Saturday, 18 January 2014

జనతా’ దారిలో ఆమ్ ఆద్మీ? - బైలైన్

న్యూస్ ఫ్లాష్నేపియర్ వన్డేలో భారత్ టార్గెట్ 293 పరుగులుShare on:
  
మీరు ఇక్కడ ఉన్నారు: హోం అభిప్రాయంకథ

జనతా’ దారిలో ఆమ్ ఆద్మీ?

Sakshi | Updated: January 18, 2014 23:41 (IST)
జనతా’ దారిలో ఆమ్ ఆద్మీ?
బైలైన్: ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు

అవినీతి నిర్మూలన  ఆమ్ ఆద్మీ వద్ద ఇంకా మిగిలి ఉన్న పోత బంగారపు తురుపు ముక్క. దానికి సమయం పడుతుందని ప్రజలు కూడా అంగీక రిస్తారు. కానీ రాజకీయాల్లో కాలం అనంతమైనది కాదు. కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడి ఉన్నారంటేనే అధికార కాలరేఖ మరింత చిన్నదిగా ఉంటుంది. ఆమ్ ఆద్మీ కూడా జనతా పార్టీలాగే ముగిసిపోతే పట్టించుకోనవసరం లేదు. కాకపోతే అది మిగిల్చే నిరుత్సాహాన్ని మాత్రం పట్టించుకోవాల్సి ఉంటుంది.

వీధి అలజడుల నుంచి పుట్టిన ఏ పార్టీలోనైనా వైవిధ్యభరితమైన దాని జనన స్వభావం ప్రతిఫలించక మానదు. గాంధీ టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ గాంధీ అయిపోరు. స్వభావరీత్యానే పట్టణ తిరుగుబాటు తన నాయకత్వాన్ని ప్రాథమిక పరీక్షకు నిలబెడుతుంది. నాయకులు అతి త్వరగా ఊకను, బియ్యాన్ని వేరు చేయాల్సి ఉంటుంది. లేక పోతే చివరికి అంతా ఊకే మిగులుతుంది. ఊకను బుక్కిన రాజకీయవేత ్త ఎవరికైనాగానీ కడుపు నొప్పి తప్పదు.

1977లో జనతాపార్టీ ప్రజాస్వామిక తిరుగుబాటును సమర్థవంతంగా విజయవంతం చేసి అధికార  ప్రాసాదంలోకి ప్రవేశాన్ని సంపాదించగలిగింది. దాని అధికారం గారాలపట్టి లాంటి దేశ రాజధాని నగరపు మునిసిపల్ పరిధికి పరిమితం కాలేదు. వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న ప్రతి రాష్ట్రానికి విస్తరించింది. అందువల్లనే దానికి లోక్‌సభలో ఎలాంటి ఇబ్బందీ కలగని మంచి ఆధిక్యత లభించింది. మూడు రంగుల చెక్క కాళ్లను తగిలించుకోవాల్సిన అగత్యం లేకుండానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆ పార్టీ అనుభవానికి గుణపాఠాలను నేర్పగలిగే స్వభావం ఉంది.

ఎన్నో ఆశలను రేకెత్తించిన జనతాపార్టీ తన శక్తిసామర్థ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించక ముందే ఆ అశలనన్నిటినీ వమ్ము చేస్తూ విచ్ఛిన్నమైపోయింది. ఆ పార్టీ నేతలు మొదటి రెండు వారాల్లోనే ప్రమాదకరమైన తప్పు చేశారు. దాన్నుంచి ఆ పార్టీ మరెన్నటికీ కోలుకోలేదు. బాధ్యతారహితంగా, అడ్డూఅదుపూ లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే తిరుగుబాటుదార్లను అణచివేసే అధికారం ఉన్నా గానీ వారికి లొంగిపోయారు.

 వ్యక్తిత్వపరంగానూ, తాత్వికపరంగానూ ఏమంత తేడాలేని ఇద్దరు వ్యక్తులు జనతా పార్టీలోని రెండు భిన్న ధృవాలకు ప్రాతినిథ్యం వహించారు. ఒకరు, ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యం ఇచ్చే గాంధేయవాది, కాంగ్రెస్ ప్రముఖుడు మొరార్జీదేశాయ్. 1966లో లాల్‌బహదూర్
శాస్త్రి హఠాన్మరణం తదుపరి ఇందిరాగాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఆయన సవాలు చేశారు. నాడు మొరార్జీ ఓడిపోయారు. కానీ ఆ విషయాన్ని మాత్రం మరువలేదు.

తొలుత డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా సోషలిస్టు ఉద్యమంలో పనిచేసిన రాజ్‌నారాయణ్... తనకు తానుగానే ఒక టపాకాయల గోదాముగా మారారు. ఒక్కో చిచ్చును రాజేసే కొద్దీ ఆయన గొల్లున నవ్వడం పెరుగుతూ వచ్చింది. మొరార్జీ ఎప్పుడైనా నవ్వారేమోగానీ చూసినవారు లేరు. అలాగే రాజ్‌నారాయణ్ ఉల్లాసంగా లేకుండా స్తబ్ధుగా ఉండటాన్ని గమనించినవాళ్లు లేరు. రాజ్‌నారాయణ్  1979 నాటికి చరణ్‌సింగ్‌కు మద్దతుగా నిలిచి, కాంగ్రెస్‌తో కుట్ర పన్ని జనతా ప్రభుత్వాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేశారు.

రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి 1971లో ఇందిరాగాంధీ ఎన్నిక కావడాన్ని రాజ్‌నారాయణ్ పిటిషన్ వేసి సవాలు చేశారు. 1975లో అలహాబాద్ హైకోర్టు ఆ ఎన్నికను కొట్టిపారేయడంతో ఆయన సుప్రసిద్ధు
డ య్యారు. ఆ కేసులో రాజ్‌నారాయణ్ తరఫు న్యాయవాది శాంతిభూషణ్...ఆమ్ ఆద్మీ నేత ప్రశాంత్‌భూషణ్ తండ్రి.

అంతమాత్రాన ఇది రెండు పార్టీల మధ్య ప్రవర్తనాపరమైన అనుబందాన్ని రూఢిపరచజాలదు. కానీ ఆ అనుబంధానికి ఆధారాలు తమ కథను చెప్పడం ప్రారంభమైంది.

అరవింద్ కేజ్రీవాల్, మొరార్జీలోని సత్ప్రవర్తనకు రాజ్‌నారాయణ్‌లోని బాధ్యతారహితమైన తొందరపాటు విన్యాసాలను జోడించాలని చూస్తున్నారు. ఆయన మంత్రులు వాస్తవికతతో సంబంధం కోల్పోయిన చపలచిత్తులుగా మారుతున్నారు. వారు రోజులో కొన్ని గంటలు మాత్రమే తమ శాఖలకు బాధ్యులుగా ఉంటూ మిగతా సమయంలో తమ అధికారులకు వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు.

జనాకర్షక విధానం ఒక ప్రమాదకరమైన ప్రలోభం. అది, బిల్లులు చెల్లించ నిరాకరించినవారికి ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఫిర్యాదూ సమంజసమైనదేనని, ఎల్లప్పుడూ పోలీసులదే తప్పని, అధికారులు ఎప్పుడూ నైతికంగా దివాలా తీసినవారేనని భావించే నిఘా కార్యకర్త ప్రవర్తనకు దారి తీస్తుంది. ఉద్రేకపూరితమైన వాగాడంబరం మిమ్మల్ని ప్రమాదకర స్థాయిలలోని ఆగ్రహం అంచులకు తీసుకుపోతుంది. కేజ్రీవాల్ తన రాష్ట్ర పోలీసులకే వ్యతిరేకంగా బహిరంగ నిరసనకు కూచుంటానని బెదిరిస్తుంటే ఇక అరాచకపు గందరగోళానికి వేదికలు ఇంకెక్కడా మిగలవు. ఢిల్లీ ఓటర్లు మార్పుకు ఓటేశారే గానీ అరాచకానికి కాదు. ఢిల్లీ పోలీసుల్లో పదుల సంఖ్యలో తప్పులున్నాయి. ఆ నగరంలో బతుకుతున్న వారిలో అత్యధికులకు అది ఏదో ఒక రూపంలో అనుభవైక వేద్యమవుతూనే ఉంది. అలా అని వారి స్థానంలో పార్టీ కార్యకర్తలు ఆ బాధ్యతలను నెరవేర్చగలరా?

తేడాలను చూసే ప్రయత్నం ఏదైనా జరిగితే విపరీత పరిశుద్ధవాదులు ఆగ్రహిస్తారు. ఇదేమీ లెనినిస్టు విప్లవం కాదని, ప్రజాస్వామిక సవాలని మరచిపోతారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులనందరినీ తొలగించి పార్టీ క్యాడర్లతో నింపలేరు.

నక్సలైట్లు కావడానికి తగిన ధైర్యంలేక ఆమ్ ఆద్మీ పార్టీ వీధి విప్లవవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఆ పార్టీ వైఖరులను తెలివిగా ఎవరూ ఒక తార్కిక చట్రంలో ఉంచలేదు. కాబట్టి దాన్ని ప్రణాళిక అని ఎవరూ అనలేరు. కానీ ఆ పార్టీ వైఖరి మాత్రం ప్రభుత్వాధికార వ్యవస్థపైనా, ప్రైవేటు రంగంపైనా రాజకీయవర్గ అధికారాన్ని విస్తరింపజేసే వ్యవస్థ సామాజికీకరణ, జాతీయకరణ దిశగా సాగుతున్నాయి. మీ కంటే నేనే పవిత్రుడ్ని అనే ధోరణిని ఆ పార్టీ ఎంతగా ఒంట బట్టించుకుందంటే దాని మంత్రి ఒకరు తప్పు చేశారని న్యాయమూర్తి వెల్లడిస్తే... న్యాయ వ్యవ స్థదే తప్పయి తీరాలి. అంతేగానీ పార్టీ తప్పు కావడానికి వీల్లేదు. లెనిన్, మావోలూ అంగీకరిస్తారు.

అధికారం ఒక బాధ్యత. చౌకగా విద్యుత్తును, నీటిని అందించడం ద్వారా మాత్రమే ఢిల్లీ బాధలనన్నిటినీ తీర్చేసి, జనాదరణను పొందగలిగేట్టయితే షీలా దీక్షిత్ ఆ పని ఎందుకు చేయలేదు?

ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి నిర్మూలన  ఆమ్ ఆద్మీ వద్ద ఇంకా మిగిలి ఉన్న పోత బంగారపు తురుపు ముక్క. అది తేలికేమీ కాదనేది స్పష్టమే. కాబట్టే దానికి సమయం పడుతుందని ప్రజలు కూడా అంగీక రిస్తారు. అయితే రాజకీయాల్లో కాలం అనంతమైనది కాదు. అధికారం కాలపరిమితికి లోబడి ఉంటుంది. మీరు కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడి ఉన్నారంటేనే ఆ కాలరేఖ మరింత చిన్నదై ఉంటుంది. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా తన వద్ద 300 పేజీల ఆధారాలున్నాయని కేజ్రీవాల్ అన్నారు. అందువల్లనే ఆయన అన్ని సీట్లు గెలవగలిగారు. ముఖ్యమంత్రి అయ్యాక వాటిని చదవడానికి ఆయనకు సమయం ఉన్నదా? అని త్వరలోనే ఎవరైనా అడిగే అవకాశం ఉంది.

ఆమ్ ఆద్మీ కూడా జనతా పార్టీలాగే ముగిసిపోతే పట్టించుకోనవసరం లేదు. కాకపోతే అది మిగిల్చే నిరుత్సాహాన్ని మాత్రం పట్టించుకోవాల్సి ఉంటుంది.
 

Thursday, 16 January 2014

మజ్లిస్‌కే మేం వ్యతిరేకం: కిషన్‌రెడ్డి

మజ్లిస్‌కే మేం వ్యతిరేకం: కిషన్‌రెడ్డి

Published at: 16-01-2014 04:27 AM
 New  0  0 
 
 

హైదరాబాద్, జనవరి 15 : మజ్లిస్ పార్టీకి వ్యతి రేకంగా మాట్లాడితే బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని అనుకుంటారని, కానీ తాము ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకం కానేకాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హనీఫ్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. "ఇది వరకు ఒక మజ్లిస్ ఎమ్మెల్యే.. హిందువులకు, హిందూ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే, మరో మతాన్ని అవమానించేలా ప్రవర్తించడం ముస్లింల సంప్రదాయం కాదు. కాబట్టి, మా పార్టీ ముస్లిం ప్రజలను కాక, మజ్లిస్ పార్టీని, ఆ పార్టీ నేతలను మాత్రమే వ్యతిరేకిస్తున్నది'' అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో హిందువులు, ముస్లింల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, కాంగ్రెస్ పాలనలో పేదరికం, అవినీతి వంటి సమస్యలు పెరిగిపోయాయని చెప్పారు. ఈ స్థితిలో మతం, కులం, ప్రాంతం వంటి అంశాలు అంత ప్రధానం కాదని, ముందుగా అవినీతి, పేదరికం వంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
- See more at: http://www.andhrajyothy.com/node/54414#sthash.1LHKVpfk.dpuf

కర్నూలును రాజధాని చేస్తే 400 కోట్లు ఇస్తా!

కర్నూలును రాజధాని చేస్తే 400 కోట్లు ఇస్తా!

Published at: 16-01-2014 04:31 AM
 1  0  1 
 
 

200 ఎకరాలు, 200 కోట్ల విరాళం: బాలసాయి
కర్నూలు, జనవరి 15: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలును రాజధానిగా చేస్తే రూ.400 కోట్లు విరాళం ఇస్తానని బాలసాయిబాబా ప్రకటించారు. రూ.200 కోట్ల విలువైన 200 ఎకరాలతోపాటు... అభివృద్ధి కోసం మరో రూ.200 కోట్లు ప్రభుత్వానికి ఇస్తానన్నారు. బాలసాయి బాబా 54వ జన్మదిన వేడుకలు కర్నూలు నగరంలో మంగళవారం వైభవంగా జరిగాయి. బాలసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనిలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దేశ విదేశాలకు చెందిన భక్తులు, అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. బాలసాయిబాబా ప్రసంగిస్తూ... "కర్నూలుకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తే రాజధాని అభివృద్ధి కోసం... నా 200 ఎకరాల స్థలం, ట్రస్టుకు సంబంధించిన మరో రూ.200 కోట్లు అందిస్తాను'' అని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తనకు భక్తులు ఉన్నారని... అందరికీ తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఉన్నంతలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. బాలసాయిబాబా జన్మదిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు బస్వరాజు సారయ్య, టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి తనయురాలు శర్మిష్ట ముఖర్జీ చేసిన కథకళి నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

- See more at: http://www.andhrajyothy.com/node/54427#sthash.Z3b9CFux.dpuf

నిర్ణయాత్మక నాయకత్వం అవసరం - మోదీ

ఆర్థిక దుస్థితి నుంచి దేశం బయటపడాలంటే నిర్ణయాత్మక నాయకత్వం అవసరం

Published at: 16-01-2014 04:39 AM
 New  0  0 
 
 

ఫిక్కి సమావేశంలో మోదీ వ్యాఖ్య
గాంధీనగర్/అహ్మదాబాద్, జనవరి 15: "యూపీఏ సర్కారులో బాధ్యతను స్వీకరించగల వారెవరూ లేకపోవడమే దేశం ఆర్థిక దుస్థితిలో కూరుకుపోవడానికి కారణం. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే నిర్ణయాత్మక శక్తిగల నాయకత్వం ఎంతో అవసరం'' అని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కి) బుధవారం గాంధీనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. "అభివృద్ధిలో మౌలిక సదుపాయాలు కీలకం. ఇందులో ఇంధన రంగ ప్రాధాన్యం అపారం. ఇంధన కొరతవల్లే పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఎవరో ఒకరు ఇందుకు బాధ్యత స్వీకరించాలి. కానీ, ఈ దేశంలో ఎవరూ అందుకు సిద్ధంగా లేరు. అయినా, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే నిపుణులు అవసరమా?'' అన్నారు. ప్రశంసలు అందుకోవడమే కాదు... ప్రతికూలతకు ఎదురొడ్డి నిలవగల స్థితప్రజ్ఞత కూడా అవశ్యమన్నారు. ప్రజలు మనపై ఉంచిన గురుతర బాధ్యతను సవాలుగా స్వీకరించాలి తప్ప పారిపోతే దేశం ఎలా ముందడుగు వేస్తుందని ప్రశ్నించారు.
"పాట్నాలో పేలుళ్లు జరిగితే మీరెందుకు పారిపోయారని కొందరు నన్ను ప్రశ్నించారు. కానీ, పారిపోయేవాడైతే మోదీ అసలు జన్మించి ఉండేవాడు కాదన్నదే దీనికి నా సమాధానం'' అన్నారు. పథక రచన, అమలు వ్యూహం, పని విభజన, వనరుల సద్వినియోగంపై నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఉంటే దేశ పురోగమనం మరో రకంగా ఉండేదన్నారు. కానీ, అలాంటి అవకాశాన్ని కోల్పోయామని, 21వ శతాబ్దంలో తొలి దశాబ్దం ముగిసేసరికి మిగిలినవన్నీ ప్రశ్నార్థకాలేనని ఎద్దేవా చేశారు. "కాబట్టే ఇప్పుడు సమర్థ నాయకత్వం, కచ్చితమైన నిర్ణయాత్మక శక్తి అవశ్యం'' అని స్పష్టం చేశారు.
ప్రధాని మన్మోహన్ 'సమ్మిళిత అభివృద్ధి' గురించి మాట్లాడతారుగానీ, పేదలను విద్యావంతుల్ని చేసి, సామర్థ్యం పెంపునకు ప్రయత్నించకుండా అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక మైనారిటీ యువత అరెస్టు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రి షిండే రాష్ట్రాలకు సూచించడం మైనారిటీలను ఆకట్టుకోవడానికి 'నిస్సిగ్గు'గా ప్రయత్నించడమేనని దుయ్యబట్టారు. దీనిపై ఆయనకు హితవు చెప్పాలంటూ ప్రధానికి మోదీ లేఖ రాశారు. షిండే వైఖరి ఉగ్రవాద కేసులపై చట్టాలు అమలు చేసే యంత్రాంగాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని హెచ్చరించారు. నేరాలకు మతాలతో సంబంధం లేదన్న వాస్తవాన్ని షిండే గుర్తించాలన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/54447#sthash.KzOSv2PQ.dpuf

సీమాంధ్ర ఎంపీలకు హైకమాండ్ షాక్

ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు హైకమాండ్ షాక్

Published at: 16-01-2014 14:25 PM
 New  0  0 
 
 

న్యూఢిల్లీ, జనవరి 16 : సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులకు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం జరగనున్న ఏఐసీసీ సమావేశానికి పాస్‌లను నిరాకరించింది. వారు సమావేశానికి వచ్చి సమైక్యం పేరుతో గొడవ చేయవచ్చుననే అనుమానంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణకుమార్, సాయిప్రతాప్, హర్షకుమార్‌లను ఏఐసీసీ సమావేశాలకు దూరంగా ఉంచాలని హైకమాండ్ నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం  కాంగ్రెస్ నేతలు గౌరవంగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో వాడి, వేడిగా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.
- See more at: http://www.andhrajyothy.com/node/54639#sthash.sIqgfINk.dpuf

Wednesday, 15 January 2014

డానీ నోట్స్ 2014 జనవరి 16

డానీ నోట్స్
7 జనవరి 2014

చర్చ రచ్చ
మనోళ్ళు చాలా తెలివైనవాళ్ళు. అసెంబ్లీ హాలులో స్పీకర్ పోడియం ముందు  రచ్చ చేస్తారు. బయట మీడియా పాయింటు దగ్గర కొచ్చి చర్చ చేస్తారు.   దీనికో పరిష్కారం వుంది.  మీడియా పాయింటును అసెంబ్లీ హాలుగా మార్చాలి.  అసెంబ్లీ హాలును మీడియా పాయింటుగా మార్చాలి.

డానీ నోట్స్
7 జనవరి 2014

పార్టీలన్నీ దుకాణాలే

దుకాణం తెరిచే వుంచుకోవాలని సిపిఐ నారాయణ ఆనాడే చిరంజీవికి  చెప్పారట. దుకాణం అంటే పీఆర్పీ ఒక్కటే అకోవాల్సిన పనిలేదు. రాజకీయ పార్టీలన్నీ దుకాణాలే! చిరంజీవిది కాస్త బార్లాతెరిచిన దుకాణం. మిగిలిన వాళ్ళది కొంచెం చాటుగా నడిపే దుకాణాలు. అదొక్కటే తేడా. మిగిలిందంతా సేమ్ టూ సేమ్.  చిరంజీవి రాజకీయాలకు కొత్తగనుక ఔట్ రైట్ గా అమ్మేసి చేతులు దులుపుకున్నారు.  మిగిలినోళ్ళు సీజన్డ్  పొలిటీషియన్స్ కనుక సీజన్ కు ఒకరికి లీజుకు ఇచ్చుకుని లాభాలు పండించుకుంటున్నారు.


డానీ నోట్స్
7 జనవరి 2014
విజయవాడ ప్రయాణం

రాత్రికి విజయవాడ వెళుతున్నా. బుధ, గురువారాలు అక్కడే వుంటా.  బుధవారం కుటుంబపనులు చూసుకోవాలి. గురువారం సాయంత్రం బుక్ ఎగ్జిబిషన్ లో చోరగుడి జాన్సన్ రచన  ’స్వంత సంతకం’ పుస్తకావిష్కరణ సభకు వెళ్ళాలి.

డానీ నోట్స్
7 జనవరి 2014
విరసం సభలు

విరసం మహాసభలు జనవరి 11, 12 తేదీల్లో వరంగల్లులో జరుగుతున్నాయి.
నేను విరసంతో వున్నాను.  12 ఆదివారం వరంగల్ వెళ్ళాలనేది ఆలోచన.


డానీ నోట్స్
7 జనవరి 2014
ఆత్మహత్యలు

ఆత్మహత్యలకు సారాంశంలో సామాజిక కారణాలు మాత్రమే వుంటాయి.
ఆర్ధిక, మానసిక, జీవధర్మ కారణాలన్ని పైకి కనిపించేవి మాత్రమే!
సమాజంలో సంఘీభావం తగ్గినపుడు ఆత్మహత్యలు పెరుగుతాయి.
ఏ సమాజంలో అయినా సంఘీభావాన్ని కొలవడానికి ఆత్మహత్యలు ఒక కొలమానం.

డానీ నోట్స్
10 జనవరి 2014
విజయవాడ ప్రయాణం

తాత్విక ధోరణిలో సాగింది విజయవాడ ప్రయాణం. కొన్ని ఆనందాలు. కొన్ని ఇబ్బందులు.
చోరగుడి జాన్సన్ పుస్తక ’సొంత సంతకం’ ఆవిష్కరణ, సి. రాఘవాచారిగారి ఉపన్యాసం. బుక్ ఎగ్జిబిషన్ లో శ్రీశ్రీ విశ్వేశ్వరరావు, సయ్యద్ రఫిలని కలవడం ఈ ట్రిప్ లో ఆనందాలు. బ్యాంకు పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందుల పరిష్కారం కోసం సమయం సరిపోలేదు. ఇతర మిత్రుల్ని కలవలేకపోయాను. కనీసం మా చెల్లెల్ని కూడా చూడలేకపోయాను. రెండు రాత్రుళ్ళూ  ఖాదర్ తోనే సాగిపోవడం అదో నష్టపరిహారం!

డానీ నోట్స్
10 జనవరి 2014
జాన్సన్ ’సొంత సంతకం’

ఎడిట్ పేజీ రచయితల్లో విభిన్న వ్యక్తిత్వం చోరగుడి జాన్సన్.
తెలుగు సమాజంలో, రాజకీయరంగంలో వామపక్షవాదులదే ఆధిపత్యం అంటే అతిశయోక్తి కావచ్చుగానీ, తెలుగు ఆలోచనాపరుల్లో వామపక్షవాదానిదే ఆధిపత్యం అంటే అతిశయోక్తి ఏమీలేదు. మరీముఖ్యంగా తెలుగు పత్రికల ఎడిట్ పేజీ వరకైతే ఇది మరీ నిజం.

జాన్సన్ వామపక్షం కాదు. జహ్నవీలా కుడిపక్షం అస్సలు కాదు. వారిది ఉపయోగితావాదం. అందులోకూడా వారు జెరిమీ బెంథామ్. జాన్ స్టూవర్ట్ మిల్ లా సాంప్రదాయిక ఉపయోగితావాది కూడా కాదు. ఆధునిక ఉపయోగితావాది. సూటిగా చెప్పాలంటే దళిత ఉపయోగితావాది. మత అల్పసంఖ్యాకవర్గాల ( క్ర్తైస్తవ ) ఉపయోగితావాది. ఆ విధంగా వారి గమ్యంతో నాకు అనుబంధంవుంది; గమనంతో భిన్నాభిప్రాయాలున్నప్పట్టికీ.

వామపక్షాలు సూత్రప్రాయంగా ఎల్.పి.జి. ( లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) ని వ్యతిరేకిస్తాయి. జాన్సన్ దాన్నీ దళితాభ్యుదయానికి ఏమేరకు ఉపయోగించవచ్చు అని ఆలోచిస్తారు.

2001లో పీవీ నరసింహారావు - మన్మోహన్ సింగ్ - ప్రణబ్ ముఖర్జీ త్రయం

(చాలా మంది ప్రణబ్ ముఖర్జీని మరిచిపోతుంటారు. మరకేష్ వెళ్ళి ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావానికి  సమ్మతంగా గ్యాట్ మీద సంతకం పెట్టి వచ్చింది ఆయనే)

మళ్లీ టీడీపీ చక్రం తిప్పుతుంది : చంద్రబాబు నాయుడు

డానీ నోట్స్
15 జనవరి 2014

చిత్తూరు, జనవరి 14 : భారతీయులకు పూర్వవైభవం వచ్చేటట్లుగా ప్రపంచమొత్తం గుర్తింపేకాదు, రెండు, మూడు దేశాల్లో భారతదేశం విడిదిచేయడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర కూడా ఉంటుందని, మళ్లీ టీడీపీ చక్రం తిప్పుతుందని, పూర్వవైభవం వస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఇలా ఒక పత్రికలో అచ్చయింది. ఏమిటీ దీని అర్ధం మిత్రులారా?

డానీ నోట్స్
16 జనవరి 2014

చంద్రబాబును చూసేశాం.
జగన్, కిరణ్ ను కూడా చూసేశాం.
ఏదైనా కొత్తది వస్తే బాగుంటుంది.

డానీ నోట్స్
16 జనవరి 2014

ఇంకో ఐదు రోజులే!

ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ బిల్లు - 2013 పై చర్చించడానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే వ్యవధుంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చివరి క్షణాల్లో అయినా జ్ఞానాన్ని ప్రదర్శిస్తారా? లేక సీమాంధ్ర ప్రజలకు శాశ్వీత అన్యాయం చేస్తారా?

డానీ నోట్స్
16 జనవరి 2014

రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు జరుగుతున్న అన్యా యానికి జగన్, కిరణ్ , చంద్రబాబు ముగ్గురూ బాధ్యలే. ముగ్గుర్నీ ఏ-వన్ గా ప్రకటించాలి!

డానీ నోట్స్
16 జనవరి 2014

ఇచ్చిన గడువులో చర్చే మొదలెట్టకుండా, మరో పది రోజులు గడువు కోరడం దేనికీ. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ బిల్లు - 2013 పై చర్చను ఇప్పటికీ కేవలం సాంకేతిక అంశంగా చూస్తున్నారు.

డానీ నోట్స్
16 జనవరి 2014

భారతీయులకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టే పనిని కాస్సేపు పక్కన పెట్టి, తెలుగువాళ్ళకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టే పనిని చంద్రబాబు చేపడితే బాగుంటుంది.