Friday, 9 December 2016

Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case


Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case
Andhra Pradesh | Press Trust of India | Updated: December 09, 2016 23:04 IST
  by Taboola Sponsored Links Sponsored
ELSS Can Help You get Deduction upto Rs 1.5L u/s 80C of the Income Tax Act, 1961. Know More (Franklin Templeton Investments)
Churches Say No to Wedding Gowns (The Week)
EMAIL
PRINT
1
COMMENTS
Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case
Chandrababu Naidu had accused the TRS Government in Telangana of illegally tapping phones.
HYDERABAD:  In a relief to Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, the Hyderabad High Court today dismissed a complaint filed by a YSR Congress lawmakers seeking investigation into his alleged role in the cash-for-vote case.

The court allowed Mr Naidu's plea seeking relief and dismissed the complaint filed by Ramakrishna Reddy on the ground that the latter had no locus standi to file such an application.

The lawmaker's counsel P Sudhakar Reddy said he had filed a private complaint in an ACB court making Mr Naidu an accused in the cash-for-vote issue.

The ACB court had ordered probe by ACB over alleged involvement of Mr Naidu who sought relief in the High Court.

Mr Naidu had got a temporary relief in the High Court, but it was challenged by the lawmaker in the Supreme Court. The apex court referred the matter to the High Court.

The lawmaker's counsel said they will pursue legal options against Mr Naidu.


The so-called cash-for-vote pertains to allegations against TDP lawmaker Revant Reddy and others that they tried to bribe a nominated lawmaker in MLC polls. Mr Naidu had accused the TRS Government in Telangana of illegally tapping phones.

In May 2015, nominated lawmaker in Telangana Assembly Elvis Stephenson lodged a complaint alleging that he was offered Rs. 5 crore by TDP lawmaker Revanth Reddy to vote for TDP nominee in the election to the Telangana Legislative Council on June 1.

On May 31, ACB arrested Revanth Reddy, Bishop Sebastian Harry and Rudra Udaya Simha when they were allegedly handing over an advance sum of Rs. 50 lakh to Stephenson.

A charge sheet filed by the ACB on July 28 last year mentioned TDP chief Naidu's name, but not as an accused.

An audio tape of Mr Naidu's purported conversation with Stephenson over phone on May 30, a day before the ACB arrested Mr Revanth, had found its way to the media.విచారణ అక్కర్లేదు
10-12-2016 01:34:07

ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట
ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు
యాంత్రికంగా ఆదేశాలిచ్చిందని వ్యాఖ్య
హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చంద్రబాబు పాత్రపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు సీజ్‌ చేసిన టేపుల్లోని గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేస్తోందని, ఈ కేసులో ఆయనపై కూడా విచారణ జరపాలని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 210 కింద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. ఆడియో టేపుల్లోని అంశాలపైనా విచారణ చేసి సెప్టెంబరు 29లోగా నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి సెప్టెంబర్‌ 2న మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత ఈ వ్యాజ్యం మరో న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంలో తుది వాదనలు గత నెలలో ముగిశాయి. ఈ కేసులో తన వాదనలు వినాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యాజ్యంలో 97 పేజీల తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి శుక్రవారం వెలువరించారు.

ప్రజాహితం పేరుతో కేసుతో సంబంధంలేని మూడో వ్యక్తి చేసిన ఫిర్యాదుపై... అతని సశ్చీలతను పరిగణనలోకి తీసుకోకుండా విచారణకు ఆదేశిస్తే కేసు దర్యాప్తునకు అంతం ఉండదంటూ తెలంగాణ ఏసీబీ చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కేసును దర్యాప్తు చేయడంలో సదరు ఏజెన్సీ (ఏసీబీ) విఫలమైతే ఫిర్యాదుదారు లేదా అతనికి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఇక్కడ ఫిర్యాదుదారు స్టీఫెన్‌సన్‌.. ఏసీబీ దర్యాప్తుపై ఎటువంటి ఆక్షేపణలు చేయలేదని తెలిపింది. ఏసీబీ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కూడా.. ఈ కేసులో ఫిర్యాదు దారుడు స్టీఫెన్‌సన్‌, ఏసీబీతో కుమ్మక్కయి కేసును తప్పుదారి పట్టిస్తున్నారనే అభియోగాలు చేయలేదని కోర్టు గుర్తు చేసింది. ‘ఈ కేసులో జోక్యం చేసుకున్న మూడో వ్యక్తి ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే. అతను ఏవిధంగాను బాధితుడు కాదు. అటువంటి మూడో వ్యక్తులను కోర్టులు ప్రోత్సహించరాదు’ అని తీర్పులో స్పష్టం చేసింది. రామకృష్ణా రెడ్డికి ఏసీబీ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేయడానికి అర్హత (లోక్‌సస్టాండి) లేదని పేర్కొంది.
‘వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ అతను కోర్టు పరిశీలనకు ఇచ్చిన పత్రాలకు న్యాయబద్ధమైన ప్రామాణికత లేదు. కోర్టుకు ఇచ్చిన పత్రాలను రామకృష్ణా రెడ్డి వక్రమార్గంలో సేకరించారు. ఇటు వంటి చర్యలను ప్రొత్సహించడం మంచి సంప్రదాయం కాదు’ అని హైకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగించాలని ఆదేశించినా ఈ కేసులో రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి చట్టం సమ్మతించదని, వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు యాంత్రికంగా ఆదేశాలు ఇచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఫిర్యాది.. చంద్రబాబుపై ఆరోపణలు చేయలేదు
‘అవినీతిని ప్రోత్సహించడమూ శిక్షార్హమే. అయితే చంద్ర బాబుపై ఫిర్యాదుదారుడు(స్టీఫెన్‌సన్‌) తన ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేవలం ఫోన్‌ సంభాషణల ఆధారంగా రామకృష్ణా రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. వాటిని చట్ట ప్రకారం రుజువు చేయడం కష్టం’ అని తీర్పులో వ్యాఖ్యానించారు. ‘క్రిమినల్‌ కేసులో... కేసుతో సంబంధంలేని మూడోవ్యక్తి జోక్యం చేసుకోడానికి వీల్లేదు. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులు ప్రైవేటు ఫిర్యాదు చేయడం, దానిపై ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం, అప్పీలు పిటిషన్‌లో మరొకరు ఇంప్లీడు కావడం మంచి సంప్రదాయం కాదు’ అంటూ చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలనూ... న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

No comments:

Post a Comment