Thursday, 8 December 2016

బాబు అప్పీలుపై నేడు హైకోర్టు తీర్పు

బాబు అప్పీలుపై నేడు హైకోర్టు తీర్పు
09-12-2016 03:17:39
హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పీలుపై హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పనుంది. ఆయనపై విచారణకు ఆదేశిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, ఈ ఉత్తర్వులను ఆయన హైకోర్టులో అప్పీల్‌ చేయడం తెలిసిందే. ఈ పిటిషన్‌లో వాది, ప్రతివాది వాదనలతో పాటు ఇంప్లీడ్‌ పిటిషనర్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వాదనలను కూడా ధర్మాసనం ఆలకించింది. శుక్రవారం తీర్పును వెలువరించనుంది.

No comments:

Post a Comment