవాడు, అమ్మలాంటి పార్టీని అమ్ముకునేవాడు, లంబూ అంటూ పరోక్ష విమర్శలు గుప్పించారు. గ్లాసులు మోసే వాళ్లు, సోడాలు కలిపేవారు మంత్రులుగా ఉన్నారన్నారు.