Wednesday, 2 March 2016

రూ. 14వేల కోట్లా ! నారాయణ మరీ ఇంతగా దోచేశారా?

రూ. 14వేల కోట్లా ! నారాయణ మరీ ఇంతగా దోచేశారా?

అమరావతి భూముల సంగతులను తొలి నుంచి పర్యవేక్షిస్తున్న  మంత్రి నారాయణ భారీగా భూములు సంపాదించారని ఒక ప్రముఖ ప్రతిక భారీ కథనాన్ని రాసింది. చంద్రబాబు, లోకేష్, మురళీమోహన్, సుజనా చౌదరి, నారాయణ తదితరులు రాజధానిలో వేల ఎకరాల భూములను మోసపూరితంగా సంపాదించారని కథనంలో ఆరోపించింది. వీరిలో అత్యధికంగా మంత్రి నారాయణే భూములను సంపాదించారని చెబుతోంది.  నారాయణ ఏకంగా రూ. 3,600 ఎకరాలు సంపాదించారట.
భూసమీకరణ కోసం గ్రామాల్లో పర్యటించిన సమయంలో  టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా అసైన్డు, లంక భూముల రైతులను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారట. అసైన్డు, లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారని, దాంతో ఆందోళన చెందిన అమాయకులు భూములు తక్కువ ధరకే అమ్మేసుకున్నారని కథనం చెబుతోంది.
ఎకరం గరిష్ఠంగా రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. తనకు భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్సు కింద రూ.రెండు లక్షలు ముట్టజెప్పిన నారాయణ.. తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారట. అసైన్డు, లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు. ఆ రైతుల నుంచి జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తన బినామీల పేర్లపై చేయించుకున్నారట.. మొత్తమ్మీద రాజధాని గ్రామాల్లో 3,600 ఎకరాల భూములను మంత్రి నారాయణ కొనుగోలు చేసినట్లు, రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సదరు పత్రికకు వివరించారని రాశారు.
ఈ 3, 600 ఎకరాల కొనుగోలుకు నారాయణ టీం రూ. 432 కోట్లు ఖర్చు చేశారని.. ఇప్పుడు ఆ భూముల విలువ రూ. 14 వేల 400 కోట్లని తేల్చింది.  ఒకవేళ ఇదే నిజమైతే  నారాయణ భూదాహం చరిత్రలో రికార్డుగా నిలిచిపోతుంది.

No comments:

Post a Comment