Wednesday 4 March 2015

ఖరీదైన నగరాల్లో సింగపూర్‌ టాప్‌

ఖరీదైన నగరాల్లో సింగపూర్‌ టాప్‌

లండన్‌, మార్చి 3: భారత ఐటీ పరిశ్రమ కూడలి బెంగళూరు ప్రపంచంలో అత్యంత ‘చవకైన’ నగరంగా ఎంపికైంది. వివిధ దేశాల్లోని 133 నగరాల్లో జీవన వ్యయం ఆధారంగా రూపొందిన ఈ జాబితాలో బెంగళూరు సరసన పాకిస్థాన్‌ వాణిజ్య రాజధాని కరాచీ కూడా చేరింది. భారత వాణిజ్య రాజధాని ముంబై, చెన్నై, న్యూఢిల్లీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌ నగరం ప్రాతిపదికగా ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) వార్షిక అధ్య యనం నిర్వహించింది. దాని ఆధారంగా ‘‘విశ్వవ్యాప్త జీవన వ్యయ నివేదిక-2015’’ను తయారుచేసింది. మొత్తంమీద భారత ఉపఖండంలో మూల్యానికి తగిన విలువ లభిస్తుందని తేల్చింది. ఇక అత్యంత ఖరీదైన నగరాల్లో నిరుటిలాగానే సింగపూర్‌ అగ్రస్థానంలో ప్యారిస్‌, ఓస్లో, జూరిచ్‌, సిడ్నీ తర్వాతి స్థానాల్లో కొనసాగాయి. ఇక జెనీవా, కోపెన్‌హాగెన్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌, హెల్సింకీ నగరాలతో టాప్‌-10 జాబితా పూర్తయిందని ఈఐయూ నివేదిక సంపాదకుడు జాన్‌ కోప్‌స్టేక్‌ తెలిపారు.

No comments:

Post a Comment