ఓ పెళ్లి ఖర్చు రూ. 6,800 కోట్లు
Sakshi | Updated: March 30, 2016 16:10 (IST)
మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్, సఫియా బాంక్వెట్ హాల్లో పుష్పాలంకృత భారీ వేదికపై శనివారం జరిగిన ఈ పెళ్లికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయన్నది ఓ అంచనా. వజ్రాలు పొదిగిన పెళ్లి కూతురు శ్వేతవర్ణపు వెడ్డింగ్ డ్రెస్‌కే 16.20 లక్షల రూపాయలట. ప్రముఖ డిజైనర్ నేసిన దీన్ని పారిస్ నుంచి తెప్పించారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 28 ఏళ్ల గుత్సరీవ్, 20 ఏళ్ల విద్యార్థి ఖదీజా ఉజకోవ్‌లు పెళ్లి చేసుకున్నారు. జెన్నీఫర్ లోపెజ్, ఎన్రిగ్ ఇగ్లేసియాస్ లాంటి సెలబ్రిటీలు ఆహుతులను అలరించారు. ఇంతవైభవంగా పెళ్లి జరిపించిన చమురు దిగ్గజం మిహాయిల్‌కు 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.