అమరావతి బాధ్యత ‘ఫోస్టర్’కి!
04-12-2016 01:23:28
మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక
రెండు మూడు రోజుల్లో ప్రకటన
డిజిటల్‌దే భవిష్యత్తు
ప్రతి గ్రామం నగదురహితం
మార్పుకి అలవాటుపడాలి: బాబు
కొలిక్కి వచ్చిన పరిశీలన
సీఎం ఆమోదమే తరువాయి
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణ రూపశిల్పి ఎంపిక కొలిక్కి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ సంస్థ ‘ఫోస్టర్ అండ్ పార్టనర్స్’ని అమరావతి నగర నిర్మాణానికి మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. అమరావతికి మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు ఏపీసీఆర్డీయే ప్రపంచస్థాయి పోటీ నిర్వహించింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మూడు ఆర్కిటెక్చరల్ సంస్థలు.. ఫోస్టర్ అండ్ పార్టనర్స్, స్పేస్ గ్రూప్, జీఎంపీ ఇంటర్నేషనల్ సంస్థలు పాల్గొని డిజైన్లు సమర్పించాయి. వీటిని పరిశీలించిన నిపుణులు, సీఆర్డీయే అధికారులు.. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ అందజేసిన ప్రతిపాదనలకే మొగ్గుచూపారు. అయితే ఈ సంస్థను ఎంపిక చేసిన విషయాన్ని ప్రకటించేందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు, మున్సిపల్ మంత్రి నారాయణ.. ఫోస్టర్ అందించిన ప్రతిపాదనలను పరిశీలించి తుది ఆమోదం తెలపాల్సి ఉంది. వారు ఆమోదముద్ర వేసిన తర్వాతే మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికపై ప్రకటన వెలువడుతుందని, దీనికి రెండుమూడు రోజులు పట్టవచ్చని సమాచారం. అమరావతి నగర మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపికయ్యే సంస్థ.. అమరావతిలోని 1350 ఎకరాల్లో సుమారు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్లనే కాకుండా అర్బన మాస్టర్‌ప్లాన, గైడ్‌లైన్లను రూపొందించడంతోపాటు అందులోని ఐకానిక్ బిల్డింగ్స్ (అసెంబ్లీ, హైకోర్టు)కు రూపకల్పన చేయాల్సి ఉంటుంది.
శ్రీధర్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన
మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక విషయాన్ని చర్చించేందుకు సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ శనివారం చివరి నిమిషంలో సీఎంతోపాటు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. న్యూఢిల్లీలో జరిగే సదస్సులో పాల్గొనేందుకు శనివారం సీఎం బయలుదేరి వెళ్లారు. ఆఖరి నిమిషంలో.. సీఎం ఆదేశాలతో శ్రీధర్ కూడా ఆయనతోపాటు ఢిల్లీ బయలుదేరారు. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రతిపాదనల గురించి సీఎంకు వివరించేందుకే శ్రీధర్ ఆయనతోపాటు వెళ్లినట్లు సమాచారం.
గత అనుభవం పునరావృతమవ్వరాదనే..
అమరావతి మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపికైన సంస్థ పేరును డిసెంబర్ 2న ప్రకటించాలని భావించారు. అయితే, ఈ ఏడాది ప్రథమార్ధంలో మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం తొలిసారిగా జరిపిన పోటీలో జపానకు చెందిన మాకీ అసోసియేట్స్‌ను విజేతగా ప్రకటించారు. అయితే, మాకీ రూపొందించిన డిజైన్లపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మాకీకి బాధ్యతలు అప్పగించలేదు. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం ఈసారైనా అందరి ఆమోదం తీసుకొని మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పకడ్బందీగా కసరత్తు చేసిన తర్వాతే ప్రకటన చేయాలని నిర్ణయించారు.
ప్రపంచస్థాయి డిజైన్లలో మాస్టర్.. ఫోస్టర్
బ్రిటన రాజధాని లండన ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ‘ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్’కు ఆర్కిటెక్చరల్ రంగంలో నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. గత 40 ఏళ్లలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు పేరెన్నికగన్న నిర్మాణాలకు డిజైన్టను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలను కలిగి ఉన్న ఈ సంస్థ.. ఆకర్షణీయ కట్టడాలకు డిజైన్లను రూపొందించింది. అర్బన మాస్టర్ ప్లాన్లు, పబ్లిక్ ఇనఫ్రాస్ట్రక్చర్, విమానాశ్రయాలు, సివిక్ అండ్ కల్చరల్ బిల్డింగ్స్, కార్యాలయాలు, వర్క్‌స్పే్‌సలు, ప్రైవేట్ గృహాలు, కన్వెన్షన సెంటర్లు వంటి పలు రకాల నిర్మాణాలను రూపకల్పన చేసిన ఘనత దీని సొంతం. జర్మనీలో డ్యూస్‌బర్గ్ నగర మాస్టర్‌ప్లాన్‌ను ఈ సంస్థే రూపొందించింది. ఇటలీలోని ఫ్లోరెన్స్ టీఏవీ స్టేషన్‌కు అద్భుతమైన డిజైన్‌ను అందించిన ఘతన ఈ సంస్థ సొంతం. కజకిస్థాన్‌లోని ప్యాలెస్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన భవనానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఇండెక్స్ టవర్‌కు డిజైన్లు అందించింది ఈ సంస్థే.

No comments:
Post a Comment