Thursday 12 March 2015

AP Budget - 2015


రాజధాని నిర్మాణానికి 158 యేళ్ళు??

A. "రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్ల రూపాయలు కావాలి" - చంద్రబాబు.
B. 2015-16 బడ్జెట్లో  రాజధాని నిర్మాణానికి కేటాయింపులు 3168 కోట్లు.
C. రాజధాని నిర్మాణానికి పట్టే సంవత్సరాలు B ? A = 157.82.

ఆంధ్రప్రదేశ్ లో మతఅల్పసంఖ్యాక వర్గాలు 0.335 శాతం????

A. బడ్జెట్‍ మొత్తం 113049 కోట్ల రూపాయలు.
B. మైనారిటీల సంక్షేమానికి కేటాయింపులు 379 కోట్ల రూపాయలు.
C. కేటాయింపు శాతం B X 100 / A = 0.335


ఏపీ అసెంబ్లీ: బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆర్థికమంత్రి యనమల

రూ.1,13, 049 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల

శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి నారాయణ

బడ్జెట్ ప్రారంభంలో డా.అంబేద్కర్ వ్యాఖ్యల్ని చదివిన యనమల

ప్రస్తుత ఏపీ ప్రజల తలసరి ఆదాయం రూ.81,397

ప్రణాళికేతర వ్యయం రూ.78,637 కోట్లు

ప్రణాళికా వ్యయం రూ.34,412 కోట్లు

రెవెన్యూ లోటు రూ.7,300 కోట్లు, ఆర్థికలోటు రూ.17,584 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు రూ.5,728 కోట్లు కేటాయింపు

వైద్య, ఆరోగ్యానికి 3.92 నుంచి 5.07శాతానికి పెంపు

పాఠశాల విద్యకు రూ.14,962 కోట్లు

పాఠశాల విద్య వాటా 11.26 నుంచి 13.24కు పెంపు

ఇంటర్మీడియట్ విద్య రూ.585 కోట్లు

ఉన్నత విద్యకు రూ.3,049 కోట్లు

గ్రామీణాభివృద్ధికి రూ.8,212 కోట్లు

పంచాయితీరాజ్ శాఖకు రూ.3,296 కోట్లు

గ్రామీణ నీటి సరఫరాకు రూ.881 కోట్లు

నూతన రాజధానికి రూ.3,168 కోట్లు

33,252 ఎకరాల్లో ఏపీ నూతన రాజధాని నిర్మాణం

87శాతం మంది భూ సేకరణకు అంగీకరించారు

25 శాతం భూమిని అభివృద్ధి చేసి రైతులకే ప్లాట్లుగా ఇస్తాం

7వేల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది - యనమల

రోడ్లు, భవనాలకు రూ.2,960 కోట్లు

మౌలిక సదుపాయాలకు రూ.195 కోట్లు

ఇంధన శాఖకు రూ.4,360 కోట్లు

పర్యాటక, సాంస్కృతిక రంగాలకు రూ.330 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.637 కోట్లు

నైపుణ్యాల పెంపునకు రూ.360 కోట్లు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రూ.370 కోట్లు

యువజన సేవలు, క్రీడలకు రూ.45 కోట్లు

కార్మిక, ఉపాధి శాఖకు రూ.281 కోట్లు

పౌరసరఫరాలకు రూ.2,459 కోట్లు

గృహ నిర్మాణానికి రూ.897 కోట్లు

చేనేత, జౌళి శాఖకు రూ.46 కోట్లు

వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.45 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1,080 కోట్లు

మైనార్టీల సంక్షేమానికి రూ.379 కోట్లు

వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.3,231 కోట్లు

గిరిజన సంక్షేమానికి రూ.993 కోట్లు

సాంఘిక సంక్షేమానికి రూ.2,123 కోట్లు

కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.35 కోట్లు

సాగునీటి రంగానికి రూ.5,258 కోట్లు

విపత్తుల నిర్వహణకు రూ.488 కోట్లు

రవాణాకు రూ.122 కోట్లు కేటాయింపు

గనులు భూగర్భశాఖకు రూ.27 కోట్లు

శాంతి భద్రతలకు రూ.4,062 కోట్లు

రెవెన్యూకి రూ.1,429 కోట్లు, ఐటీకి రూ.370 కోట్లు

విజయవాడ, విశాఖ మెట్రో రైల్ కోసం రూ.300కోట్లు

గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు

దేవాదాయ శాఖకు రూ.100 కోట్లు కేటాయింపు

విద్యుత్ శాఖకు రూ.4,360కోట్లు కేటాయింపు

2018-19 నాటికి ఏపీ తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది

విజన్ 2029 లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం-యనమల

2029 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది

2050 నాటికి ప్రపంచంలోనే పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ఏపీ

అభివృద్ధికి 40 కీలక రంగాలను గుర్తించాం-యనమల

సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ స్థాపన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం

వైద్య ఆరోగ్య రంగానికి 3.29 శాతం నుంచి 5.07 శాతానికి పెంపు

షెడ్యూల్ కులాల కోసం ఎన్టీఆర్ విద్యోన్నత పథకం

గిరిజన యువతులకు వివాహానికి రూ.50 వేలు అందిస్తాం

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 3 లేదా 4ఏళ్లు పడుతుంది

గోదావరి జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేస్తాం

7 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం-యనమల

విశాఖకు గోదావరి నుంచి 23.44 టీఎంసీల నీరు అందిస్తాం

960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యం-యనమల

2015-16 సంవత్సరంలో 2.7 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తాం

షెడ్యూల్ తెగలకు ఇంటికి రూ.1.50 లక్షలు సాయం-యనమల

విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి

గుంటూరు-నాగార్జునసాగర్, ప్రకాశం-దొనకొండకు నోఫ్రిల్స్ విమానాశ్రయం

కుప్పం, నెల్లూరు-దగదర్తి, కర్నూలు-ఓర్వకల్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదన

కాకినాడలో వాణిజ్య రేవుకు, ఠాగూర్ సంస్కృతి సముదాయానికి ప్రతిపాదన

ఏపీలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది-యనమల

రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి

వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం

ఆర్థిక పరిస్థితులు బాగోలేకున్నా రుణమాఫీ చేస్తున్నాం

తమిళనాడు తరహాలో ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తా-యనమల

No comments:

Post a Comment