Monday, 8 February 2016

బుద్వేల్‌లో జర్నలిస్టులకు నివాస గృహాలు

బుద్వేల్‌లో జర్నలిస్టులకు టవర్స్..


http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/journalists-towers-in-budvel-1-2-502419.html
Published: Tue,February 9, 2016 01:45 AM
   Increase Font Size Reset Font Size decrease Font size  
press
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ గ్రామ పరిధిలోని వంద ఎకరాల స్థలంలో నివాసగృహాల సముదాయం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నగరంలో పనిచేస్తున్న అన్ని రకాల జర్నలిస్టులకూ గృహాలు సమకూరేలా బహుళ అంతస్తుల టవర్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మొదటి విడతలో ఇండ్లు కడతామని, ఇతర ప్రాంతాల్లోని జర్నలిస్టులకూ త్వరలోనే ఇండ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. 
-వంద ఎకరాల్లో నివాసగృహాల సముదాయ నిర్మాణం
-జర్నలిస్టుల సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్
-బుద్వేల్ స్థలాన్ని ప్రభుత్వానికి బదలాయించాలని అధికారులకు ఆదేశాలు
-జిల్లా జర్నలిస్టుల విషయంలో మంత్రులు, కలెక్టర్లకు సూచనలు
-పార్ట్‌టైం రిపోర్టర్లందరికీ డబుల్‌బెడ్‌రూం పథకంలో గృహాలు

జిల్లా కేంద్రంలోనూ పాత్రికేయులకు ఇండ్లు కట్టించే విషయంలో మంత్రులు, కలెక్టర్లకు సూచనలు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్ట్‌టైమ్ రిపోర్టర్లందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో భాగంగా గృహాలు కట్టిస్తామని తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో జర్నలిస్టు సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సూచనల మేరకు నగరంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి వచ్చిన జర్నలిస్టు నాయకులు బుద్వేల్ ప్రాంతంలోని స్థలం ఇండ్ల నిర్మాణానికి, రవాణా సదుపాయాలకు అనువుగా ఉందని నిర్ణయించారు. వారి అభీష్టం మేరకు బుద్వేల్‌లోనే ఇండ్ల నిర్మాణం చేపడతామని సీఎం ప్రకటించారు. 

బుద్వేల్‌లోని స్థలం ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలో ఉందని, దానిని తిరిగి ప్రభుత్వానికి బదలాయించాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎస్పీ సింగ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ అనితా రామచంద్రన్‌ను సీఎం ఆదేశించారు. పాత్రికేయుల ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సమన్వయం చేయాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు సూచించారు. జర్నలిస్టుల్లో ఎక్కువ మంది దిగువ, మధ్య తరగతికి చెందినవారేనని, వారికి సొంత ఇండ్లు కూడా లేవని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులందరికీ దశలవారీగా ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. మీడియాలో పనిచేసే అన్ని విభాగాల సిబ్బందికి ఇండ్లు ఇస్తామని, హౌసింగ్ టవర్లలో ఇతర పౌర సదుపాయాలు కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పాత్రికేయులంతా మెరుగైన జీవితం గడపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అమర్, పల్లె రవి, క్రాంతి, విరాహత్ ఆలీ, పీవీ శ్రీనివాస్, నాగేశ్వర్‌రావు, రమేశ్ హజారి, బుద్ధా మురళి, సతీశ్, శైలేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

బుద్వేల్‌లో జర్నలిస్టులకు నివాస గృహాలు

Sakshi | Updated: February 09, 2016 01:18 (IST)
బుద్వేల్‌లో జర్నలిస్టులకు నివాస గృహాలు
- వంద ఎకరాల్లో టవర్స్ నిర్మాణానికి నిర్ణయం
- గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలోని స్థలం ప్రభుత్వానికి బదలాయింపు
- పార్ట్‌టైం రిపోర్టర్లకూ డబుల్ బెడ్‌రూం ఇళ్లు
- జర్నలిస్టు సంఘాల నాయకులతో చర్చ


సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జర్నలిస్టుల కోసం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ పరిధిలో వంద ఎకరాల స్థలంలో నివాస గృహాల సముదాయాలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నగరంలో పనిచేసే అన్ని స్థాయిల జర్నలిస్టులకు గృహాలు సమకూరేలా బహుళ అంతస్తుల టవర్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు సంఘాల నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, శైలేష్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు.

 సీఎం సూచనల మేరకు నగరంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన జర్నలిస్టులు బుద్వేల్‌లోని భూములు ఇళ్ల నిర్మాణానికి, రవాణా సదుపాయాలకు అనువుగా ఉన్నాయని సీఎంకు వివరించారు. వారి అభీష్టం మేరకు బుద్వేల్‌లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. బుద్వేల్‌లోని ఈ స్థలం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలో ఉందని, దానిని ప్రభుత్వానికి బదలాయించాలని పంచాయితీరాజ్ కార్యదర్శి ఎస్‌పీ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. పాత్రికేయుల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుకు సూచించారు.

 దశలవారీగా ఇస్తాం: సీఎం
 జర్నలిస్టుల్లో ఎక్కువమంది దిగువ, మధ్య తరగతికి చెందిన వారేనని, వారికి సొంత ఇళ్లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ దశలవారీగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మీడియాలో పనిచేసే అన్ని విభాగాల జర్నలిస్టులకు నివాస గృహాలతో పాటు హౌజింగ్ టవర్లలో ఇతర పౌర సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులంతా మెరుగైన జీవితం గడపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మొదటి విడతలో, తరువాత ఇతర ప్రాంతాల జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లోని జర్నలిస్టులకు ఇళ్లు కట్టే విషయంలో మంత్రులు, కలెక్టర్లకు సూచనలు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్ట్‌టైం రిపోర్టర్లకూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంలో ఇళ్లు కట్టిస్తామని సీఎం చెప్పారు.

Wednesday, 3 February 2016

ప్రేమ జంటలు కనిపిస్తే చాలు... వారికి అదేపని...

ప్రేమ జంటలు కనిపిస్తే చాలు... వారికి అదేపని...
03-02-2016 00:59:09


http://www.andhrajyothy.com/Artical?SID=202624



  • కాపుకాసి ప్రేమ పక్షుల వేట
  • 4 నెలల్లో 20 మందిపై అత్యాచారం
  • విజయవాడ- గుంటూరు మధ్య యథేచ్ఛగా అరాచకాలు
  • నలుగురు సభ్యుల ముఠా అరెస్టు
గుంటూరు: ప్రేమ కబుర్లు చెప్పుకోవడానికి వచ్చే జంటలను టార్గెట్‌ చేస్తారు. వాళ్లు కబుర్లతో లోకం మరిచిన స్థితిలో.. కర్కశంగా కత్తి దూస్తారు. నిశ్చేష్టులై నిలబడిపోయిన వారిని నిలువు దోపిడీ చేసేస్తారు. అక్కడితో ఆగకుండా.. యువతులపై అమానుషంగా దాడిచేసి దారుణంగా చిదిమేస్తారు!.. నలుగురు సభ్యుల ఈ ముఠా.. నాలుగు నెలల్లో దాదాపు 20 మందిపై అత్యాచారం చేసినట్లు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు వెల్లడించారు. తాడేపల్లిలో ఒక ఇంట్లో చోరీ చేసి, యువతిపై అత్యాచారానికి ప్రయత్నించగా, ఆమె ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో 
భాగంగా.. వినోద్‌కుమార్‌, నాగరాజు దుర్గాప్రసాద్‌ మనోజ్‌ అనే నలుగురిని పోలీసులు ఇంటరాగేట్‌ చేశారు. వారు చెప్పిన విషయాలు పోలీసులనే నిశ్చేష్టులను చేస్తున్నాయి.
 
ఆదమరిస్తే.. అంతే 
విజయవాడ పరిధిలో నున్న-పాయకాపురం మధ్య 200 ఎకరాల్లో వేసిన వెంచర్‌లో చాలానే ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ప్రేమ జంటలు, వివాహేతర సంబంధంలో ఉన్నవారు తరచూ విజయవాడ నుంచి ఇక్కడకు వస్తుంటారు. ఇదే అదనుగా తాడేపల్లికి చెందిన దేవర వినోద్‌కుమార్‌, మేడా నాగరాజు, ఎర్రబడి దుర్గా ప్రసాద్‌, కొండ్రెడ్డి మనోజ్‌ విరుచుకుపడేవారు. కత్తులతో బెదిరించి.. జంటను లొంగదీసుకొంటారు. వారిని దూరంగా తీసుకెళ్లి.. తీవ్ర వేధింపులకు గురిచేస్తారు. వారి వద్ద ఉన్న వస్తువులను తీసేసుకొంటారు. ఆ జంటలోని యువతిపై సామూహిక అత్యాచారం జరుపుతారు. ఇలా 2014 డిసెంబర్‌ నుంచి గత మార్చి వరకు సుమారు 20 మందిపై అత్యాచారం జరిపారు. అయితే, పరువు సమస్యతో బాధితులు బయటకు రాలేదు. వీరి చేతుల్లో బలయిన ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు రంగంలోకి దిగేటప్పటికే ముఠా బిచాణా ఎత్తేసింది. అప్పటినుంచి విజయవాడ, గుంటూరులకు చెందిన ప్రత్యేక బలగాలు ఈ ముఠా కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ ముఠాను దుర్గాప్రసాద్‌ నడుపుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
 
ఇంటిపై దాడి చేస్తూ.. 
తాడేపల్లిలోని సీతానగర్‌లో గత నెల 22న అర్ధరాత్రి ఓ ఇంటిని ఈ ముఠా దోచుకొంది. ఇంటి యజమాని కుమార్తెపై అత్యాచార యత్నం చేసింది. ఆమె ప్రతిఘటించి కేకలు పెట్టటంతో వారు పరారయ్యారు. ఈ కేసులో గుంటూరు అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి ఆదేశాల మేరకు సీసీఎస్‌ అదనపు ఎస్పీ తిరుపాల్‌, సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, నార్త్‌ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో తాడేపల్లి పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా సీతానగర్‌ దోపిడీ..వారి పనేనని తేలింది. నిందితుల్లో.. వినోద్‌కుమార్‌, నాగరాజు 10వ తరగతి చదివారు. దుర్గాప్రసాద్‌ ఇంటర్‌, మనోజ్‌ డిప్లమో చేశారు. నలుగురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరిలో దుర్గా ప్రసాద్‌ పందుల పెంపకం వృత్తిలో ఉండగా, వినోద్‌, నాగరాజు, మనోజ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌.

తుని హింసాకాండలో నిందితులెవరో తెలిసిపోయింది... పక్కా స్కెచ్‌తో...

తుని హింసాకాండలో నిందితులెవరో తెలిసిపోయింది... పక్కా స్కెచ్‌తో...
03-02-2016 09:03:07

తుని : తుని కాపు గర్జన తదనంతరం జరిగిన పరిణామాలు పక్కా స్కెచ్‌తో కొంతమంది కుట్రదారులు చేసినవేనని ఏబీఎన్ ముందు నుంచీ చెబుతూనే ఉంది. ఇప్పుడు ఈ హింసాకాండకు పాల్పడిన కొంతమంది ఆగంతకుల చిత్రాలు ఏబీఎన్‌ సంపాదించింది. తుని హింసాత్మక ఘటనపై ఏబీఎన్‌కు  ఎక్స్‌క్లూజివ్‌ విజువల్స్‌ లభించాయి. ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని బోగీలపై దాడులు చేసినట్లు ఈ విజువల్స్ చూస్తే తెలుస్తోంది.
 
100 మంది ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని వచ్చినట్లు సమాచారం. రైళ్లు, పోలీస్‌స్టేషన్‌, వాహనాలకు కర్చీఫ్‌ గ్యాంగే నిప్పుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కర్చీఫ్‌ గ్యాంగ్‌ను రెండు వాహనాల్లో తరలించినట్లు సమాచారం. వాహనాల నంబర్లను పోలీసులు గుర్తించారు. వాహనాల నెంబర్ల  ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరి కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే ఉద్యమం

కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే ఉద్యమం 
03-02-2016 12:38:22

విజయవాడ : విజయవాడలో బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  25 సంఘాల నేతలు  హాజరయ్యారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని బీసీ సంఘాల నేతలు చెప్పారు. కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి లేదని, కాపుల ఒత్తిడికి తలొగ్గి జీవో ఇస్తే అభాసుపాలవుతారన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని బీసీ సంఘాల నేతలు వివరించారు.

మీడియాకు ముద్రగడ క్షమాపణలు

మీడియాకు ముద్రగడ క్షమాపణలు
03-02-2016 11:23:38

తూ.గో : తునిలో మీడియా ప్రతినిధులపై దాడి జరగడంపై ముద్రగడ పద్మనాభం మీడియాకు క్షమాపణలు చెప్పారు. బుధవారం తునికి చేరుకున్న ముద్రగడను మీడియా ప్రతినిధులు నిలదీశారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేయడమేంటని ముద్రగడను జర్నలిస్టులు ప్రశ్నించారు. దీంతో జర్నలిస్టులతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు. చివరకు ఆరోజు ఘటనపై మీడియాకు ముద్రగడ పద్మనాభం క్షమాపణలు తెలియజేశారు.

తుని హింసాకాండ కేసులో ఏ1గా ముద్రగడ... ఓ మీడియా సంస్థ అధినేతపైనా కేసు...

తుని హింసాకాండ కేసులో ఏ1గా ముద్రగడ... ఓ మీడియా సంస్థ అధినేతపైనా కేసు...
03-02-2016 11:07:07

తుని హింసాకాండపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 57 కేసులు నమోదు చేశారు. టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో 7, రైల్వే కేసులు మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అన్ని కేసుల్లో ముద్రగడ పద్మనాభాన్ని ఏ1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
 
తుని ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ అధినేత సుధాకర్‌నాయుడు, గర్జన స్థల యజయాని రాజా చినబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పల్లంరాజు, వట్టి వసంతకుమార్‌, సి.రామచంద్రయ్య, బొత్స, జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, స్థానిక నేతలు ఆకుల రామకృష్ణ, కామన ప్రభాకర్‌రావు, నల్లా విష్ణు తదితర నేతలపై కేసు నమోదు చేశారు. తుని ఘటన కేసును సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనకు సంబంధించిన వివరాలను సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు ఆరా తీశారు.

Tuesday, 2 February 2016

పట్టణ ధనికులకు 100 గజాలు ఉచితం!

పట్టణ ధనికులకు 100 గజాలు ఉచితం!

Sakshi | Updated: February 03, 2016 12:52 (IST)
పట్టణ ధనికులకు 100 గజాలు ఉచితం!
ఆక్రమణల క్రమబద్ధీకరణపై మంత్రుల కమిటీ నిర్ణయం
100 గజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరణకు యోచన
నిర్ధారించిన ధరకే ఇవ్వాలని గత కమిటీల సూచన
దానిని పక్కనబెట్టిన ప్రభుత్వం.. ఉచితంవైపే మొగ్గు


సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో అనధికారికంగా ఆక్రమించిన స్థలాలను క్రమబద్ధీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. పట్టణాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రమే 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీతో పాటు సీసీఎల్‌ఎ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. మిగతా వారందరికీ నిర్ధారించిన ధరకు క్రమబద్ధీకరించాలని సూచించాయి.

అయితే ఈ సిఫార్సు ప్రభుత్వ పెద్దకు ఏ మాత్రం నచ్చలేదు. ధనికులకు కూడా 100 చదరపు గజాల వరకు ఇళ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలనేది ఆయన లక్ష్యం. ఇందుకోసం అధికారుల కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి మంత్రులతో ఉప కమిటీ వేశారు. ఈ మంత్రుల కమిటీ పేద, ధనిక తేడా లేకుండా పట్టణాల్లో 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలంటూ సిఫార్సులు చేసింది.

గత ప్రభుత్వాలు బీపీఎల్ కుంటుంబాలకు మాత్రమే గ్రామాల్లో 100 చదరపు గజాలు, పట్టణాల్లో 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాయి. దారిద్య్ర రేఖకు ఎగువన (ఏపీఎల్) ఉండే కుటుంబాలకూ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామనడం చూస్తుంటే అసలు క్రమబద్ధీకరణ ధనికుల కోసమే అన్నట్లుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రుల కమిటీ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి.

గతంలో క్రమబద్ధీకరణకు కోర్టు బ్రేక్..
ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి ప్రభుత్వం పట్టణాల్లో ఆక్రమణల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించింది. అయితే  2013లో న్యాయస్థానం ఆదేశాలతో ఆక్రమణల క్రమబద్ధీకరణ నిలిచిపోయింది. అప్పట్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు 2013, అక్టోబర్ నెలాఖరు వరకు 33,090 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 1,463 దరఖాస్తుదారులకు 80 చదరపు గజాల వరకు పేదలకు ఉచితంగాను, 1,758 దరఖాస్తు దారులకు 250 చదరపు గజాల వరకు నిర్ధారించిన ధరకు మొత్తం 4,59,861.61 చదరపు గజాలను క్రమబద్ధీకరించారు.

న్యాయస్ధానం ఆదేశంతో క్రమబద్ధీకరణ నిలిచిపోవడంతో 2013, అక్టోబర్ నెలాఖరు నాటికి 1,833 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అప్పుడే నిబంధనలకు సరిపడా దరఖాస్తులు లేని కారణంగా ఏకంగా 27,736 దరఖాస్తులను జిల్లాల్లో తిరస్కరించారు.