కరెన్సీ లీక్
10-12-2016 01:52:54
50 రోజుల ముందే అనుమానాస్పద లావాదేవీలు
సెప్టెంబరు16-30 మధ్య 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు
అసాధారణ స్థాయిలో నోట్ల వెల్లువ
16నే వందశాతం సీఆర్‌ఆర్ ప్రకటన
కొందరు ముందే పసిగట్టారా?
ఆర్బీఐ అంతరంగాన్ని గుర్తించారా?
నోట్ల రద్దును ఊహించే డిపాజిట్లు?
ఇంకేదైనా లోగుట్టు దాగి ఉందా?
న్యూఢిల్లీ, డిసెంబరు 9: పెద్దనోట్ల రద్దు నిర్ణయం గురించి ‘కొందరికి’ ముందే తెలుసా? లేక... ‘ఇలాంటిదేదో జరగబోతోంది’ అని పసిగట్టి, ముందు జాగ్రత్త పడ్డారా? ఈ సందేహాలకు బలం చేకూర్చే ‘లెక్కలు’ వెలుగు చూస్తున్నాయి. పైకి చూస్తే ఏమాత్రం అనుమానంరాని విధంగా ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ ఏదో జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు 16 నుంచి 30 లోపు... అంటే కేవలం 15 రోజుల్లో బ్యాంకులకు ఏకంగా 3.55 లక్షల కోట్ల రూపాయలు ఎఫ్‌డీలు, రికరింగ్ డిపాజిట్‌ల రూపంలో వచ్చి ఎఫ్‌డీలు, ఆర్‌డీల మొత్తం బ్యాంకులకు రాలేదు. ఇప్పుడు... ప్రజల వద్ద సొమ్ములుండి డిపాజిట్ చేసుకున్నారనో, పొదుపుపై అవగాహన పెరిగి డిపాజిట్లు చేసుకున్నారనో సర్దుకుని పోదామా అంటే అదీ లేదు! ఇక్కడ కిటుకు ఉంది. సరిగ్గా సెప్టెంబరు 16వ తేదీనే రిజర్వు బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది. ‘నేటి నుంచి బ్యాంకులు సేకరించిన డిపాజిట్లకు వంద శాతం సీఆర్‌ఆర్ వర్తిస్తుంది’ అని తెలిపింది. దీనిని కొంచెం వివరంగా చూస్తే... బ్యాంకులు తాము సమీకరించిన డిపాజిట్లలో కొంతమొత్తాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. దానినే నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్)గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 4 శాతం ఉంది. అయితే, సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 11 వరకు సమీకరించిన డిపాజిట్లకు మాత్రం నూరు శాతం సీఆర్‌ఆర్ వర్తిస్తుందని ఆర్బీఐ ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీకి భారీ డిమాండ్ నెలకొంటుందని, దానిని అనుగుణంగా బ్యాంకులకు సరఫరా చేసేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ అంతరంగాన్ని పసిగట్టడం సామాన్యులకు సాధ్యం కాదు. పెద్దనోట్లకు సంబంధించి ఏదో జరగనుందనే అంచనాతోనే ‘కొందరు’ వ్యక్తులు ఆ 15 రోజుల్లో భారీ స్థాయిలో ఎఫ్‌డీలు, ఆర్‌డీలు చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలపరిమితికి లోబడిన డిపాజిట్లలో అసాధారణ పెరుగుదల వెనుక అసలు కారణం ఇదే అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 30తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంకింగ్ రంగంలోని డిపాజిట్ల మొత్తం 100.93 లక్షల కోట్లు. అంతకుముందు పక్షంలో అంటే సెప్టెంబర్ 16నాటికి ఈ డిపాజిట్ల మొత్తం 97.38 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మార్కెట్లో శ్రుతిమించిన లిక్విడిటీని (నగదు చెలామణి) నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించినప్పటికీ... అందుకు, సెప్టెంబర్ 16ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఆ రోజు నుంచే డిపాజిట్లు బ్యాంకులకు వెల్లువెత్తడం గమనార్హం. ఈ డిపాజిట్ల వెల్లువకు వేతన సవరణ కమిషన్ బకాయిల చెల్లింపులే కారణమని ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పుడు చెప్పారు. రంధ్రాన్వేషణ చేయడాన్ని తప్పుబట్టారు. అయితే... ఈ బకాయిల కింద సెప్టెంబర్ మొదటి వారం వరకు విడుదలైన మొత్తం 45 వేల కోట్ల రూపాయలకంటే మించదు. పైగా ఇవన్నీ సేవింగ్స్ ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయి. సెప్టెంబర్ ద్వితీయ పక్షంలో పెరిగినవి మాత్రం టైమ్ డిపాజిట్లు కావడం గమనార్హం. వీటన్నింటి నేపథ్యంలో... పెద్దనోట్ల రద్దును ముందే పసిగట్టిన వారే భారీ స్థాయిలో సొమ్ములను వైట్‌గా ‘వదిలించుకున్నట్లు’ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. సెప్టెంబరు 30 తర్వాత పక్షం రోజుల్లో సుమారు 1.2 లక్షల కోట్ల టైమ్ డిపాజిట్లను బ్యాంకుల నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది కూడా అసాధారణ పరిణామమే! మరి దీనికి కారణమేమిటని విశ్లేషిస్తే... ఆదాయ పన్ను వెల్లడి (ఐడీఎ్‌స)కు అప్పటికే గడువు ముగిసింది. అంటే... ఐడీఎస్ కింద 45 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత చూపించే ఆదాయంపై సాధారణ నిబంధనల మేరకు 30శాతం పన్ను చెల్లిస్తే చాలు. ఇలా బ్యాంకుల నుంచి వేసి/తీసిన డిపాజిట్లను తెలుపుగా చూపించి పన్ను కట్టే సరిపోతుంది! ఈ డిపాజిట్ల వెనుక రహస్యం ఇదే కావొచ్చునని కూడా విశ్లేషిస్తున్నారు.
RBI asks banks to set aside deposits garnered between September 16 & November 11
By Joel Rebello & Saikat Das, ET Bureau | Nov 26, 2016, 09.42 PM IST
http://economictimes.indiatimes.com/articleshow/55637533.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

No comments:
Post a Comment