Saturday, 10 December 2016

Currency Leak?

కరెన్సీ లీక్

RBI asks banks to set aside deposits garnered between September 16 & November 11

By Joel Rebello & Saikat Das, ET Bureau | Nov 26, 2016, 09.42 PM IST

 

http://economictimes.indiatimes.com/articleshow/55637533.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst


10-12-2016 01:52:54
50 రోజుల ముందే అనుమానాస్పద లావాదేవీలు
సెప్టెంబరు16-30 మధ్య 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు
అసాధారణ స్థాయిలో నోట్ల వెల్లువ
16నే వందశాతం సీఆర్‌ఆర్‌ ప్రకటన
కొందరు ముందే పసిగట్టారా?
ఆర్బీఐ అంతరంగాన్ని గుర్తించారా?
నోట్ల రద్దును ఊహించే డిపాజిట్లు?
ఇంకేదైనా లోగుట్టు దాగి ఉందా?
న్యూఢిల్లీ, డిసెంబరు 9: పెద్దనోట్ల రద్దు నిర్ణయం గురించి ‘కొందరికి’ ముందే తెలుసా? లేక... ‘ఇలాంటిదేదో జరగబోతోంది’ అని పసిగట్టి, ముందు జాగ్రత్త పడ్డారా? ఈ సందేహాలకు బలం చేకూర్చే ‘లెక్కలు’ వెలుగు చూస్తున్నాయి. పైకి చూస్తే ఏమాత్రం అనుమానంరాని విధంగా ‘సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌’ ఏదో జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు 16 నుంచి 30 లోపు... అంటే కేవలం 15 రోజుల్లో బ్యాంకులకు ఏకంగా 3.55 లక్షల కోట్ల రూపాయలు ఎఫ్‌డీలు, రికరింగ్‌ డిపాజిట్‌ల రూపంలో వచ్చి ఎఫ్‌డీలు, ఆర్‌డీల మొత్తం బ్యాంకులకు రాలేదు. ఇప్పుడు... ప్రజల వద్ద సొమ్ములుండి డిపాజిట్‌ చేసుకున్నారనో, పొదుపుపై అవగాహన పెరిగి డిపాజిట్లు చేసుకున్నారనో సర్దుకుని పోదామా అంటే అదీ లేదు! ఇక్కడ కిటుకు ఉంది. సరిగ్గా సెప్టెంబరు 16వ తేదీనే రిజర్వు బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది. ‘నేటి నుంచి బ్యాంకులు సేకరించిన డిపాజిట్లకు వంద శాతం సీఆర్‌ఆర్‌ వర్తిస్తుంది’ అని తెలిపింది. దీనిని కొంచెం వివరంగా చూస్తే... బ్యాంకులు తాము సమీకరించిన డిపాజిట్లలో కొంతమొత్తాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. దానినే నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 4 శాతం ఉంది. అయితే, సెప్టెంబర్‌ 16 నుంచి నవంబర్‌ 11 వరకు సమీకరించిన డిపాజిట్లకు మాత్రం నూరు శాతం సీఆర్‌ఆర్‌ వర్తిస్తుందని ఆర్బీఐ ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీకి భారీ డిమాండ్‌ నెలకొంటుందని, దానిని అనుగుణంగా బ్యాంకులకు సరఫరా చేసేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ అంతరంగాన్ని పసిగట్టడం సామాన్యులకు సాధ్యం కాదు. పెద్దనోట్లకు సంబంధించి ఏదో జరగనుందనే అంచనాతోనే ‘కొందరు’ వ్యక్తులు ఆ 15 రోజుల్లో భారీ స్థాయిలో ఎఫ్‌డీలు, ఆర్‌డీలు చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలపరిమితికి లోబడిన డిపాజిట్లలో అసాధారణ పెరుగుదల వెనుక అసలు కారణం ఇదే అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌ 30తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలోని డిపాజిట్ల మొత్తం 100.93 లక్షల కోట్లు. అంతకుముందు పక్షంలో అంటే సెప్టెంబర్‌ 16నాటికి ఈ డిపాజిట్ల మొత్తం 97.38 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మార్కెట్లో శ్రుతిమించిన లిక్విడిటీని (నగదు చెలామణి) నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించినప్పటికీ... అందుకు, సెప్టెంబర్‌ 16ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఆ రోజు నుంచే డిపాజిట్లు బ్యాంకులకు వెల్లువెత్తడం గమనార్హం. ఈ డిపాజిట్ల వెల్లువకు వేతన సవరణ కమిషన్‌ బకాయిల చెల్లింపులే కారణమని ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పుడు చెప్పారు. రంధ్రాన్వేషణ చేయడాన్ని తప్పుబట్టారు. అయితే... ఈ బకాయిల కింద సెప్టెంబర్‌ మొదటి వారం వరకు విడుదలైన మొత్తం 45 వేల కోట్ల రూపాయలకంటే మించదు. పైగా ఇవన్నీ సేవింగ్స్‌ ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయి. సెప్టెంబర్‌ ద్వితీయ పక్షంలో పెరిగినవి మాత్రం టైమ్‌ డిపాజిట్లు కావడం గమనార్హం. వీటన్నింటి నేపథ్యంలో... పెద్దనోట్ల రద్దును ముందే పసిగట్టిన వారే భారీ స్థాయిలో సొమ్ములను వైట్‌గా ‘వదిలించుకున్నట్లు’ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. సెప్టెంబరు 30 తర్వాత పక్షం రోజుల్లో సుమారు 1.2 లక్షల కోట్ల టైమ్‌ డిపాజిట్లను బ్యాంకుల నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది కూడా అసాధారణ పరిణామమే! మరి దీనికి కారణమేమిటని విశ్లేషిస్తే... ఆదాయ పన్ను వెల్లడి (ఐడీఎ్‌స)కు అప్పటికే గడువు ముగిసింది. అంటే... ఐడీఎస్‌ కింద 45 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత చూపించే ఆదాయంపై సాధారణ నిబంధనల మేరకు 30శాతం పన్ను చెల్లిస్తే చాలు. ఇలా బ్యాంకుల నుంచి వేసి/తీసిన డిపాజిట్లను తెలుపుగా చూపించి పన్ను కట్టే సరిపోతుంది! ఈ డిపాజిట్ల వెనుక రహస్యం ఇదే కావొచ్చునని కూడా విశ్లేషిస్తున్నారు.

Friday, 9 December 2016

Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case


Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case
Andhra Pradesh | Press Trust of India | Updated: December 09, 2016 23:04 IST
  by Taboola Sponsored Links Sponsored
ELSS Can Help You get Deduction upto Rs 1.5L u/s 80C of the Income Tax Act, 1961. Know More (Franklin Templeton Investments)
Churches Say No to Wedding Gowns (The Week)
EMAIL
PRINT
1
COMMENTS
Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case
Chandrababu Naidu had accused the TRS Government in Telangana of illegally tapping phones.
HYDERABAD:  In a relief to Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, the Hyderabad High Court today dismissed a complaint filed by a YSR Congress lawmakers seeking investigation into his alleged role in the cash-for-vote case.

The court allowed Mr Naidu's plea seeking relief and dismissed the complaint filed by Ramakrishna Reddy on the ground that the latter had no locus standi to file such an application.

The lawmaker's counsel P Sudhakar Reddy said he had filed a private complaint in an ACB court making Mr Naidu an accused in the cash-for-vote issue.

The ACB court had ordered probe by ACB over alleged involvement of Mr Naidu who sought relief in the High Court.

Mr Naidu had got a temporary relief in the High Court, but it was challenged by the lawmaker in the Supreme Court. The apex court referred the matter to the High Court.

The lawmaker's counsel said they will pursue legal options against Mr Naidu.


The so-called cash-for-vote pertains to allegations against TDP lawmaker Revant Reddy and others that they tried to bribe a nominated lawmaker in MLC polls. Mr Naidu had accused the TRS Government in Telangana of illegally tapping phones.

In May 2015, nominated lawmaker in Telangana Assembly Elvis Stephenson lodged a complaint alleging that he was offered Rs. 5 crore by TDP lawmaker Revanth Reddy to vote for TDP nominee in the election to the Telangana Legislative Council on June 1.

On May 31, ACB arrested Revanth Reddy, Bishop Sebastian Harry and Rudra Udaya Simha when they were allegedly handing over an advance sum of Rs. 50 lakh to Stephenson.

A charge sheet filed by the ACB on July 28 last year mentioned TDP chief Naidu's name, but not as an accused.

An audio tape of Mr Naidu's purported conversation with Stephenson over phone on May 30, a day before the ACB arrested Mr Revanth, had found its way to the media.విచారణ అక్కర్లేదు
10-12-2016 01:34:07

ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట
ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు
యాంత్రికంగా ఆదేశాలిచ్చిందని వ్యాఖ్య
హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చంద్రబాబు పాత్రపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు సీజ్‌ చేసిన టేపుల్లోని గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేస్తోందని, ఈ కేసులో ఆయనపై కూడా విచారణ జరపాలని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 210 కింద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. ఆడియో టేపుల్లోని అంశాలపైనా విచారణ చేసి సెప్టెంబరు 29లోగా నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి సెప్టెంబర్‌ 2న మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత ఈ వ్యాజ్యం మరో న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంలో తుది వాదనలు గత నెలలో ముగిశాయి. ఈ కేసులో తన వాదనలు వినాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యాజ్యంలో 97 పేజీల తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి శుక్రవారం వెలువరించారు.

ప్రజాహితం పేరుతో కేసుతో సంబంధంలేని మూడో వ్యక్తి చేసిన ఫిర్యాదుపై... అతని సశ్చీలతను పరిగణనలోకి తీసుకోకుండా విచారణకు ఆదేశిస్తే కేసు దర్యాప్తునకు అంతం ఉండదంటూ తెలంగాణ ఏసీబీ చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కేసును దర్యాప్తు చేయడంలో సదరు ఏజెన్సీ (ఏసీబీ) విఫలమైతే ఫిర్యాదుదారు లేదా అతనికి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఇక్కడ ఫిర్యాదుదారు స్టీఫెన్‌సన్‌.. ఏసీబీ దర్యాప్తుపై ఎటువంటి ఆక్షేపణలు చేయలేదని తెలిపింది. ఏసీబీ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కూడా.. ఈ కేసులో ఫిర్యాదు దారుడు స్టీఫెన్‌సన్‌, ఏసీబీతో కుమ్మక్కయి కేసును తప్పుదారి పట్టిస్తున్నారనే అభియోగాలు చేయలేదని కోర్టు గుర్తు చేసింది. ‘ఈ కేసులో జోక్యం చేసుకున్న మూడో వ్యక్తి ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే. అతను ఏవిధంగాను బాధితుడు కాదు. అటువంటి మూడో వ్యక్తులను కోర్టులు ప్రోత్సహించరాదు’ అని తీర్పులో స్పష్టం చేసింది. రామకృష్ణా రెడ్డికి ఏసీబీ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేయడానికి అర్హత (లోక్‌సస్టాండి) లేదని పేర్కొంది.
‘వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ అతను కోర్టు పరిశీలనకు ఇచ్చిన పత్రాలకు న్యాయబద్ధమైన ప్రామాణికత లేదు. కోర్టుకు ఇచ్చిన పత్రాలను రామకృష్ణా రెడ్డి వక్రమార్గంలో సేకరించారు. ఇటు వంటి చర్యలను ప్రొత్సహించడం మంచి సంప్రదాయం కాదు’ అని హైకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగించాలని ఆదేశించినా ఈ కేసులో రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి చట్టం సమ్మతించదని, వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు యాంత్రికంగా ఆదేశాలు ఇచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఫిర్యాది.. చంద్రబాబుపై ఆరోపణలు చేయలేదు
‘అవినీతిని ప్రోత్సహించడమూ శిక్షార్హమే. అయితే చంద్ర బాబుపై ఫిర్యాదుదారుడు(స్టీఫెన్‌సన్‌) తన ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేవలం ఫోన్‌ సంభాషణల ఆధారంగా రామకృష్ణా రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. వాటిని చట్ట ప్రకారం రుజువు చేయడం కష్టం’ అని తీర్పులో వ్యాఖ్యానించారు. ‘క్రిమినల్‌ కేసులో... కేసుతో సంబంధంలేని మూడోవ్యక్తి జోక్యం చేసుకోడానికి వీల్లేదు. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులు ప్రైవేటు ఫిర్యాదు చేయడం, దానిపై ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం, అప్పీలు పిటిషన్‌లో మరొకరు ఇంప్లీడు కావడం మంచి సంప్రదాయం కాదు’ అంటూ చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలనూ... న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

Thursday, 8 December 2016

బాబు అప్పీలుపై నేడు హైకోర్టు తీర్పు

బాబు అప్పీలుపై నేడు హైకోర్టు తీర్పు
09-12-2016 03:17:39
హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పీలుపై హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పనుంది. ఆయనపై విచారణకు ఆదేశిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, ఈ ఉత్తర్వులను ఆయన హైకోర్టులో అప్పీల్‌ చేయడం తెలిసిందే. ఈ పిటిషన్‌లో వాది, ప్రతివాది వాదనలతో పాటు ఇంప్లీడ్‌ పిటిషనర్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వాదనలను కూడా ధర్మాసనం ఆలకించింది. శుక్రవారం తీర్పును వెలువరించనుంది.

‘Note-for-vote’ scam: ‘No stay’ on the ACB cases says Supreme Court

‘Note-for-vote’ scam: ‘No stay’ on the ACB cases says Supreme Court

Friday, September 23, 2016
New Delhi/Hyderabad

The Supreme Court on Friday made it clear that no court has the power to stay the proceedings in corruption cases.

The apex court dealing with a Special Leave Petition filed by MLA Alla Ramakrishna Reddy challenging the stay order issued by Hyderabad High Court on the role of Andhra Pradesh Chief Minster Nara Chandrababu Naidu’s role in the ‘Note-for-Vote’ scam.

It may be recalled that Chandrababu Naidu filed a quash petition in Hyderabad High Court and got a stay order not to investigate his role in the said scam.

A Division Bench comprising of Justices S.A.Bobde and Justice Ashok Bhushan said that notices will be served on the parties after going through the SLP. The advocate for Chandrababu Naidu Siddaradha Ludra put forth his arguments and the Bench amended its orders after the completion of arguments.

The Division Bench said that that interim orders issued by High court was challenged through Special Leave Petition and made it clear that the court cannot interfere and to stay the proceedings and dismisses the SLP. But the Supreme Court suggested the High Court to complete the entire proceeds in the case within four weeks from today and give a final order. The directions were accepted by the respondent advocate. The court has given relief to the petitioner to approach the court in the event of failure by the High Court.

The ACB has already completed its investigation and filed a charge sheet and the High Court passed the interim orders stalling the special court’s orders and as such the petition is not maintainable, Ludra argued. At this juncture, Justice Bobde interfering into the arguments said that the designated court when ordered for reinvestigation in cases pertaining to Prevention of Corruption Cases, no court has the powers to interfere and quoted Section 19(3)B, Section-19(3). As such, the court cannot interfere in the instant case, he said.

Counsel for the petitioner Sekhar putting forth his arguments said that the designated court has ordered for reinvestigation of the case and supporting evidences have been submitted to the court. He said that the special court has ordered for completion of the investigation and directed the ACB to submit its report before September 2, 2016. The respondent has approached the High Court and got stay orders that promoted to knock the doors of the apex court, he said.

Justice SA Bobde assured and directed the High Court to complete the proceedings and a final decision should be taken within four weeks from today. It may be recalled that the High Court while passing the orders said on Sept 2, 'the High Court granted stay on the order passed by the ACB Court. While adjourning the case by eight weeks, it directed the ACB and the MLA to file counter affidavits in the matter. While granting interim order, the court made it clear that this stay will not be applicable to the main case registered based on the complaint of TRS nominated MLA Elvis Stephenson by the ACB and the proceedings in that case may go on.'

Cash for vote case: 10 reasons why TDP has no takers in its battle with TRS

Cash for vote case: 10 reasons why TDP has no takers in its battle with TRS
Jun 20, 2015 15:30 IST

By A Saye Sekhar 
By having a notice issued to T-News, a Telugu news channel backed by the family of Chief Minister KCR, in the dead of midnight, his bete noire and Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has taken his war with Telangana Rashtra Samithi (TRS) to a new low.
For those who came in late, T News is the first Telugu news channel that has aired the purported audio tapes of a telephone conversation between Chandrababu Naidu and nominated Anglo-Indian MLA in Telangana Assembly Elvis Stephenson.
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu. IBNLive imageAndhra Pradesh Chief Minister N Chandrababu Naidu. IBNLive image
Ever since Telugu Desam MLA A Revanth Reddy was caught "red-handed" and arrested in the cash for vote muddle, the Telugu Desam Party has been making vain bids to whitewash the party's overture with the Anglo-Indian MLA. However, on the other hand, the sordid episode is seen by many across both states as despicable and has fallen flat on the face of the TDP in general and its supremo in particular.
Soon enough, the rank and file of the TDP have sardonically begun a hue and cry against the TRS and Telangana government over the episode. Notwithstanding the 'tactical counter-offensive campaign' [a strategy devised and implemented by the People's War Group, the erstwhile form of CPI (Maoist)], by the TDP, their voice has seemingly whimpered with the brittle arguments.
Here are the 10 reasons why the wiles of Chandrababu Naidu and his bandwagon are too feeble for people to buy.
1. As soon as Revanth Reddy was arrested, the TDP described it as a conspiracy by KCR to embarrass Chandrababu Naidu. But no one could brush aside the video footage telecast on channels as false and fabricated, for the scenes and voices of the accused in the cash for vote case have been captured in their ugliest form.
2. Once the issue percolated deep down into the people's minds, audiotapes of a purported conversation between Naidu and Stephenson surfaced, rattling the TDP and shaking the AP government. This came as such a rude shock to the TDP that it has spared no effort to portray the episode as a war between the two states, but to no avail.
3. Soon after the audiotapes were telecast, AP government's advisor Parakala Prabhakar, husband of Union Minister Nirmala Seetharaman, came in front of the TV cameras and averred three mutually contradictory statements: a. That the voice in the recorded tapes was not that of Chandrababu Naidu; b. That the voice of Naidu was edited by picking it up in bits and pieces from different occasions; c. The telephones of the Chief Minister were tapped by the sly Telangana government, which was illegal. The statements of Prabhakar did a lot of disservice to the TDP by jeopardizing its chances of sticking to one charge of telephone tapping.
4. Chandrababu Naidu ,too, had to go about town saying that the telephones of 125 important people in Andhra Pradesh were "illegally tapped" by the Telangana government. He also had to cling on to the argument that his voice was superimposed on the tapes by an act of "cut-copy-paste". The slew of 80-odd cases filed against KCR across different places in Andhra Pradesh, charging him with telephone tapping, is now being seen as a bid by the TDP government to create an inter-state legal wrangle and "divert the attention" of the country from the cash for vote case.
5. The subsequent constitution of Special Investigation Team (SIT) to probe these cases; and the complaint filed by one of the accused persons in the cash for vote case Jerusalem Mathaiah accusing the top-brass of the TRS of threatening him with dire consequences laid bare the TDP's counter-offensive efforts and its tottering stand over the grounds of moral turpitude on which the Telangana government attacked it.
6. Chandrababu Naidu could neither rule out that it was his voice that was recorded in the audiotapes that "were put out" in a TV interview with Rajdeep Sardesai of India Today. His incoherent responses to Pallavi Ghosh in an interview to CNN-IBN too laid bare the weak-kneed approach of the TDP.
7. The bogey raised by the AP government over the implementation of Section 8 of the AP Reorganisation Act 2014 - empowering the Governor to oversee the law and order in Hyderabad - further melted the "presumably solid" stand of the TDP over the telephone tapping charge, which it brought out only after Revanth Reddy's case was exposed.
8. The bleating of TDP leaders, including some ministers, against Governor ESL Narasimhan in geometric progression reached its crescendo, only with a perceived threat that the constitutional head of the two states might accord permission for criminal proceedings against AP Chief Minister. After critcising him with the proverbial bell, book and candle for three full days, the windbags withdrew their comments at the behest of their boss, albeit behind the scene, only "if our comments have hurt the feelings of the Governor." A minister K Acchennaidu, brother of former Union Minister the late Yerran Naidu, went to the extent of calling the Governor a "caparisoned ox". But the demo of remorse among them was orchestrated only after the reports that the Governor was peeved by such churlish comments.
9. The TDP government of AP, which is harping on a high-decibel campaign about Hyderabad being the common capital, has begun nursing the idea of setting up of its own police stations in the city. This would lead to a "constitutional deadlock" and internally some TDP leaders were confessing that this is what the leadership wanted precisely. If not anything else, this will, at least, trigger Centre's intervention to bail out Chandrababu Naidu. However, the TRS government has been effectively countering this asserting that there hasn't been a single incident that ignited a regional discord in Hyderabad in the last one year.
10. Last, but not the least, the Chandrababu Naidu Administration had Visakhapatnam Assistant Commissioner of Police serve a notice on T-News channel on the intervening night of Friday and Saturday seeking an explanation under Section 19 of Cable TV Network Regulation Act -1995 for airing the audio tape" conversation that could lead to a "discord" and provoke tensions between people of the two states and political parties. This is also likely to ascribe an inter-state dimension to the ongoing episode.
What is asphyxiating the TDP is that the BJP is not lending its shoulder to its junior NDA partner in the hour of crisis. This led to the social media braggarts of the TDP to train their guns at the BJP and Narendra Modi.
These numerous acts of omission and commission to project the cash for vote as a flash point between the two states was, however, denounced vehemently by Telangana Chief Minister KCR and several TRS leaders, who said that it was "a serious case of political corruption" and the people of both States had nothing to rue about it.
First Published On : Jun 20, 2015 15:30 IST

నోట్ల రద్దు తర్వాత.. ఇచ్చింది రూ.4.27 లక్షల కోట్లు!

నోట్ల రద్దు తర్వాత.. ఇచ్చింది రూ.4.27 లక్షల కోట్లు!
09-12-2016 03:48:45
వెనక్కి వచ్చింది రూ.11.85 లక్షల కోట్లు
ముంబై, డిసెంబరు 8: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు రూ.4.27 లక్షల కోట్లను జారీ చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. నవంబరు 10వ తేదీ నుంచి ఈ మొత్తాన్ని ప్రజలకు అందజేసినట్లు తెలిపింది. అదే సమయంలో రూ.11.85 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లను ప్రజలు బ్యాంకుల్లో జమ చేశారని పేర్కొంది. త్వరలో మహాత్మా గాంధీ సిరీ్‌స్‌తో కొత్త రూ.500 నోట్లను విడుదల చేస్తామని తెలిపింది. ఈ నెల 15వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున రూ.500 నోట్లు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

డిజిటల్‌ డిస్కౌంట్స్‌

డిజిటల్‌ డిస్కౌంట్స్‌
09-12-2016 01:50:54

 నగదురహిత చెల్లింపులకు కేంద్రం ప్రోత్సాహకాలు

2000 వరకూ సేవాపన్ను లేదు.. పెట్రోలు, డీజిల్‌ కొనుగోలుపై 0.75 శాతం రాయితీ
సబర్బన్‌ రైల్వేల్లో సీజనల్‌ టికెట్లపై 0.5% డిస్కౌంట్‌.. రైల్వే కేటరింగ్‌ సేవలకూ అది వర్తింపు
ప్రభుత్వ బీమా కంపెనీ చెల్లింపులకు 10, 8% రాయితీ.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదార్లకు రూపేలు
టోల్‌ప్లాజాల్లో ఆర్‌ఎ్‌ఫఐడీ, ఫాస్ట్‌ కార్డులతో టాక్స్‌ చెల్లిస్తే 10 శాతం మినహాయింపు
ఆన్‌లైన్లో రైల్వే టికెట్‌ కొంటే 10 లక్షల బీమా.. ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలకు చార్జీలుండవు
10 వేల మంది ఉన్న ఊర్లకు 2 పీవోఎస్‌లు.. దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలు ఎంపిక

న్యూఢిల్లీ, డిసెంబరు 8: దేశవ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించడానికి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించింది. నగదు రహిత లావాదేవీలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం ఢిల్లీలో డిస్కౌంట్లను వెల్లడించారు. ‘‘ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి నేటికి సరిగ్గా నెల. నగదు లావాదేవీల కట్టడికి శక్తివంచన లేకుండా కృషి చేశాం. ఆర్బీఐ కూడా షెడ్యూలు మేరకే నగదు విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు లక్ష్యంగా డిజిటల్‌ లావాదేవీల దిశగా కదులుతోంది’’ అని స్పష్టం చేశారు.

జైట్లీ ప్రకటించిన 11 ప్రోత్సాహకాలు
నగదు రహితంగా కొనుక్కుంటే పెట్రోలు, డీజిల్‌ మరింత చవక అవుతాయి. నగదు రహితంగా చెల్లింపులు చేసే వారికి మొత్తం కొనుగోలుపై 0.75 శాతం రాయితీ ఇస్తారు.
కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న రైతులందరికీ నాబార్డు రూపే కార్డులను అందజేస్తుంది.
సబర్బన్‌ రైల్వే నెట్‌వర్కుల్లో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా నెలవారీ సీజనల్‌ టికెట్లు కొనుక్కునే వారికి 0.5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.
ఈ ఆఫర్‌ను తొలుత ముంబై సబర్బన్‌ రైల్వే నుంచి శ్రీకారం చుడతారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
డిజిటల్‌ పద్ధతిలో రైల్వే టికెట్లను కొనుక్కునే వారికి రూ.10 లక్షల బీమా కల్పిస్తారు.
రైల్వేల్లో కేటరింగ్‌, విశ్రాంతి గదులు వంటి వాటికి నగదు రహితంగా చెల్లింపులు చేసే వారికి అదనంగా 5ు రాయితీ ఇస్తారు.
10 వేల జనాభా కలిగిన గ్రామాలకు రెండు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మిషన్లను అందిస్తారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలను ఎంపిక చేస్తారు.
అన్ని జాతీయ రహదారుల్లోని టోల్‌ ప్లాజాల వద్దా నగదు రహిత చెల్లింపులతో ఆర్‌ఎఫ్ ఐడీ, ఫాస్ట్‌ కార్డులను తీసుకునే వారికి 10 శాతం రాయితీ ఇస్తారు.
డెబిట్‌, క్రెడిట్‌ వంటి కార్డులను ఉపయోగించి చేసే కొనుగోళ్లకు సంబంధించి 2000 వరకూ లావాదేవీలపై సర్వీస్‌ టాక్సును వసూలు చేయరు. ఈ మేరకు 2012 జూన్‌లో జారీ చేసిన సర్వీస్‌ టాక్స్‌ నోటిఫికేషన్‌కు సవరణలు చేపడతారు.
ప్రభుత్వ రంగ బీమా కంపెనీల వెబ్‌సైట్ల నుంచి సాధారణ, జీవిత బీమా కొత్త పాలసీలు కొనుక్కున్నా, బీమా ప్రీమియం చెల్లించినా ప్రీమియం మీద వరుసగా 10 శాతం, 8 శాతం రాయితీలు వర్తిస్తాయి.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో నగదు రహితంగా ప్రజలు చేసే లావాదేవీలకు ట్రాన్సాక్షన్‌ చార్జీలు, ఎండీఆర్‌ చార్జీలు ఉండవు.
రైళ్లు, బస్సుల్లో పాత 500 చెల్లేది రేపటి వరకే!

పాత రూ.500 నోట్లతో రైలు టికెట్లు, బస్సు టికెట్లు, మెట్రో రైలు టికెట్లు కొనే అవకాశం శనివారం వరకే పరిమితం చేశారు. 10వ తేదీ తర్వాత ఇక ఈ నోట్లతో టికెట్లు కొనడం కుదరదు. ఇంకా పాత నోట్లు ఉన్నవారు ఈనెల 30వ తేదీ వరకూ వారి వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు.

Saturday, 3 December 2016

I am a Fakir- MODI

నేను ఫకీర్‌ను
04-12-2016 00:57:55

మూటాముల్లె సర్దుకుని పోగలను
నన్ను ఎవరూ ఏమీ చేయలేరు
నల్ల దొంగలు హాని తలపెట్టలేరు
అవినీతిపై పోరాడడమే నేరమా?
ప్రజలే నాకు హైకమాండ్‌: మోదీ
డబ్బు జపం చేసిన వాళ్ల భరతం పడతా
నిజాయతీపరులు బ్యాంకుల ముందు
అవినీతిపరులు ‘జన్‌ధను’ల ఇళ్ల ముందు
భారతదేశంలో ఇక ఇవే చివరి క్యూలు!
60 ఏళ్లుగా ఉన్న క్యూలకు స్వస్తి పలుకుతా
క్యూల్లో నుంచుంటే నాకు మద్దతు ఇచ్చినట్లే
వారి కష్టాన్ని ఏ మాత్రం వృథా పోనివ్వను
నా చర్యలను ప్రజలు చివరికి గుర్తిస్తారు
దోచుకున్నోళ్లను జవాబుదారీ చేస్తే తప్పా?
నల్ల డబ్బు బయటకు తేవడమే లక్ష్యం కాదు
మళ్లీ అవినీతి జరగనివ్వకపోవడమే ధ్యేయం
దానికి తలుపులు మూయడమే సంకల్పం
బిచ్చగాళ్లూ స్వైపింగ్‌ మిషిన్‌ వాడుతున్నారు
భారతీయులు ఏదైనా నేర్చుకోగలరు: మోదీ
మీ ఖాతాల్లో డబ్బులు వేస్తే వెనక్కి ఇవ్వకండి
మిమ్మల్ని బెదిరిస్తే మోదీకి చెబుతానని చెప్పండి
జనధన్‌ ఖాతాదారులకు ప్రధానమంత్రి పిలుపు

మొరాదాబాద్‌, డిసెంబరు 3: ‘‘పంచదార కొనుక్కోవడానికి మనం క్యూలో నిలబడాలి. కిరోసిన్‌ కొనుక్కోవడానికి మనం లైన్లో నిలబడాలి. గోధుమలు కొనుక్కోవడానికి మనం క్యూలో నిలబడాలి. 60 ఏళ్లుగా మనల్ని పరిపాలించిన వాళ్ల నిర్వాకమిది. ఈ దేశంలో సమయమంతా క్యూల్లోనే వృథా అయిపోతోంది. ఇప్పుడు నేను మొదలు పెట్టిన క్యూ ఎందుకో తెలుసా!? మొత్తం అన్ని క్యూలకూ స్వస్తి పలకడానికే’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్యాంకుల ముందు మీరు క్యూలో నిలబడి ఉంటే.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తే.. మీ కష్టాన్ని నేను వృథా పోనివ్వనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిజాయతీగా తీసుకుంటున్న చర్యలను చివరకు సామాన్య ప్రజలు గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. ‘‘నా దేశంలో నాపైనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు దేశాన్ని దోచుకున్న వారిని ఇప్పుడు నేను జవాబుదారీగా చేయడం తప్పా!?’’ అని మోదీ ప్రశ్నించారు. కుప్పలు కుప్పలుగా దాచిన నల్లడబ్బును బయటకు తీసుకు రావడానికి మాత్రమే ప్రస్తుత కార్యక్రమాన్ని చేపట్టలేదని, అటువంటి వ్యవహారాలు మళ్లీమళ్లీ జరగకుండా నిరోధించడమే కాకుండా వాటికి తలుపులను పూర్తిగా మూసివేయాలనే భారీ వ్యూహం ఇందులో ఉందని వెల్లడించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బీజేపీ శనివారం నిర్వహించిన పరివర్తన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు డబ్బుల కోసం ఏటీఎంలు, బ్యాంకుల ఎదుట పెద్ద పెద్ద క్యూల్లో నిలబడుతున్న సంగతి తెలిసిందే. క్యూల్లో ఉంటున్నా డబ్బులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పరివర్తన ర్యాలీలో మాట్లాడిన మోదీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతర ఇబ్బందులపైనే తన ప్రసంగాన్ని కేంద్రీకరించారు. ‘‘అవినీతి కారణంగా ఈ దేశం ముందుకు వెళ్లకుండా ఆగిపోవాలా!? ఈ అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదా!? అవినీతి దానంతట అదే పోవాలా!? చురుగ్గా పాల్పంచుకుని మనం దానిని నిర్మూలించలేమా!?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. నిజాయతీపరులు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిలబడుతుంటే... అవినీతిపరులు నిరుపేదల ఇళ్ల ముందు నిలుచున్నారని చెప్పారు.

డబ్బు జపం చేసిన వాళ్ల భరతం పడతా
జన్‌ధన్‌ ఖాతాలను ప్రారంభించినప్పుడు ప్రజలకు వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో కూడా తెలియదని, కానీ, ఇప్పుడు వాళ్లంతా ఖాతాలను ఉపయోగించుకుంటున్నారా లేదా అని మోదీ ప్రశ్నించారు. ‘‘గతంలో ఎప్పుడూ ముఖం కూడా చూడని నల్ల దొంగలంతా ఇప్పుడు నిరుపేదల వెంట పరుగులు పెడుతున్నారు. మీ ఖాతాల్లో రెండు లక్షలు డిపాజిట్‌ చేసుకోవాలని బతిమలాడతారు. జనవరి తర్వాత తీసుకుంటామని కోరతారు. నా మాట వినండి. ఒకవేళ, మీరు ఇలా మీ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్‌ చేశారనుకోండి. వాటిని మళ్లీ తిరిగి ఇవ్వకండి. దానిని మీ ఖాతాలోనే ఉంచేయండి. ఒకవేళ వాళ్లు వచ్చి మా డబ్బు మాకు ఇవ్వాలని మిమ్మల్ని బెదిరించారనుకోండి.. మోదీకి ఉత్తరం రాస్తానని స్పష్టం చేయండి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కొంతమంది ముఖంలో కళ తప్పింది. ఇప్పటి వరకూ ‘డబ్బు డబ్బు’ అని పాకులాడిన వాళ్లు ఇప్పుడు ‘మోదీ, మోదీ’ అంటున్నారు. గతంలో డబ్బు జపం చేసిన వాళ్ల భరతం నేను పడతాను’’ అని ప్రధాని స్పష్టం చేశారు. జన్‌ధన్‌ ఖాతాలను దుర్వినియోగం చేసి డబ్బులు వేసిన వారిని జైలుఊచలు లెక్కబెట్టించే మార్గాలు అన్వేషిస్తున్నానన్నారు. నిరుపేదల ఖాతాల్లో వేసిన సొమ్ములను వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.

ముష్టివాళ్లు కూడా స్వైపింగ్‌ చేస్తున్నారు
ప్రస్తుతం వాట్స్‌పలో ఒక వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలు, పక్కనే ఓ అబ్బాయి బస్టాండ్లో నుంచుంటారు. అక్కడికి ఓ ముష్టివాడు వస్తాడు. ఆ అబ్బాయిని డబ్బులు అడుగుతాడు. ఆ కుర్రాడు తన దగ్గర డబ్బులు లేవని, కార్డులే ఉన్నాయని చూపుతాడు. దాంతో, ఒక్క నిమిషం ఆగమన్న ముష్టివాడు.. స్వైపింగ్‌ మిషన్‌ తీస్తాడు. ఈ వీడియోను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆ వీడియో నిజమో అబద్ధమో తనకు తెలియదని, నిజమైతే, ముష్టివాళ్లు కూడా స్వైపింగ్‌ మిషన్లు ఉపయోగిస్తున్నారని, అంతా డిజిటల్‌ లావాదేవీలకు మళ్లాలని పిలుపునిచ్చారు. సరైన చర్య అని భావిస్తే భారతీయులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎంతో సమయం తీసుకోరని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన డబ్బులను అభివృద్ధి, మౌలిక సదుపాయాలకే ఖర్చు చేస్తామన్నారు. ‘‘దేశంలో 40కోట్ల స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా మొబైల్‌, నెట్‌ బ్యాంకింగ్‌లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. మీరు చేయాల్సింది మీ ఫోన్లోకి ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. దాంతో, 40 కోట్ల మంది బ్యాంకులకు వెళ్లకుండానే, క్యూల్లో నుంచోకుండానే తమ పనులన్నీ సాధించుకోవచ్చునని తెలిపారు.

అవినీతిపై పోరాడడమే నేరమా?
‘‘నల్ల దొంగలు నాకు హాని తలపెట్టలేరు. నేను పకీర్‌ను (సర్వసంగ పరిత్యాగిని). నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మూటా ముల్లె సర్దుకుని ప్రధాని కార్యాలయం నుంచి వెళ్లిపోగలను. దేశం కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దీనిని ఆపేది లేదు. ఏం నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడకూడదా!? అవినీతిపై పోరాటం నేరమా!? అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే నేను తప్పు చేస్తున్నానని కొంతమంది ఎందుకు అంటున్నారు? నా దేశంలోనే కొంతమంది నాపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం నల్ల డబ్బు ఉన్న వాళ్లు మాత్రమే ఇప్పుడు నన్ను తప్పుబడుతున్నారు. ఒకప్పుడు దేశాన్ని దోచుకున్న వాళ్లను ఇప్పుడు నేను జవాబుదారీ చేయడం తప్పా?’’ అని ప్రధాని మోదీ నిలదీశారు. ప్రజలే తనకు అధిష్ఠానమని, వారే తన నాయకత్వమని అన్నారు. భారతదేశం మార్పునకు సిద్ధంగా ఉందని, దేశం, ప్రజలు కూడా మార్పులకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని, తనకు 50 రోజుల సమయం ఇవ్వాలని మోదీ వ్యాఖ్యానించారు. డిజిటల్‌ లావాదేవీలపై ప్రజలకు కొంతమంది అవగాహన కల్పిస్తున్నారని, ఇప్పుడు మీ ఫోనే మీ బ్యాంకు అని తెలిపారు. అవినీతి దానంతట అదే వెళ్లిపోదని, దానిని మనం తుడిచిపెట్టేయాలని చెప్పారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే పెద్ద రాష్ట్రాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి అని తెలిపారు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలపై దృష్టి సారించాలని, అవి విస్తీర్ణంలో పెద్దవనే కాదు.. అక్కడ పెద్దఎత్తున ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు.

Huge Deposits in Banks During September

నోట్ల రద్దుకు ముందే బ్యాంకు ఖాతాల్లోకి వేల కోట్లు: అభిషేక్‌
04-12-2016 02:17:23

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పెద్ద నోట్ల రద్దు విషయం ప్రధాని మోదీ ఆకస్మికంగా ప్రకటిస్తే.. అంతకు ముందే దేశంలోని అనేక బ్యాంకుల్లో అనూహ్యమైన డిపాజిట్లు ఎలా వచ్చిపడ్డాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ ప్రశ్నించారు. ఈ అకౌంట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం గాంధీభవన్‌రలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారమే గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో బ్యాంకులో డిపాజిట్లు రూ. 5.88 లక్షల కోట్లు అధికంగా ఉన్నాయని చెప్పారు.

అనూహ్యంగా పెరిగిన డిపాజిట్లు చూస్తే అనుమానం కలుగుతోందని, అందుకే కాంగ్రెస్‌ దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని 14.5 లక్షల కోట్ల నల్లధనం బయటకు వస్తోందని నరేంద్ర మోదీ భావించారనీ, అయితే ఇప్పటికే దేశంలో సుమారు పది లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయనీ, మరో 27 రోజుల గడువు ఉన్నందున మిగిలి సొమ్ము కూడా దాదాపుగా డిపాజిట్‌ అయ్యే పరిస్థితి ఉందన్నారు. అలాంటపుడు పెద్ద నోట్ల రద్దుతో మోదీ సాధించేందేమిటని ప్రశ్నించారు. మోదీ తీసుకున్న తుగ్లక్‌ నిర్ణయంతో ఈ రోజు సామాన్యుడు విలవిలలాడుతున్నారనీ, భవిష్యత్తులో ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చన్నారు. ప్రధాని మోదీ తొందరపడి నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోందనీ, ఆయన గడచిన 28 రోజుల్లో తన నిర్ణయాలను 105 సార్లు మార్చుకున్నారని విమర్శించారు. క్యాష్‌ లెస్‌ లావాదేవీలు చేస్తానన్న మోదీ దేశాన్ని జాబ్‌లెస్‌గా మారుస్తున్నారన్నారు.

Foster and Partners are the Key Con structures of Amaravati

అమరావతి బాధ్యత ‘ఫోస్టర్‌’కి!
04-12-2016 01:23:28

మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక
రెండు మూడు రోజుల్లో ప్రకటన
డిజిటల్‌దే భవిష్యత్తు
ప్రతి గ్రామం నగదురహితం
మార్పుకి అలవాటుపడాలి: బాబు
 కొలిక్కి వచ్చిన పరిశీలన
 సీఎం ఆమోదమే తరువాయి
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణ రూపశిల్పి ఎంపిక కొలిక్కి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్‌ సంస్థ ‘ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌’ని అమరావతి నగర నిర్మాణానికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. అమరావతికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు ఏపీసీఆర్డీయే ప్రపంచస్థాయి పోటీ నిర్వహించింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మూడు ఆర్కిటెక్చరల్‌ సంస్థలు.. ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌, స్పేస్‌ గ్రూప్‌, జీఎంపీ ఇంటర్నేషనల్‌ సంస్థలు పాల్గొని డిజైన్లు సమర్పించాయి. వీటిని పరిశీలించిన నిపుణులు, సీఆర్డీయే అధికారులు.. ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ అందజేసిన ప్రతిపాదనలకే మొగ్గుచూపారు. అయితే ఈ సంస్థను ఎంపిక చేసిన విషయాన్ని ప్రకటించేందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు, మున్సిపల్‌ మంత్రి నారాయణ.. ఫోస్టర్‌ అందించిన ప్రతిపాదనలను పరిశీలించి తుది ఆమోదం తెలపాల్సి ఉంది. వారు ఆమోదముద్ర వేసిన తర్వాతే మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపికపై ప్రకటన వెలువడుతుందని, దీనికి రెండుమూడు రోజులు పట్టవచ్చని సమాచారం. అమరావతి నగర మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపికయ్యే సంస్థ.. అమరావతిలోని 1350 ఎకరాల్లో సుమారు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్లనే కాకుండా అర్బన మాస్టర్‌ప్లాన, గైడ్‌లైన్లను రూపొందించడంతోపాటు అందులోని ఐకానిక్‌ బిల్డింగ్స్‌ (అసెంబ్లీ, హైకోర్టు)కు రూపకల్పన చేయాల్సి ఉంటుంది.

శ్రీధర్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటన
మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక విషయాన్ని చర్చించేందుకు సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ శనివారం చివరి నిమిషంలో సీఎంతోపాటు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. న్యూఢిల్లీలో జరిగే సదస్సులో పాల్గొనేందుకు శనివారం సీఎం బయలుదేరి వెళ్లారు. ఆఖరి నిమిషంలో.. సీఎం ఆదేశాలతో శ్రీధర్‌ కూడా ఆయనతోపాటు ఢిల్లీ బయలుదేరారు. ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ ప్రతిపాదనల గురించి సీఎంకు వివరించేందుకే శ్రీధర్‌ ఆయనతోపాటు వెళ్లినట్లు సమాచారం.

గత అనుభవం పునరావృతమవ్వరాదనే..
అమరావతి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపికైన సంస్థ పేరును డిసెంబర్‌ 2న ప్రకటించాలని భావించారు. అయితే, ఈ ఏడాది ప్రథమార్ధంలో మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక కోసం తొలిసారిగా జరిపిన పోటీలో జపానకు చెందిన మాకీ అసోసియేట్స్‌ను విజేతగా ప్రకటించారు. అయితే, మాకీ రూపొందించిన డిజైన్లపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మాకీకి బాధ్యతలు అప్పగించలేదు. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం ఈసారైనా అందరి ఆమోదం తీసుకొని మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపికను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పకడ్బందీగా కసరత్తు చేసిన తర్వాతే ప్రకటన చేయాలని నిర్ణయించారు.

ప్రపంచస్థాయి డిజైన్లలో మాస్టర్‌.. ఫోస్టర్‌
బ్రిటన రాజధాని లండన ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ‘ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌’కు ఆర్కిటెక్చరల్‌ రంగంలో నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. గత 40 ఏళ్లలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు పేరెన్నికగన్న నిర్మాణాలకు డిజైన్టను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలను కలిగి ఉన్న ఈ సంస్థ.. ఆకర్షణీయ కట్టడాలకు డిజైన్లను రూపొందించింది. అర్బన మాస్టర్‌ ప్లాన్లు, పబ్లిక్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌, విమానాశ్రయాలు, సివిక్‌ అండ్‌ కల్చరల్‌ బిల్డింగ్స్‌, కార్యాలయాలు, వర్క్‌స్పే్‌సలు, ప్రైవేట్‌ గృహాలు, కన్వెన్షన సెంటర్లు వంటి పలు రకాల నిర్మాణాలను రూపకల్పన చేసిన ఘనత దీని సొంతం. జర్మనీలో డ్యూస్‌బర్గ్‌ నగర మాస్టర్‌ప్లాన్‌ను ఈ సంస్థే రూపొందించింది. ఇటలీలోని ఫ్లోరెన్స్‌ టీఏవీ స్టేషన్‌కు అద్భుతమైన డిజైన్‌ను అందించిన ఘతన ఈ సంస్థ సొంతం. కజకిస్థాన్‌లోని ప్యాలెస్‌ ఆఫ్‌ పీస్‌ అండ్‌ రీకన్సిలియేషన భవనానికి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఇండెక్స్‌ టవర్‌కు డిజైన్లు అందించింది ఈ సంస్థే.