Thursday, 8 December 2016

నోట్ల రద్దు తర్వాత.. ఇచ్చింది రూ.4.27 లక్షల కోట్లు!

నోట్ల రద్దు తర్వాత.. ఇచ్చింది రూ.4.27 లక్షల కోట్లు!
09-12-2016 03:48:45
వెనక్కి వచ్చింది రూ.11.85 లక్షల కోట్లు
ముంబై, డిసెంబరు 8: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు రూ.4.27 లక్షల కోట్లను జారీ చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. నవంబరు 10వ తేదీ నుంచి ఈ మొత్తాన్ని ప్రజలకు అందజేసినట్లు తెలిపింది. అదే సమయంలో రూ.11.85 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లను ప్రజలు బ్యాంకుల్లో జమ చేశారని పేర్కొంది. త్వరలో మహాత్మా గాంధీ సిరీ్‌స్‌తో కొత్త రూ.500 నోట్లను విడుదల చేస్తామని తెలిపింది. ఈ నెల 15వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున రూ.500 నోట్లు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

No comments:

Post a Comment