|
ఆజంఖాన్, బుఖారీ, ముషరఫ్,
గిలానీ హిందూమతంలోకి రావాలి: సాధ్వీ ప్రాంచి బదౌనీ, ఫిబ్రవరి 2: బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రాంచి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలను ప్రధాని ఆదేశించినా సాధ్వీ మాత్రం మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనేమీ 40 మందిని కనమనడం లేదు. నలుగురు పిల్లల్ని కనమంటున్నా. కుటుంబ నియంత్రణ కేవలం హిందూ మతాల వారికే ఎందుకు? ఇప్పుడు ఒక్కరు చాలు అంటున్నారు. ఒక్కరినే కంటే వారిని ఎక్కడికి పంపుతాం? అందుకే నలుగుర్ని కనండి. ఒకరిని సైన్యంలోకి పంపండి. మరొకర్ని సమాజ సేవకు పంపండి. దేశ సేవ, సంస్కృతి రక్షణ కోసం మిగిలిన ఇద్దర్ని సాధువులకు, వీహెచ్‌పీకి అప్పగించండి.’’ అని ఆమె చెప్పారు. నలుగురి కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కన్న వారిని సన్మానించడానికి వీహెచ్‌పీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బదౌనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను లవ్ జిహాద్‌కే తప్ప ప్రేమకు తాను వ్యతిరేకిని కాదని అన్నారు. ‘‘లవ్ జిహాద్ పేరుతో ముస్లింలు మన అమ్మాల్ని ట్రాప్ చేస్తున్నారు. 35-40 మంది పిల్లల్ని కంటున్న వీరు... లవ్ జిహాద్‌ను వ్యాప్తి చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. 1400 ఏళ్ల క్రితం అందరూ హిందువులేనని, యూపీ పట్టణాభివృద్ధి మంత్రి ఆజంఖాన్, జమా మసీద్ ఇమామ్ బుఖారీ, పాక్ మాజీ అధ్యక్షుడు ముషరఫ్, గిలానీ కూడా తిరిగి హిందూ మతంలోకి రావాల్సిందేనని ఆమె అన్నారు. |
No comments:
Post a Comment