నోట్ల రద్దుకు ముందే బ్యాంకు ఖాతాల్లోకి వేల కోట్లు: అభిషేక్
04-12-2016 02:17:23
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పెద్ద నోట్ల రద్దు విషయం ప్రధాని మోదీ ఆకస్మికంగా ప్రకటిస్తే.. అంతకు ముందే దేశంలోని అనేక బ్యాంకుల్లో అనూహ్యమైన డిపాజిట్లు ఎలా వచ్చిపడ్డాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు. ఈ అకౌంట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌రలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారమే గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో బ్యాంకులో డిపాజిట్లు రూ. 5.88 లక్షల కోట్లు అధికంగా ఉన్నాయని చెప్పారు.
అనూహ్యంగా పెరిగిన డిపాజిట్లు చూస్తే అనుమానం కలుగుతోందని, అందుకే కాంగ్రెస్ దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని 14.5 లక్షల కోట్ల నల్లధనం బయటకు వస్తోందని నరేంద్ర మోదీ భావించారనీ, అయితే ఇప్పటికే దేశంలో సుమారు పది లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయనీ, మరో 27 రోజుల గడువు ఉన్నందున మిగిలి సొమ్ము కూడా దాదాపుగా డిపాజిట్ అయ్యే పరిస్థితి ఉందన్నారు. అలాంటపుడు పెద్ద నోట్ల రద్దుతో మోదీ సాధించేందేమిటని ప్రశ్నించారు. మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయంతో ఈ రోజు సామాన్యుడు విలవిలలాడుతున్నారనీ, భవిష్యత్తులో ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చన్నారు. ప్రధాని మోదీ తొందరపడి నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోందనీ, ఆయన గడచిన 28 రోజుల్లో తన నిర్ణయాలను 105 సార్లు మార్చుకున్నారని విమర్శించారు. క్యాష్ లెస్ లావాదేవీలు చేస్తానన్న మోదీ దేశాన్ని జాబ్‌లెస్‌గా మారుస్తున్నారన్నారు.

No comments:
Post a Comment