Thursday, 31 December 2015

రాష్ట్ర విభజనలో మాకు అన్యాయం, అవమానం: చంద్రబాబు

రాష్ట్ర విభజనలో మాకు అన్యాయం, అవమానం: చంద్రబాబు
31-12-2015 01:15:29

  • కేంద్ర సాయం తగినంత రావడం లేదు.. అయినా వదలం
  • విభజన సమయంలో అన్యాయం..జన్మభూమిలో ఇవన్నీ వివరిస్తాం
  • ఆర్థిక కష్టాలున్నా సంక్షేమ బాటే..సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
  • కార్డులకు 12.5 లక్షల దరఖాస్తులు..అర్హులందరికీ ఫిబ్రవరిలో కార్డులిస్తాం
  • గ్రామాల్లో 5వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు..‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో సీఎం
 
విజయవాడ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు విభజన సమయంలో అన్యాయం, అవమానం జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో విడత జన్మభూమిలో దీనినీ ఒక అంశంగా తీసుకుంటున్నామన్నారు. నవ్యాంధ్ర నిర్మాణం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. ‘‘అన్యాయం జరిగిందని కుమిలిపోతే లాభం లేదు. దాన్ని కసిగా మార్చుకొని కష్టపడాలని ఇదివరకే చెప్పాను. కేంద్రం నుంచి రావాల్సినంత సహాయం రావడంలేదు. దానికోసం ప్రయత్నిస్తున్నాం. వదిలిపెట్టే సమస్యే లేదు’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. బుధవారం విజయవాడలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ ఆ వివరాలు.
 
మూడో విడత జన్మభూమి ప్రారంభిస్తున్నారు. మొదటి రెండు విడతల్లో ఎటువంటి సమస్యలు పరిష్కరించారు. మూడో విడత లక్ష్యం ఏమిటి? 
సమస్యలు అనునిత్యం పరిష్కరిస్తూనే ఉన్నాం. ఒకవిడత జన్మభూమిలో పెన్షన్ల అంశంపై దృష్టి సారించాం. ఇంకో విడతలో అనేక సమస్యలు తీసుకున్నాం. రైతు రుణ విముక్తి, డ్వాక్రా సంఘాలు తదితర అంశాలు పరిశీలించాం. మూడో విడత జన్మభూమి సమీక్ష ప్రధానంగా ఉంటుంది. 12.5 లక్షల మంది రేషన్‌ కార్డులు కోరారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇస్తున్నాం. ఈ జన్మభూమిలో భాగంగా వారికి సంక్రాంతి కానుక అందుతుంది. ఫిబ్రవరి నుంచి రేషన్‌ ఇస్తాం. ఇక... రెండుసార్లు ఇంటింటికీ వెళ్లి ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమం చేశాం. 90 శాతం వివరాలు కరెక్టుగా వచ్చాయి. 4-5శాతం తప్పులు వచ్చాయి. మిగిలినవి సర్వే పూర్తి కానివి, లిటిగేషన్లు ఉన్నవి. అవి కూడా పబ్లిష్‌ చేస్తాం. అవకతవకలకు అవకాశం లేకుండా, అవినీతిని పూర్తిగా కట్టడి చేసేలా ప్రయత్నిస్తున్నాం. ప్రజల్లో చైతన్యానికి ఈ జన్మభూమిలో ప్రయత్నిస్తున్నాం. ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ కింద వైద్య పరీక్షలను ఉచితంగా చేసేందుకు సంకల్పించాం. ఆస్పత్రుల్లో శుభ్రత, బయోవేస్ట్‌ నిర్వహణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే బయటి డాక్టర్లను కూడా పిలిపించి ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవలో సర్జరీలు చేయిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా ఈ జన్మభూమిలో వివరిస్తాం. పంట సంజీవని, చెక్‌డ్యాంలు, నదుల అనుసంధానం, డ్రిప్‌, స్ర్పింక్లర్‌ ఇరిగేషన్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వీటికి తోడు రెయిన్‌గన్స్‌ ఏర్పాటు చేసి పంటలు ఎలా కాపాడతామో రైతులకు వివరించి చెబుతాం. గ్రామాల్లో 5000 కిలోమీటర్ల పొడవునా సిమెంటు రోడ్లు వేయాలని సంకల్పించాం. ప్రతి గ్రామంలో కరెంటు, మరుగుదొడ్లు, సిమెంటు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. వచ్చే జూన్‌ నుంచి ప్రతి ఇంటికీ 10-15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తాం. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తోందన్న అంశంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం. పేదలు ఆస్పత్రికి పోతే తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఉచితంగా వారిని ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని జనవరి ఒకటో తేదీన ప్రారంభిస్తున్నాం.
 
జన్మభూమిలో ఆర్థిక భారంలేని సమస్యలే పరిష్కారం అవుతున్నాయనే భావన ఉంది! 
అది కరెక్టు కాదు. సిమెంటు రోడ్లకు డబ్బులిస్తున్నాం. మరుగుదొడ్లు, వంటగ్యాస్‌ సిలిండర్లకు డబ్బులిస్తున్నాం. రేషన్‌ కార్డులు, పెన్షన్లు... ఇలా అన్నీ ఆర్థికంతో ముడిపడి ఉన్నవే. 43 లక్షలకు పైగా పెన్షన్లకు రూ. 6000 కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అవసరం. మనిషికి 5 కేజీల చొప్పున బియ్యం, వెయ్యి రూపాయల పెన్షన్‌, ఎస్సీ, ఎస్టీలకు అదనపు ప్రయోజనాలు, ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని దినాలు... ఇలా అనేక ప్రయోజనాలు అన్ని కుటుంబాలకూ అందుతున్నాయి. పేదల్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నదే నా ధ్యేయం.
 
సిటిజన్‌ చార్టర్‌ తరహాలో జన్మభూమిలో వచ్చిన విజ్ఞాపనల పరిష్కారానికి కూడా నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశిస్తారా? 
చాలావరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అర్హతతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ పెన్షన్లు కావాలి అంటే కష్టం. హేతుబద్ధత చూడాలి. అర్హులందరికీ ఇస్తున్నాం. పెన్షన్‌ ఎవరికిచ్చారు... ఎప్పుడిచ్చారు అనే వివరాలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఉంటున్నాయి.
 
సిబ్బంది సామర్థ్యం పెంచకుండా, అవినీతిని రూపుమాపకుండా సమస్యల పరిష్కారం సాధ్యమేనా? 
ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగారియా వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో తిరిగి చూసిన తర్వాత అభివృద్ధిపట్ల చాలా ఆనందంగా ఉన్నారు. నా అంచనాల ప్రకారం ఇంకా జరగాల్సిది చాలా ఉంది.
 
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని (డబ్బులు లేకుంటే ఇది సాధ్యం కాదు కదా అనే అర్థంలో...), ఆర్థిక సమస్యలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని అరవింద్‌ పనగారియా వ్యాఖ్యానించారు. దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? 
వారి వ్యాఖ్య సవ్యంగానే ఉంది. కానీ... మన పరిస్థితి వేరు. విభజన సమయంలో అన్యాయం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన సాయం రావడంలేదు. దానికోసం ప్రయత్నిస్తున్నాం. అరవింద్‌ పనగారియాకు సముద్ర తీర విజన్‌న్‌పై ప్రజెంటేషన్‌ చేశాను. రెండు సాగర్‌ మాల ప్రాజెక్టులు అవసరమని ఆయన అన్నారు. ఒకటి... గుజరాత్‌-ముంబై, మరొకటి విశాఖ-చెన్నై. ఈ రెండు సాగర మాలలు వస్తే ఇండియాలో చైనా తరహా అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది మన విజన్‌కు సూట్‌ అవుతోంది.
 
గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాలనా సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు సంక్షేమం అంటున్నారు. గెలుపు ఓటములు మీ ప్రాధాన్యతలను ప్రభావితం చేశాయా? 
నేను పని చేయాల్సింది నాకోసం, నా కుటుంబం కోసం కాదు. ప్రజలకోసం పని చేస్తున్నా. వారికి సాధికారత తేవాలి కదా! అభివృద్ధి ఫలితాలు పేదలకు అందాలి. పేదల సంక్షేమం జరగాలి. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. అదే ఇప్పుడు చేస్తున్నా. నేను అభివృద్ధి చేశాను... సరైన సమయంలో దాని ఫలితాలు ప్రజలకు సహజంగా చేరతాయని గతంలో అనుకున్నాను. ఎన్నికల్లో ఓడిపోయాం. తర్వాత స్వార్థంతో రాషా్ట్రన్ని లూటీ చేశారు. ఇప్పుడు పేదలకోసం, రైతులకోసం కష్టపడుతున్నా. 
ఒకాయన అమరావతి వెళ్లి పర్యావరణం ధ్వంసమవుతోందంటాడు. ఈయనెవరు? అమరావతిలో రైతులకు ఆ విషయం తెలియదా? అసెంబ్లీలో ఒకాయన విజయవాడ సెక్స్‌, క్రైమ్‌ సిటీ అంటాడు. విజయవాడ పేరు దెబ్బ తీయాలనే ప్రయత్నం. నీచ రాజకీయాలకోసం ఇంత దుర్మార్గమా? ఇలాంటి దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఇక్కడ ఉండటం దురదృష్టకరం.

రాజధాని శంకుస్థాపన సమయంలో రాష్ట్రానికి ప్యాకేజీపై కేంద్రం కసరత్తు చేస్తోందని, అతి త్వరలో ప్యాకేజీ రాబోతోందని చెప్పారు. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ఇప్పుడు మీ వద్దకు వచ్చి ప్రశంసిస్తున్నారు. మరి ప్యాకేజీ మాటేమిటి? 

వారు నివేదిక ఇచ్చామన్నారు. త్వరలోనే ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకొని మాట్లాడతాను. ఎట్టిపరిస్థితుల్లో ప్రయత్నిస్తా. ఒకవైపు కొన్ని పనులవుతున్నాయి. అవి చాలవు. విభజన సమయంలో చెప్పినవన్నీ చేయవలసిన అవసరం ఉంది. ప్రధాని వాటన్నిటినీ చేస్తానని హామీ ఇచ్చారు. చేస్తారని ఆశిస్తున్నా. 
మీరు వచ్చాక పని పెరిగిపోయిందని అధికార యంత్రాంగం భావిస్తోంది. 
పని పెరిగిందనుకుంటే పెరిగిపోతుంది. చేసే పనిలో ఆనందం పొందితే ఆటోమేటిక్‌గా దానికి అలవాటుపడతాం. టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక ట్యాబ్లెట్‌ తీసుకెళ్తే ఫైళ్లు మోసుకెళ్లే అవసరం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సులువుగా పనిచేయడం అలవాటు చేసుకోవాలి.
 
అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. అధికారుల పని తీరు మెరుగుపరుస్తామంటున్నారు. మరి... మంత్రివర్గ సహచరుల మాటేమిటి? 
అందరూ సమాజంలో భాగమే. మా మంత్రులే కాదు... ఎమ్మెల్యేలు, పార్టీవారు, మీ పత్రికలవారు, ప్రజలు అందరూ ఎప్పటికప్పుడు సమర్థత మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు కూడా మావాళ్ళకు అదే చెప్పాను.
 
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉందా? 
సరైన సమయంలో ఉంటుంది. ఇప్పుడున్న మంత్రులే చాలావరకు మంచి ఫలితాలు తెస్తున్నారు. ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటాం. అవసరమైనప్పుడు ప్రజాప్రయోజనాలకోసం ఏమి నిర్ణయాలో చేయాలో అవి చేస్తాం.
 
2016లో మీ లక్ష్యాలేమిటి? 
2016 ఏపీకి ఒక నూతన అధ్యాయం. దేశంలో ఒక అగ్ర రాష్ట్రంగాతయారు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఇవ్వాలి. అభివృద్ధితో జీవన ప్రమాణాలు పెంచాలి. ఉపాధి అవకాశాలు రావాలి. సంపద సృష్టి జరగాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజానికి చేసే కృషిలో 2016 నాంది.
 
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన ‘కొత్త పలుకు’ వ్యాసంలో కొన్ని సూచనలు ఇచ్చారు. మీరు కూడా మీ నాయకులకు చెప్పారు. సమీక్షలు ఎక్కువవుతున్నాయని... 
సమీక్షలు తగ్గించాం. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. సామర్థ్యం, నైపుణ్యాల అభివృద్ధి లేదు. నా స్వభావం ఏంటంటే... మనుషుల్లో మార్పుకోసం ప్రయత్నిస్తాను. చెప్పి చూస్తాను. మార్పు రాకపోతే, ఇది తప్పు అనుకుంటే నాకంటే కఠినంగా ఉండేవారు ఎవరూ ఉండరు.
 
రాజకీయంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బలపడినట్టుగా ఇక్కడ మీరు బలపడటం లేదు! 
రకరకాలుగా ఊహించుకోవచ్చు. ఒక్కో నాయకుడి స్టైల్‌ ఒక్కోలా ఉంటుంది. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా బలంగా ఉంది. ఒకటి రెండు ఎన్నికలు కాదు. రాజకీయ స్థిరత్వం రావాలన్నా, ప్రజలకు మంచి జరగాలన్నా ఒక పార్టీ ఎక్కువ కాలం పాలించి సమర్థ నాయకత్వాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు... 2004లో నేను ఓడిపోయిన తర్వాత నాకు కొంత నష్టం జరిగింది. నాకంటే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. మళ్లీ కష్టపడ్డాను... తిరిగి అధికారంలోకి వచ్చాను. ఈ పదేళ్లు రాష్ట్రం మంచి అవకాశాన్ని కోల్పోయింది. నేను చేసిన పనుల ఫలితాలు చేతికి వచ్చే సమయంలో అధికారం పోవడం... అక్కడి నుంచి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా తయారు చేయడం చూస్తున్నాం. రాజకీయంగా గట్టిగా ఉండాలనుకున్నప్పుడు... దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాహితంకోసం చాలా గట్టిగా ఉంటాను.
 
ప్రభుత్వం దృష్టి మొత్తం అమరావతిపైనే ఉందని, మిగిలిన ప్రాంతాల్ని విస్మరిస్తున్నారని ఒక భావన ఉంది. మరీ ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమలోనే ఉంది! 
అది సరి కాదు. కొందరు రాజకీయ ప్రయోజనాలకోసం మాట్లాడుతున్నారు. ఈ రోజు పనగారియా వచ్చారు. ఏం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యూహాత్మక ప్రాంతంలో ఉందన్నారు. విశాఖ నుంచి చెన్నై సాగర్‌ మాల వస్తే ఇక్కడే అభివృద్ధి జరుగుతుంది... ఆ తర్వాతే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. గోదావరిపై పోలవరం నిర్మాణానికి నాలుగేళ్లు పడుతుంది కాబట్టి... పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టాం. ఈరోజు పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణాకు తెచ్చాం. వచ్చే ఏడాది వంద టీఎంసీలు తెచ్చి రాయలసీమకు కచ్చితంగా నీరిస్తామని చెప్పానంటే కారణమేంటి! పట్టిసీమ పూర్తయింది. సీమకు నీరొస్తే వీరికి పుట్టగతులుండవనే మాట్లాడుతున్నారు. ఈరోజు అనంతపురం, కర్నూలు, తిరుపతిలలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇవి చెప్పరా? నేను కూడా రాయలసీమలో పుట్టాను. రాయలసీమ సెంటిమెంట్లు నాకు తెలుసు. అక్కడ కరువు, వెనుకబాటుతనం నాకు బాగా తెలుసు. రాయలసీమ ప్రజలకోసం, రాష్ట్ర ప్రజలకోసం పని చేస్తా. అంతేకానీ, తప్పుడు విమర్శలు చేసే వాళ్ల కోసం కాదు!

Tuesday, 29 December 2015

రాజధాని గ్రామాలు మాయం

రాజధాని గ్రామాలు మాయం

Sakshi | Updated: December 30, 2015 09:39 (IST)
రాజధాని గ్రామాలు మాయంవీడియోకి క్లిక్ చేయండి
20 జోన్లుగా ఏపీ రాజధాని నగరం వర్గీకరణ  భూములిచ్చిన రైతులకు ఊరు బయట స్థలాలు
 సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం సమీకరించిన భూముల్లో అధికభాగాన్ని రియల్ ఎస్టేట్‌కే వినియోగించనున్నారు. రాజధాని మాస్టర్ ప్రణాళికలో వర్గీకరించిన 20 జోన్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతున్నది. ఏ జోన్‌కు ఎన్ని ఎకరాలో ఈ ప్రణాళికలో స్పష్టం చేశారు. దీని ప్రకారం మధ్యతరహా జనసాంద్రత గలిగిన రెసిడెన్షియల్ జోన్‌కు 12,002.5 ఎకరాలను, సాధారణ వాణిజ్య జోన్‌కు 2856.3 ఎకరాలను కేటాయించారు. ఈ రెండు జోన్‌లలోనే (అంటే 14,858.8 ఎకరాలలో) రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇళ్లు, వాణిజ్య స్థలాలను కేటాయించనున్నట్లు ప్రణాళికలో పేర్కొన్నారు. అందుకోసం 8వేల ఎకరాలు సరిపోతాయని అంచనా. అంటే మిగిలిన ప్రాంతమంతా రియల్‌ఎస్టేట్ కోసమే వినియోగిస్తారని తెలుస్తోంది. ఈ రెండు జోన్‌లలో... భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించే చోట దాదాపు 7 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నారు. అక్కడ చిన్న, మధ్యతరగతి, ఎగువ తరగతిని ఆకర్షించే అపార్టుమెంట్లను, ఇళ్లను నిర్మించనున్నారు.

అలాగే సాధారణ వాణిజ్య అవసరాలకు 2,856 ఎకరాలను వినియోగించనున్నారు. పరిశ్రమలకు 2,789 ఎకరాలను వినియోగించనున్నారు. గ్రీనరీ పేరుతో పార్కులకు ఏకంగా 7,302 ఎకరాలను వినియోగించనున్నారు. క్రీడా ప్రాంగణాలకు ఏకంగా 820 ఎకరాలను, హోటల్స్/రిసార్ట్స్ కోసం ఏకంగా 790 ఎకరాలను, మిశ్రమ వాణిజ్యం పేరుతో 2,856.32 ఎకరాలను వినియోగిస్తారు. ఇక్కడే కొంత వాణిజ్య స్థలాలను రైతులకు ఇవ్వనున్నారు. మొత్తం మీద రాజధాని భూములలో ఎక్కువభాగం ప్రైవేట్ రంగం చేతిలోనే పెట్టనున్నారు.

 కోర్లో మూడూళ్లు మాయం
 కోర్ రాజధాని వచ్చే మూడు గ్రామాలు మాయం కానున్నాయి. ఉద్ధండరాయుని పాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలు కోర్ రాజధానితో కనుమరుగు కానున్నాయి. ఆ గ్రామాలను పూర్తిగా అక్కడి నుంచి తొలగించనున్నారు. అలాగే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఆయా గ్రామాల్లో కాకుండా ఆయా గ్రామాల బయట స్థలాలు ఇవ్వాలని మాస్టర్ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఉదాహరణకు తుళ్లూరు గ్రామంలో రైతులకు ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలను ఎక్కడ ఇచ్చేది మాస్టర్ ప్రణాళికలో మ్యాప్ ద్వారా వివరించారు. దాని ప్రకారం అది రాజధాని ప్రాంతానికి దూరంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

ప్రస్తుత గ్రామాల్లోని స్థలాలను వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించనున్నారు. ఆ గ్రామాల్లోని రైతులకు నివాస స్థలాలను మాత్రం గ్రామాల బయట కేటాయించాలని పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం వల్ల పట్టణీకరణ పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతం గణనీయంగా తగ్గిపోతుందని మాస్టర్ ప్రణాళికలో పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీములో రైతులకు తిరిగి స్థలాలు ఇచ్చే కార్యక్రమం అమలు అంతా మాస్టర్ ప్రణాళికను అనుసరించి ఉండాలని స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు మీడియం జనసాంద్రత గల ప్రాంతంలో  స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. హెక్టార్‌కు 110 యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. 29 గ్రామాల్లోని భూములిచ్చిన రైతులకు ఆయా గ్రామాల బయట స్థలాలను కేటాయించనున్నారు.

AAP, Bihar jolt BJP, but PM Narendra Modi still going strong

AAP, Bihar jolt BJP, but PM Narendra Modi still going strong

READ MORE ON » services tax | Rahul Gandhi | Lok Sabha | Bihar | Arvind Kejriwal | Amit Shah
Monthly SIP Investments
www.myuniverse.co.in/ZipSIP Invest as low as Rs 1000pm in Top SIPs in just 2mins. Start a ZipSIP.
Ads by Google

RELATED VIDEO

AAP, Bihar Jolt BJP, But PM Narendra Modi Still Going Strong
The AAP's dramatic rise and the comeback of Lalu Prasad and Nitish Kumar in Bihar marked the first full year of Prime Minister Narendra Modi.
The AAP's dramatic rise and the comeback of Lalu Prasad and Nitish Kumar in Bihar marked the first full year of Prime Minister Narendra Modi.
By Prashant Sood and Brajendra Nath Singh 

NEW DELHI: The AAP's dramatic rise and the comeback of Lalu Prasad and Nitish Kumar in Bihar marked the first full year of Prime Minister Narendra Modi, who analysts say is still going strong though his earlier sheen has worn off.

For a politician who seemed to be at the peak of his popularity when 2015 dawned, having led the BJP to a historic win in the general election and later in Maharashtra, Jharkhand and Jammu and Kashmir, Modi suffered the maiden electoral defeat of his career in Delhi in February.

It was a personal blow for Modi because the Aam Aadmi Party (AAP), which swept away the BJP in assembly polls, was led byArvind Kejriwal, who Modi crushed in theLok Sabha election in Varanasi in May 2014.

Nine months later, Modi suffered the second major jolt -- and of a far serious nature -- when his personalized campaign failed to help the BJP to defeat JD-U leader Nitish Kumar and RJD chief Lalu Prasad. If the BJP won just three of 70 seats in Delhi, it got 53 of 243 seats in Bihar.

The Bihar outcome led to open dissidence in the BJP, whose four senior leaders - L.K. Advani included - publicly called for a thorough review of the defeat. The statement was seen as an attack on Modi and BJP president Amit Shah, his Man Friday.

Amid the electoral reverses, the opposition, particularly the Congress, crushed in 2014, fired salvos after salvos. Charges of corruption and wrongdoing enveloped External Affairs Minister Sushma Swaraj and the chief ministers of Madhya Pradesh and Rajasthan, Shivraj Singh Chouhan and Vasundhara Raje.

Sushma Swaraj and Raje were linked to controversial ex-IPL chief Lalit Modi while Chouhan was blamed for a recruitment scandal which also led to some reported 50 deaths. The CBI was asked to probe the scam and deaths.

Although the Congress faced a bleak year, the exception being Bihar where it was a junior partner to the JD-U and the RJD, its leader Rahul Gandhi forced the government to go on the back foot on its land bill that he said would take land away from farmers for industrialists.

Rahul Gandhi also showed more assertion and articulation after a 50-day sabbatical. No one seemed to know for sure where he was during this time.

The Congress crippled both the monsoon and winter sessions of parliament on a range of issues from "intolerance" to alleged corruption in Delhi's cricket body DDCA.

Just ahead of the Bihar election, the brutal killing of a Muslim man in Uttar Pradesh on rumours that he ate beef led to unprecedented surrender of awards by leading writers and artistes, embarrassing the government.

Despite the BJP's reverses, Modi's personal popularity remained high. He continued to tour numerous countries, and ended 2015 with a historic visit to Pakistan that earned him widespread praise.

And the BJP became a part of the government in Jammu and Kashmir, the country's only Muslim-majority state, for the first time, as a junior ally to the PDP.

AIADMK leader J. Jayalalithaa returned as Tamil Nadu's chief minister after being acquitted in a case of holding disproportionate assets, which had forced her to give up the job.

Congress president Sonia Gandhi and vice president Rahul Gandhi faced legal trouble in a case involving the now shut National Herald newspaper - on a complaint pursued by BJP leader Subramanian Swamy.

The BJP also faced unprecedented trouble in Modi's home state Gujarat, with a young Hardik Patel bringing thousands of Patels on the streets for job quotas. He was accused of sedition but the BJP suffered huge reverses in later civic body elections.

The unending BJP-opposition frictions buried the Goods and Services Tax bill, which could not be passed in parliament.

The BJP had some reasons to cheer. It made gains in local body elections in Kerala - where it has never won an assembly seat - and bagged two assembly seats in Manipur.

Even the end of 2015 saw fireworks.

The CBI raided in December the Delhi Secretariat, targeting a senior official aide to Chief Minister Kejriwal charged with corruption. But the AAP leader alleged his office was searched for what he said was a file linking corruption in the Delhi and District Cricket Association (DDCA) to Finance Minister Arun Jaitley.

A furious Jaitley - known to be close to Modi - filed a defamation case against Kejriwal. And the BJP suspended its MP Kirti Azad, who had been campaigning on the issue for long, leading to more disquiet among party veterans uncomfortable with the working style of Modi and Amit Shah.

Monday, 28 December 2015

ఓఎస్డీ అభీష్టను తప్పించారు..

ఓఎస్డీ అభీష్టను తప్పించారు..

Sakshi | Updated: December 29, 2015 08:07 (IST)
ఓఎస్డీ అభీష్టను తప్పించారు..
     ► లోకేశ్‌పై ఆరోపణల నేపథ్యం
     ► ఆయన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లకుండా
     ► ఏపీ సీఎం ముందుజాగ్రత్త

సాక్షి, హైదరాబాద్: తన కార్యాలయంలో ఓఎస్డీగా పని చేస్తున్న సీతేపల్లి అభీష్టను ఏపీ సీఎం చంద్రబాబు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అభీష్ట రాజీనామాకు ఆమోదం తెలిపారు. సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు చేసింది. చినబాబు లోకేశ్‌పై ఆరోపణలు నానాటికీ తీవ్రమవుతుండటం, ఇలాగే కొనసాగితే కుమారుడి రాజకీయ జీవితానికి భవిష్యత్తులో ఇబ్బంది తప్పదనే భావనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి లోకేశ్ సహధ్యాయి అయిన అభీష్టను మొదటి నుంచి ప్రోత్సహించింది  బాబే. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించేలా చేసేందుకు అభీష్టను పావులా వాడుకున్నారనే విమర్శలున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అభీష్ట కూడా ఆయన కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు.
అప్పటినుంచి ఆయనద్వారానే తండ్రీకొడుకులు అన్ని వ్యవహారాలు నడిపించారనే ఆరోపణలున్నాయి ముఖ్యంగా చినబాబు లోకేశ్ తరఫున సీఎం కార్యాలయంలో కార్యకలాపాలను అభీష్ట చక్కబెడుతుండేవారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు, ఐటీ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు దగ్గర నుంచి ప్రభుత్వంలో ఏ చిన్నపని అయినా లోకేశ్ మాట మేరకు అభీష్ట నెరవేరుస్తూ వచ్చారు. సీనియర్ అధికారులు కూడా లోకేశ్‌కు సన్నిహితుడైన అభీష్ట కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూసేవారు. అభీష్ట మాట వినని పలువురు అధికారులు కీలకమైన శాఖల నుంచి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి తెరవెనుక మంత్రాంగం అంతా ఆయనే నడిపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఇటీవలి మరింత తీవ్రమై సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం ఊపందుకుంది. కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే సూచనలు కన్పిస్తుండటంతో బాబు అభీష్టను తప్పించారు. అయితే అభీష్ట... బాబు, లోకేశ్‌లు చెప్పినట్లు వ్యవహరించారే తప్ప తనంతట తానుగా వ్యవహారాలు నడపలేదని సీఎంఓ వర్గాలంటున్నాయి. పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను సమన్వయం చేసుకోలేకపోతున్నందుకే ఓఎస్డీ బాధ్యతల నుంచి అభీష్ట తప్పుకున్నారని, భవిష్యత్తులో పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాబు తనను తప్పించాలని నిర్ణయం తీసుకోవడంతో అభీష్ట గత నవంబర్ 30నే రాజీనామా లేఖను సీఎం కార్యాలయానికి పంపించారని సమాచారం.

అమరావతి నుంచి నలుదిక్కులా హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌

అమరావతి నుంచి నలుదిక్కులా హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌
29-12-2015 06:39:07

మంగళగిరి: మంగళగిరి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. విజయవాడకు సైతం వెళ్లని హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భవిష్యత్తులో విధిగా మంగళగిరి స్టేషన్‌లో ఆగను న్నాయి. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలిస్తే... రాజధాని ప్రాంతంలో మంగళగిరి ప్రధాన జంక్షన్‌గా అవతరించే అవకాశాలున్నాయి. మాస్టర్‌ ప్లానులో ప్రతిపాదించిన హైస్పీడ్‌ రైల్వేట్రాక్‌లు రాజధాని నలుదిక్కులా ఉన్న మెట్రోపాలిటన్‌ నగరాల నుంచి నేరుగా మంగళగిరి జంక్షన్‌ను చేరుకునే విధంగా ఉన్నాయి. ఈ హైస్పీడ్‌ ట్రాక్‌లు విజయవాడ, తెనాలి స్టేషన్లను తాకకుండా వాటికి దూరంగా మంగళగిరి జం క్షన్‌ను చేరుకునేలా ప్రతిపాదించడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి సులభంగా, వేగంగా చేరుకునే విధంగా హైస్పీడ్‌ రోడ్డు, రైలు కనెక్టవిటీ కావాలని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తుది మాస్టర్‌ ప్లానులో హైస్పీడ్‌ రైల్వే లైన్లను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న డబుల్‌ లైన్‌ రైల్వేట్రాక్‌లకు సమాంతరంగా హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌లను ప్రతిపాదించారు. నాలుగు వైపుల నుంచి కొత్తగా ఏర్పాటయ్యే ఈ హైస్పీడ్‌ ట్రాక్‌లకు మంగళగిరి ప్రధాన జంక్షన్‌ కానుంది. తుది మాస్టర్‌ ప్లాను విడుదలైన నేపథ్యంలో మంగళగిరి స్టేషన్‌ అభివృద్ధికి చేసిన ముఖ్య ప్రతిపాదనల నేపథ్యంలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి సోమవారం స్టేషన్‌కు చేరుకుని స్థల పరిశీలన చేశారు. 
మాస్టర్‌ ప్లాన్ లో మార్గాలు ఇలా.. 
బెంగళూరు నుంచి నరసరావుపేట మీదుగా వేమవరం, ఫిరంగిపురం, డోకిపర్రు, పేరేచర్ల, చినపలకలూరు పక్కగా గుంటూరుకు హైస్పీ డ్‌ రైల్వేట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి మంగళగిరికి ప్రస్తుతం ఉన్న డబుల్‌ లేన్‌ ట్రాక్‌కు పశ్చిమ సమాంతరంగా అగతవరప్పాడు, వెనిగండ్ల, కొప్పురావూరు మీదుగా హైస్పీడ్‌ రైల్వేట్రాక్‌ను నిర్మిస్తారు. ఇక్కడి నుంచి నవులూరు, కృష్ణాయపాలెం, వెంకటపాలెం మీదుగా అంటే.. కొత్తగా నిర్మించనున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డుకు సమాంతరంగా ఈ కొత్త ట్రాక్‌ నిర్మాణం జరుగుతుంది. వెంకటపాలెం నుంచి ఐకాన్‌ బ్రిడ్జికి తూర్పు సమాంతరంగా కృష్ణానదిపై హైస్పీడ్‌ రైల్వేట్రాక్‌ నిమిత్తం కొత్త వంతెన నిర్మిస్తారు. అంటే రాజధాని ప్రాంతానికి వెంకటపాలెం వెనుకవైపు అమరావతి స్టేషన్‌ ఏర్పాటు కావొచ్చు. కృష్ణానదిని దాటిన తరువాత ఈ రైల్వేట్రాక్‌ విజయవాడ బైపాస్‌ రోడ్డుకు సమాంతరంగా ప్రయాణిస్తూ గొల్లపూడి దాటాక రెండు శాఖలుగా చీలనుంది. ఓ శాఖ హైదరాబాద్‌ డబుల్‌ లేన్‌ రైల్వేట్రాక్‌కు సమాంతరంగా హైదరాబాద్‌ వైపు వెడుతుండగా... రెండోది విజయవాడ బైపా్‌సకు సమాంతరంగా గన్నవరం సమీపంలో ప్రస్తుత రైల్వేట్రాక్‌కు సమాంతరంగా విశాఖ వెడుతుంది. ఇక చెన్నై నుంచి ప్రస్తుత డబుల్‌ లేన్‌ రైల్వేట్రాక్‌కు సమాంతరంగా మంగళగిరి వరకు కొత్త హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. మాస్టర్‌ ప్లానులో దీని వివరాలు బాపట్ల వద్ద నుంచి పొందుపరిచారు. ఈ డబుల్‌ లేన్‌ రైల్వేట్రాక్‌కు తూర్పు సమాంతరంగా ఏర్పాటయ్యే ఈ హైస్పీడ్‌ ట్రాక్‌కు మోదుకూరు నుంచి ప్రస్తుత డబుల్‌ లేన్‌ ట్రాక్‌ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. మోదుకూరు నుంచి ఈ లైను చుండూరుకు తూర్పు ముఖంగా (తెనాలితో సంబంధం లేకుండా) చినపరిమి, పెదరావూరు, చినరావూరు, నేలపాడు, నందివెలుగు, చింతలపూడి మీదుగా దుగ్గిరాల వద్ద మళ్లీ ప్రస్తుతం ఉన్న డబుల్‌ లేన్‌ రైల్వేట్రాక్‌కు సమాంతరంగా వస్తుంది. ఇక్కడి నుంచి మంగళగిరి మండలం చినవడ్లపూడి వరకు వెళ్లి అక్కడి నుంచి పూర్తిగా పడమర వైపు తిరిగి కోకాకోలా ఫ్యాక్టరీ వెనుకగా చినకాకాని ముందరగా ప్రయాణిస్తూ ప్రస్తుత హైవే నుంచి కొత్తగా ఏర్పాటు కానున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ కూడలి సెంటరుకు వచ్చి బైపాస్‌ రోడ్డుకు సమాంతరంగా ప్రయాణిస్తూ మంగళగిరి వద్ద ఏర్పాటయ్యే రైల్వే జంక్షన్‌ను చేరుకుంటుంది.

Sunday, 27 December 2015

ప్రయుత చండీయాగం చేస్తా

ప్రయుత చండీయాగం చేస్తా

Sakshi | Updated: December 28, 2015 04:18 (IST)
ప్రయుత చండీయాగం చేస్తావీడియోకి క్లిక్ చేయండి
యాగస్థలిలో సీఎం కేసీఆర్ వెల్లడి

♦ తెలంగాణ సస్యశ్యామలం కావాలి
♦ ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి
♦ తెలంగాణ సిద్ధించినందుకే ఈ యాగం చేశా
♦ ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.. అధర్మం నశిస్తుందని వ్యాఖ్య

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సస్యశ్యామలమై, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు శృంగేరి పీఠాధిపతి అనుమతితో ప్రయుత చండీయాగం (సప్తశతీ పారాయణాలు పది లక్షలసార్లు చేయడాన్ని ప్రయుత చండీయాగం అంటారు) నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. త్వరలోనే శృంగేరి పీఠానికి వెళ్లి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి అనుమతి కోరతానని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లిలో అయుత చండీయాగం ముగిసిన తర్వాత యాగశాల వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు పరిపూర్ణం కావాలని, నీటిపారుదల కోసం ప్రతి ఏటా రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించేలా దీవెనలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ‘‘2011లో శృంగేరి స్వామి వారి 60వ పుట్టిన రోజు సందర్భంగా చండీయాగం చేసినప్పుడు మేం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం. ఆరాట పడుతున్నాం. ఆ సమయంలో నా మిత్రుడు అష్టకాల రామ్మోహన్‌రావు శృంగేరి పీఠం నుంచి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆయన తెచ్చిన అక్షింతలు మీద చల్లుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే 100 శాతం అయుత చండీయాగం చేస్తానని దీక్ష తీసుకున్నా. అందుకే ఈ యాగం చేశాను’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

 మనం నిమిత్త మాత్రులమని చెప్పా..
 ‘‘గడా ఓఎస్డీ హన్మంతరావు ధర్మపత్ని, నా బిడ్డ ఎదురుగా నిల్చొని ఉన్నారు. నిప్పు రగిలి మంటలు లేస్తుంటే ఆ అమ్మాయి విషణ్ణ వదనంతో నిలబడింది. అప్పుడు నేను.. ఎందుకు తల్లీ.. బాధపడుతున్నావు.. మనం కేవలం నిమిత్త మాత్రులం అన్నాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మళ్లీ అందరం వెళ్లి శాంతి మంత్రాలు జపించి, పూర్ణాహుతి చేసి యాగ పరిసమాప్తి చేస్తుంటే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వులు చూసిన. నిన్నటికే సుసంపన్నంగా కోటి జపాలు, 10 వేల పారాయణాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు మహారుద్రయాగం నుంచి చతుర్వేద యాగాల వరకు కూడా పూర్ణాహుతి చేసుకున్నాం.

అమ్మవారి 100 హోమగుండాల్లో పూర్ణాహుతి ఇవ్వడం జరిగిపోయింది. చివరి ఘట్టం మాత్రమే ఉంది.. మీరు ఆవాసానికి వెళ్లి రావచ్చని రుత్విక్కులకు చెప్పిన. ఆ సందర్భంగా చిన్న మంటలు చెలరేగితే.. నరహరి భట్టు గారు వైదికంగా జరగాల్సిన పూర్ణాహుతిని ఒంటికాలుపై నిలబడి పరిసమాప్తి చేశారు. తెలియని వాళ్లు కొందరు గాబరా పడ్డా.. నేను గాబరా పడలేదు. యాగాలు చేయడం నాకు కొత్త కాదు. దాదాపు 25 సంవత్సరాలుగా చేస్తున్నా. కొందరు అవాకులు, చవాకులు పేలారు. నేను పట్టించుకోలేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

 ధర్మం జయిస్తుంది..
 తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో బతకాలని కోరుకుంటున్నా. ధర్మం తప్పక జయిస్తుంది. అధర్మం నశిస్తుంది..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్ధాంతి శర్మకు రవీంధ్రభారతిలో సన్మానం చేయాలని నిర్ణయించామని, వారు శతాధిక యజ్ఞాలు చేశారని చెప్పారు. ‘‘కొందరు మిత్రులు మన సంప్రదాయంపై దాడి జరుగుతోందని నాతో అన్నారు. మన సంప్రదాయం గురించి బాధపడాల్సిన పనిలేదని వారికి చెప్పాను. తల్లి పిల్లవాడికి చనుబాలు ఇస్తూ జోలపాట పాడుతున్నప్పుడే పిల్లవాడికి మన సంస్కృతిని ఎక్కిస్తుంది. జో అచ్చుతానందా... జోజో ముకుంద... రామ పరమానంద లాలి గోవిందా... అంటదే తప్ప జో కంస... జో దుర్యోధన... జో కుంభకర్ణ... జో రావణా అని ఏ తల్లీ అనదు. మన సంప్రదాయంలో, మన సంస్కారంలో అంతటి మహోన్నతమైన విశిష్టత ఉంది.

నా బోటి చిన్నవాళ్లు భవిష్యత్‌లో ఇంకా ఎంతో మంది పుడుతారు. బ్రాహ్మణోత్తములు, రుత్వికోత్తములు కార్య నిర్వహణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన సంప్రదాయం, సంస్కారం సుసంపన్నంగా, సుభిక్షంగా ఉంటది. ధర్మం ఎల్లవేళలా విస్తరిస్తూనే ఉంటది. నా మనుమడు ఉన్నడు.. నేను సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ అబ్బాయి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నిన్న నాకు అయ్యవార్లు చెప్పారు. నీ మనమవడికి కూడా మీ సంస్కారం నేర్పిస్తున్నారు.. శుభం అని అన్నారు. చాలా సంతోషం అనిపించింది. నా మనవడికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

నన్ను పెళ్లాడతావా?

నన్ను పెళ్లాడతావా?

Others | Updated: December 09, 2014 20:53 (IST)
నన్ను పెళ్లాడతావా?
అమెరికాను గడగడలాడించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను బుట్టలో వేసుకునేందుకు రష్యా ప్రయత్నించిందని ఆ దేశానికి చెందిన మాజీ గూఢచారి ఒకరు వెల్లడించారు. తమకు బద్దశత్రువైన అమెరికాకు కొరుకుడుపడని స్నోడెన్ ను తమ దారికి తెచ్చుకునేందుకు మహిళా గూఢచారిని రష్యా ప్రయోగించిందని పేర్కొన్నారు. ఇందుకోసం అన్నా చాప్ మాన్(32) అనే 'వేగు' చుక్కను రంగంలోకి దించిందని కేజీబీ మాజీ ఏజెంట్ బోరిస్ కార్పిచ్ కోవ్ వెల్లడించారు.

ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చాప్ మాన్ తన సోయగాలతో స్నోడెన్ ను వలవేసిందన్నారు. అతడిని ఒక్కసారే కలిసినప్పటికీ పెళ్లి ప్రతిపాదన చేసిందని తెలిపారు. 'స్నోడెన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ ట్వీటర్ లో కోరింది. ఇదంతా పథకం ప్రకారం జరిగిందని కార్పిచ్ కోవ్ పేర్కొన్నారు. ఒకవేళ చాప్ మాన్ ప్రతిపాదనను స్నోడెన్ అంగీకరిస్తే రష్యా పౌరసత్వం తీసుకునేందుకు అర్హుడవుతాడు. ఫలితంగా అతడు శాశ్వతంగా రష్యాలో ఉండిపోవాల్సి రావొచ్చు. పౌరసత్వం వచ్చిన విదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సివుంటుందని వివరించారు.

స్నోడన్ కు చేసిన పెళ్లి ప్రతిపాదనపై స్పందించేందుకు చాప్ మాన్ ఓ ఇంటర్వ్యూలో నిరాకరించింది. రష్యా దౌత్తవేత్త పుత్రిక అయిన చాప్ మాన్ 2010లో వార్తాల్లోకి వచ్చింది. రష్యా ఏజెంటుగా అమెరికాలో పనిచేశానని చెప్పి ఆమె సంచలనానికి తెరతీశారు. గూఢచారి అని బయట ప్రపంచానికి తెలియకముందు న్యూయార్క్ సిటీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఆమె పనిచేసింది. అమెరికా నుంచి రష్యాకు తిరిగొచ్చిన తర్వాత మోడల్ గానూ పనిచేసి ప్రాచుర్యం పొందింది. అమెరికా నుంచి తప్పించుకున్న స్నోడెన్ కు రష్యా ఆశ్రయం ఇచ్చింది. మూడున్నరేళ్లు తమ దేశంలో ఉండేందుకు అతడికి అనుమతినిచ్చింది.

రష్యా విమానం కూల్చివేత పుతిన్ కుట్రా!

రష్యా విమానం కూల్చివేత పుతిన్ కుట్రా!

Others | Updated: December 26, 2015 18:58 (IST)
రష్యా విమానం కూల్చివేత పుతిన్ కుట్రా!
లండన్ :
మధ్యప్రాచ్యంలోని షారమ్ ఎల్ షేక్ పర్యాటక ప్రాంతంలో అక్టోబర్ 31వ తేదీన రష్యా విమానం మెట్రోజెట్ ఫ్లైట్ 9268 ఆకాశంలో పేలిపోయి 224 మంది రష్యన్లు మరణించడానికి కారణం ఎవరు? ఈ దుర్ఘటనకు బాధ్యులం తామే అని చెప్పుకుంటున్న ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులకు నిజానికి అంతటి శక్తి ఉందా? తాము శతఘ్నితో పేల్చేసినట్లు వాళ్లు చెబుతున్నా.. సంఘటన స్థలంలో శతఘ్ని శకలాలు ఒక్కటి కూడా ఎందుకు దొరకలేదు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రష్యా ప్రభుత్వం నేటికీ ఎందుకు సేకరించలేక పోయింది?

ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా ఉన్న రష్యా విమానం పేలుడు సంఘటనపై మాజీ కేజీబీ (ఇప్పటి ఎఫ్‌ఎస్‌బీ) ఏజెంట్ బోరిస్ కార్పిఖోవ్ ఓ బాంబు పేల్చారు. ఈ పేలుడు వెనక టెర్రరిస్టుల ప్రమేయం ఏమీ లేదని, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన కుట్రదారుడని ఆరోపించారు. ఆయన ఆదేశం మేరకు రష్యా సైనిక ఇంటెలిజెన్స్‌లో ఒక భాగమైన జీఆర్‌యూ అధికారులు పథకం ప్రకారం బాంబుతో విమానాన్ని పేల్చేశారని ఆయన చెప్పారు. జీఆర్‌యూలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని, 'టూ రాబిట్స్ విత్ వన్ బుల్లెట్ (ఒక దెబ్బకు రెండు పిట్టలు)' అని కూడా ఆయన ఈ కుట్ర గురించి వ్యాఖ్యానించారని కార్పిఖోవ్ తెలిపారు.

రష్యా విమానం కూలిపోయిన రోజు సాయంత్రం ఓ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ కొత్తగా పరిచయం చేసుకున్న ఓ ప్రయాణికురాలి ద్వారా ఓ గిఫ్ట్ ప్యాకెట్‌ను సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని తన కుటుంబ సభ్యులకు అందజేసే మిష మీద పంపారని, ఆమెను అంతంత మాత్రంగా ఉండే సెక్యూరిటీ చెకప్‌లను దాటించి విమానం ఎక్కేవరకు ఆ రష్యా ఏజెంట్ తోడున్నారని కార్పిఖోవ్ తెలిపారు. ఆ గిఫ్ట్ ప్యాకెట్‌లోనే 'ఈ హెచ్‌వీ-7 బాంబు' (రష్యా స్పెషల్ ఇంటెలిజెన్స్ వర్గాల కోసమే ఈ బాంబులను రష్యా తయారుచేస్తోంది), దాని ఇగ్నేటర్ ఉందని, ఇగ్నేటర్ ఎలక్ట్రో లైట్ ద్వారా ఇగ్నైట్ అవుతుందని తెలిపారు. ఆ బాంబును విమానంలో 31 లేదా 31ఏ సీటులో పెట్టి ఉంటారని, గిఫ్ట్‌ను తీసుకొచ్చిన మహిళ ఆ పక్క సీటులోనే కూర్చొని ప్రయాణించారని ఆయన వివరించారు. ఆ బాంబు పేలిపోవడం వల్లనే విమానం గాలిలో ఉండగానే విమానం, అందులోని ప్రయాణికుల శరీరాలు తునాతునకలయ్యాయని తెలిపారు. రష్యా విమానం సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన కొన్ని నిమిషాలకే పేలిపోవడం, దాని శకలాలు 30 మైళ్ల వ్యాసార్ధంలో చెల్లా చెదరుగా పడిపోవడం తెల్సిందే.

ఇదే నిజమైతే పుతిన్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టారు?
చెచెన్యా తిరుగుబాటుదారులకు సహకరిస్తున్న ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను తుదముట్టించేందుకు, సిరియా అధ్యక్షుడు అసద్ సేనలకు అండగా వారిపై రష్యా సైనికులు గత కొంతకాలంగా భూతల యుద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. చెచెన్యా తిరుగుబాటుదారుల అణచివేతను బ్రిటన్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం కూడా ఇక్కడ గమనార్హమే. బ్రిటన్ లాంటి దేశాల నుంచి సానుభూతిని పొందేందుకు, ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను అమానుషులని ముద్ర వేసేందుకు, వారి అంతానికి పలు దేశాల సంఘీభావాన్ని కూడగట్టుకునేందుకు పుతిన్ ఈ దారుణ కుట్రకు తెర లేపారన్నది కార్పిఖోవ్ వాదన. 'టూ రాబిట్స్ విత్ వన్ బుల్లెట్' అంటే అర్థం ఇదేనేమో! ఇదీ నిజమైతే పుతిన్ కుట్ర ఫలించినట్లే.

రష్యా విమానం పేలిపోయి 224 మంది రష్యన్లు చనిపోవడంతో అంతర్జాతీయంగా రష్యా పట్ల సానుభూతి పవనాలు వీచాయి. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనాలు ఐఎస్‌ఐఎస్‌పై యుద్ధానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అధికారికంగా ప్రకటించాయి. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ స్వయంగా పుతిన్‌కు ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేయడంతోపాటు ఐఎస్‌ఐఎస్‌పై పోరాటానికి సహకరిస్తామని హామీ కూడా ఇచ్చారు. అప్పటినుంచి రష్యా వైమానిక దళాలు సిరియాలో ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా గగనతలం నుంచి బాంబులవర్షం కురిపిస్తున్నాయి. చిరకాల మిత్రుడైన అసద్‌కు ఆయుధ సంపత్తిని పుతిన్ సమకూరుస్తున్నారు.

చెల్లింపుల వివాదంలో చిక్కుకొని రష్యాలో జైలు జీవితం గడిపి, విడుదల కాగానే ఇంగ్లండ్‌కు పారిపోయి వచ్చి, రహస్య జీవితం గడుపుతున్న కార్పిఖోవ్ అక్కసుతో చెబుతున్న మాటలేనని వీటిని కొట్టి పారేయచ్చు కూడా. ఆయన పదేళ్లకు పైగా కేజీబీలో మేజర్ స్థాయిలో పనిచేయడమే కాకుండా ఆయనకు రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ వర్గాలతో ఇప్పటికీ సంబంధాలున్నాయి. రష్యా ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పుతిన్ సొంత దేశ ప్రజలనే చంపుకొంటారా ? అన్న అనుమానం కూడా రావచ్చు. అయితే ఇలాంటి ఆరోపణలు ఆయన మీద రావడం ఇదేమీ కొత్తకాదు.

కేజీబీలో గూఢచారిగా పనిచేసిన పుతిన్.. తొలిసారి ఎన్నికైనప్పుడు కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 1999లో మాస్కోలోని నాలుగు అపార్ట్‌మెంట్లలో, బైనాకస్క్, వోల్గోడోన్స్కు పట్టణాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించి 307 మంది మరణించారు. మహిళలు, చిన్నపిల్లలు కూడా చనిపోగా మొత్తం 1700 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు చెచెన్యాలోని ముస్లిం తీవ్రవాదులే కారణమని పుతిన్ అప్పట్లో ఆరోపించారు. వారిపై దాడులను తీవ్రతరం చేశారు. ఈ పేలుళ్లపై దర్యాపు చేస్తున్న స్థానిక పోలీసులు ముగ్గురు క్రెమ్లిన్ గూఢచారులను అరెస్ట్ చేయడంతో పేలుళ్లకు కారణం పుతిన్ అంటూ ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో మరో పేలుడు కుట్రను రష్యా పోలీసులు భగ్నం చేశారు. ఆ కేసులో కూడా రష్యా పోలీసులు ఎఫ్‌ఎస్‌బీ అధికారులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎఫ్‌ఎస్‌బీ అధికారులు తమ ఐడీ కార్డులను చూపించి విడుదలయ్యారు. ఆపార్ట్‌మెంట్ పేలుళ్లకు మూడురోజుల ముందే ఓ రష్యన్ అధికారి ఓ కౌన్సిల్ సమావేశంలో అధికారికంగా పేలుళ్ల బాధితులకు సానుభూతిని వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ అంశాలన్నింటిపై రాజకీయ దుమారం చెలరేగడంతో పేలుళ్లపై దర్యాప్తునకు పుతిన్ ప్రత్యేక పార్లమెంటరీ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. అప్పుడు కమిషన్ దర్యాప్తునకు పుతిన్ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదు. ఇద్దరు కమిషన్ సభ్యులు హత్యలకు గురయ్యారు. కమిషన్ తరఫున పనిచేస్తున్న ఓ సీనియర్ న్యాయవాది జైలుకు వెళ్లారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చెచెన్యా వేర్పాటువాదులే పేలుళ్లకు కారణమని దర్యాప్తు కమిషన్ తేల్చింది. పేలుళ్లకు పుతినే కారణమని వెల్లడించిన కేజీబీ మాజీ ఏజెంట్ లిట్వినెంకో బ్రిటన్ పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన రష్యా ఏజెంట్ల చేతుల్లో హతమయ్యారు.

విమాన ప్రమాదానికి సంభంధించి పుతిన్‌పై వస్తున్న తాజా ఆరోపణల్లోని నిజానిజాలను పక్కన పెడితే, ఆరోపణలకు సంబంధించిన వార్తా కథనాలు మాత్రం బ్రిటన్ మీడియాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

ఆర్థిక నగరంగా.. ఉద్ధండరాయునిపాలెం

ఆర్థిక నగరంగా.. ఉద్ధండరాయునిపాలెం
28-12-2015 06:50:59


రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ఉద్ధండరాయునిపాలెం- వెంకటపాలెం మధ్య ప్రాంతాన్ని ఆర్థిక నగరంగా తయారు చేయాలని తుది మాస్టర్‌ ప్లానలో నిర్ణయించారు. సెంట్రల్‌ బిజినెస్‌ డిసి్ట్రక్ట్‌గా నిర్ణయించిన లింగాయపాలెం - ఉద్ధండరాయునిపాలెం- తాళాయిపాలెం మధ్య ప్రాంతాన్ని ఆర్థిక నగరంగా తీర్చిదిద్ధాలని సీఆర్‌డీఏ భావిస్తోంది.
వాగులే నీటి వనరులు
పాలవాగు, చీకటి వాగు , ఐయ్యన్న వాగు, కోటేళ్ళ వాగులతోపాటు, కొండవీటి వాగు ఉన్నాయి. వాగు నీటిని స్టోరేజ్‌ చేసి, రాజధానికి అవసరమైన జలాలను నిల్వ చేయటానికి తుది మాస్టర్‌ ప్లాన్‌ లో ప్రణాళికలు సూచించినట్టు తెలుస్తుంది. రాజధానిలో ఉన్న మూడు ఎత్తిపోతల పథకాలను సద్వినియోగం చేసుకుంటే నీటి అవసరాలు పూర్తిగా తీరతాయని సీఆర్‌డీఏ భావిస్తున్నట్లు సమాచారం. రాజధాని మా స్టర్‌ ప్లాన్‌ ప్రకారం 29 గ్రామాల్లో ఒకేసారి అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నట్లు స్పష్టమవుతుంది.
నది పక్కన బిజినెస్‌ పార్కులు..
నది పక్కనే ఉన్న తాళ్ళయపాలెం, నెక్కల్లులో సెంట్రల్‌ బిజినెస్‌ పార్కులు ఏర్పాటుకు చేయనున్నారు. స్పెషల్‌ జోన్‌ కింద ఒక్కో గ్రామంలో కొంత.. మాస్టర్‌ ప్లాన్‌లో స్పెషల్‌ జోన్‌ కింద ఒక్కో గ్రామంలో కొంత భాగాన్ని కేటాయించారు.
ఆధ్యాత్మికం అనంతవరం
రాజధానిలోని అనంతవరం ఆధ్యాత్మికతతో పరిఢవిల్లనుంది. అనంతవరం కొండపై మీసాల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబరు 16న స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతవరం ఆలయాన్ని మినీ తిరుమలగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన. ఇందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది.
విద్యా కేంద్రంగా ఐనవోలు
రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకంలో 99 శాతం భూమి ఇచ్చిన ఐనవోలు, శాఖ మూరు గ్రామాలను విద్యా, విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్ధాలని సీఆర్‌డీఏ తుది మాస్టర్‌ ప్లానలో ప్రతిపాదించింది. శాఖమూరు భూముల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నాలెడ్జ్‌ సెంటరును ఏర్పాటు చేయనున్నారు. ఐనవోలు పరిధిలో నూతన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
న్యాయ నగరం..నేలపాడు
రాజధానిలో న్యాయస్థానాలకు అత్యంత ప్రా ధాన్యం ఇవ్వనున్నారు. తుది మాస్టర్‌ ప్లాన్ ప్రకా రం నేలపాడు- వెలగపూడి మధ్య భూముల్లో జస్టిస్‌ సిటీ పేరుతో న్యాయనగరాన్ని నిర్మించనున్నా రు. ఈ నగరంలో హైకోర్టుతో పాటు న్యాయస్థానా ల సముదాయం, న్యాయమూర్తుల నివాసాలు, సి బ్బందికి గృహాలు నిర్మించనున్నారు. ఈ సిటీకి అతి సమీపాన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వే ఉంటుంది.
క్రీడానగరం బోరుపాలెం
లంకమాస్టర్‌ ప్లానలో క్రీడా నగరాన్ని బోరుపాలెం లంకల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. లంక భూ ములు కావడంతో నదికి సమీపంలో ఉల్లాసభరిత వాతావరణం ఉంటుందని భావించి ఈ ప్రాతిపాదన చేసినట్లు సమాచారం. ఇక్కడే సకల వసతులతో అంతర్జాయ స్థా యి ప్రమాణాలతో స్టేడియం నిర్మించే అవకాశాలున్నాయి. క్రీడాకారులకు శిక్షణ, వ సతి గృ హాలను ఏర్పాటు చేయనున్నా రు.
గవర్నమెంట్‌ కోర్‌.. లింగాయపాలెం
నూతన రాజధానిలో అధిక జన సాంద్రత ఉండే లింగాయపాలెంను ప్రభుత్వం ఇప్పటికే సీడ్‌ క్యాపిటల్‌గా నిర్ణయించింది. లింగాయపాలెం- రాయపూడి- కృష్ణా కరకట్ట మధ్య గవర్నమెంట్‌ కోర్‌ను ఏర్పాటు చేయాలని తుది మాస్టర్‌ ప్లానలో పేర్కొన్నారు. అక్కడే శాసనసభ, సచివాలయం నిర్మించాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది.
ఎలక్ర్టానిక్స్‌ రంగం.. బేతపూడి
ఎలక్ర్టానిక్స్‌ రంగానికి సీఆర్‌డీఏ ప్రాధాన్యం ఇస్తోంది. కురగల్లు- బేతపూడి మధ్య భూముల్లో ఎలక్ర్టికల్‌ పరిశ్రమలను ఏర్పాటుకు అనుమతించనున్నట్లు మాస్టర్‌ ప్లానలో పేర్కొన్నారు. ఎలక్ర్టానిక్‌ రంగానికి ఉద్ధేశించిన కురగల్లు - బేతపూడి గ్రామాలు కాజా- ఇబ్రహీంపట్నం మధ్య నిర్మించే బైపాస్‌ రోడ్డుకు అతి సమీపంలో ఉంటాయి.



రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతి ఊరికి ప్రాధాన్యం 
28-12-2015 06:42:53

  • అన్ని గ్రామాల్లోనూ కీలక విభాగాలు
రాజధాని ప్రాంతంలో ప్రతి ఊరికి మాస్టర్‌ ప్లానలో స్థానం లభించింది. రైతులు భూ ములిచ్చిన ప్రతి గ్రామానికి ఏదోక రంగంలో ప్రాధాన్యం కల్పించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో అన్ని గ్రామాల రెవెన్యూ భూములను రాజధాని నిర్మాణానికి వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
తుళ్లూరు, తాడికొండ : రాజధానికి కీలకమైన శాసనసభ, సచివాలయం ప్రభుత్వం సీడ్‌ క్యాపిటల్‌ గా పేర్కొన్న లింగాయపాలెం, రా యపూడి గ్రామాల పరిధిలో రానున్నాయి. అక్కడే అన్ని ప్రభుత్వ ము ఖ్య కార్యాలయాలు నిర్మితం కానున్నట్లు తుది మాస్టర్‌ ప్లానలో స్ప ష్టంగాఉంది. ముంబాయి తరహా ఆర్ధిక నగరంగా ఉద్ధండరాయునిపా లెం, తాళాయిపాలెం గ్రామాల పరిధిలో ఏర్పాటు కానుంది. న్యాయనగరం నేలపాడు- వెలగపూడి మధ్య నిర్మితం కానుంది. టూరిజానికి ఉం డవల్లి, వైద్య ఆరోగ్యరంగానికి కృష్ణాయపాలెం, శాఖమూరు,ఐనవోలు విద్యా, విజ్ఞాన కేంద్రాలుగానూ, క్రీడలకు బోరుపాలెం, ఆధ్యాత్మికతకు అ నంతవరం, బేతపూ డి- కురగల్లు గ్రామాలను ఎలక్ర్టానిక్‌ రంగంలో నూ అభివృద్ధి చేయనున్నట్లు మా స్టర్‌ ప్లానలో చూపారు. మంగళగిరిలో నిర్మించే ఎయిమ్స్‌, స్టేడియం, మాస్టర్‌ప్లానలో భాగంగానే సీఆర్‌డీఏ పరిగణిస్తోంది. సాధారణ వా ణిజ్య ప్రాంతంగా అనంతవరం, తు ళ్లూరు, దొండపాడు, మల్కాపురం, కృష్ణాయపాలెం, బేతపూడి, కురగల్లు, పెనమాక, బిజినెస్‌ పా ర్కులుగా నెక్కల్లు, తాళాయిపాలెం, లాజిస్టిక్‌ జోనగా నులకపేట, బాపూజీనగర్‌ను నిర్ణయించారు. రాజధాని మూడు ప్రధాన జోన్లలో రాయపూడి, లింగాయపాలెంను ప్రభుత్వ జోనగా నిర్ధేశించారు. మాస్టర్‌ ప్లానలో రాయపూడి, ఉ ద్ధండరాయునిపాలెంతో పాటు వెలగపూడి, పిచ్చుకలపాలెం, నెక్కల్లు, శాఖమూరు, నిడమర్రును ప్రత్యేక జోనగా పరిగణించారు.
పచ్చదనం 
అమరావతి 

సొంతం...పచ్చదనం అమరావతి మణిహారం కానుంది. ఇప్పటికే రాజధాని గ్రామల్లోని 14 ప్రదేశాలలో అటవీ శాఖ నర్సరీలు ఏర్పాటు చేసి మొ క్కలు పెంచుతున్నారు. రాజధాని లో రైతుల ప్లాట్లు కేటాయించగానే భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. కృష్ణా నదీ పరివాహాక ప్రాంతం మొత్తం పచ్చదనం పరుచుకోనుంది.
హెల్త్‌ సిటీగా కృష్ణాయపాలెం
మంగళగిరి మండలం కృష్ణాయపాలెం హెల్త్‌ సిటీగా అవతరించనుంది. వెంకటపాలెం- కాజ బైపాస్‌ రోడ్డుకు దగ్గరలో హెల్త్‌ సిటీని నిర్మించనున్నారు. ఇక్కడే అతి పెద్ద వైద్యశాలను, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నివాస సముదాయాలను నిర్మించాలని మాస్టర్‌ ప్లాన్ లో ప్రతిపాదించారు.
పర్యాటకంగా ఉండవల్లి
ఉండవల్లి కేంద్రంగా పర్యాటకాభివృద్ధి చేపట్టాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. విజయవాడకు, నూతన రాజధానికి మధ్యలో ఉన్న ఉండవల్లి రానున్న రోజు ల్లో ప్రఖ్యాత పర్యాటక స్థలంగా ప్రపంచ పర్యాటక పటంలో కీలకం కానుంది. ఉండవల్లిలోటూరిజం సర్క్యూట్‌కు సీఆర్‌డీఏ రూపకల్పన చేయనుంది.

Friday, 25 December 2015

బాబుగారి దుబారా రూ. 600 కోట్లు

బాబుగారి దుబారా రూ. 600 కోట్లు

Sakshi | Updated: December 26, 2015 03:31 (IST)
బాబుగారి దుబారా రూ. 600 కోట్లు
♦ ప్రత్యేక విమానాలు తప్ప మామూలు విమానమెక్కని సీఎం
♦ జిల్లాల్లో పర్యటనలకు ఆర్భాటపు ఏర్పాట్లు
♦ విజయవాడలో సమీక్షల కోసం అధికారులకు అదనపు ఖర్చులు
♦ కార్యాలయాల సోకులకు అదనంగా ఖర్చులు
♦ అవసరం లేకపోయినా కన్సల్టెంట్లకు వందల కోట్లు
♦ అమరావతి శంకుస్థాపన కోసం వృథా వ్యయం

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత మరో నాలుగు రోజుల్లో రెండో కొత్త సంవత్సరం వస్తోంది. గడచిన ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన వృథా ఖర్చులను గమనిస్తే దిమ్మతిరగడం ఖాయం.  ఒక పక్క నిధుల్లేవంటూ మరో పక్క ప్రత్యేక విమానాలకు, కార్యాలయాల సోకులకు, ప్రచార ఆర్భాటాలకు ముఖ్యమంత్రి  దాదాపు రూ.600 కోట్ల రూపాయలు వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణానికి విరాళాలు అడుగుతూ మరో పక్క వృథాగా నిధులను వ్యయం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చేసిన వృథా ఖర్చులను రేఖామాత్రంగా పరిశీలిద్దాం..

 ప్రత్యేక విమానంలోనే ప్రయాణం
 ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడంలో చంద్రబాబు రికార్డు సృష్టించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతి పర్యటనకు ప్రత్యేక విమానాల్లో తిరిగిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లాలన్నా..లేదా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రావాలన్నా..లేదా ఢిల్లీ వెళ్లాలన్నా, సింగపూర్ వెళ్లి రావాలన్నా ప్రత్యేక విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆయన 63 సార్లు ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. అందుకోసం ఫిబ్రవరి వరకు ఆర్థికశాఖ రూ. 15 కోట్లను చెల్లించింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ వ్యయం మరో రూ. 15 కోట్లు అవుతుందని అధికారులు లెక్క కట్టారు.  కృష్ణపట్నం పోర్టుకు చెందిన వారి ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ముఖ్యమంత్రి వెంటే ఉంటాయి.  ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన వ్యయం కూడా తడిసిమోపెడవుతోంది. జిల్లాల పర్యటన ఏర్పాట్ల కోసం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా రూ. 15 కోట్లను ఇటీవల విడుదల చేసింది.

 సమీక్షలు.. అధికారుల పర్యటనలు
 వృథా సమీక్షలు నిర్వహించడంలో కూడా ముఖ్యమంత్రి రికార్డు సృష్టించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం అయినా లేదా ఇతర అధికారులతో సమావేశమైనా ఉదయం 10 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతలపై రాత్రి ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్షలంటే అధికార యంత్రాంగం భయపడే పరిస్థితి నెలకొంది. చెప్పిందే చెబుతూ సమీక్షల మధ్య ఎలాంటి పురోగతీ లేకుండా సమావేశాల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారనే అభిప్రాయానికి అధికార యంత్రాంగం వచ్చేసింది. హైదరాబాద్‌లో కాదని ఈ ఏడాది మంత్రివర్గ సమావేశాలతో పాటు, ఇక అధికారిక సమీక్షలన్నీ విజయవాడలో నిర్వహిస్తుండటంతో అధికారుల ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్-విజయవాడలకు అధికారులంతా నిత్యం విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం టీఏ, డీఏలకు రూ.90 కోట్లను వ్యయం చేసింది.

 కార్యాలయాల సోకులకు రూ.103 కోట్లా..?
 హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ.45 కోట్లను వెచ్చించారు. ఇంకో పక్క విజయవాడలోని ఇరిగేషన్ అతిధి గృహంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ సోకులు, ఏర్పాట్ల కోసం ఏకంగా రూ.42 కోట్లను వెచ్చించారు. కొత్త భవనం నిర్మించినా ఇంత ఖర్చుకాదు. అదనపు సోకుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయడంపై ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం లేక్‌వ్యూ అతిధి గృహానికి రూ.10 కోట్లను వ్యయం చేశారు. మదీనగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్‌లోని అద్దె ఇళ్లకు ఏర్పాట్లు చేయడానికి రూ. 5.87 కోట్లను వ్యయం చేశారు.

 కన్సల్టెంట్లకు రూ. 200 కోట్లు...
 ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులను విదేశాలకు చెందిన కన్సల్టెంట్లకు అప్పగించి కోట్ల రూపాయలు చెల్లించడంపైన కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  నూతన రాజధాని ప్రాంతంలో అవసరమైన డాక్యుమెంట్ల రూపకల్పన కోసం విదేశీ కన్సల్టెంట్లకు ఏకంగా రూ.150 కోట్లు వ్యయం చేస్తున్నారు. వీరుగాక ఏడు మిషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు కన్సల్టెన్సీలకు చెల్లించేందుకు 2015-16 బడ్జెట్‌లో ఏకంగా రూ.50 కోట్లు కేటాయించింది. కన్సల్టెంట్లు స్వయంగా చేసేదేమీ ఉండదని, తాము ఇచ్చిన సమాచారం ఆధారంగా అందంగా నివేదికలు తయారు చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు.  విజన్ 2029 డాక్యుమెంట్ తయారీ బాధ్యతను మెసర్స్ ఎర్నెస్ట్ యంగ్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ రూ. 12.62 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు రూ. 1.12 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా చెల్లించారు.

 మచ్చగా మిగిలిన పుష్కర ప్రచారం
 గోదావరి పుష్కరాల పేరుతో రూ.1,500 కోట్లకు పైగా వ్యయం చేశారు. ఇందులో ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా నిధులను పనులు చేయకుండానే పచ్చ నేతలు కాజేశారన్న విమర్శలున్నాయి.  పుష్కరాల ప్రచారం కోసమే ఏకంగా రూ. 15.20 కోట్లను ఖర్చు చేశారు. పుష్కరాలలో ముఖ్యమంత్రి ప్రచార కండూతి కారణంగా తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందారు.

 అమరావతి శంకుస్థాపనకు  రూ. 100 కోట్లు
 నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటాలతో నిర్వహించడంతో తాత్కాలిక ఏర్పాట్లకు రూ.100 కోట్లకు పైగా వ్యయం చేశారు. ప్రముఖుల కోసం ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేకంగా హెలిపాడ్‌లు నిర్మించిన విషయం తెలిసిందే.  నీరు-చెట్టు ప్రచారం కోసం ఏకంగా రూ. 5 కోట్లు కేటాయించారు. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ గ్రామాల పేరుతో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం ప్రచారం కోసం జిల్లాకు రూ.కోటి  చొప్పున రూ.13 కోట్లను వ్యయం చేసింది. సీఎం జిల్లాల్లో అంతర్గత పర్యటనల కోసం ప్రత్యేకించి రూ.5.50 కోట్ల తో అత్యాధునిక సౌకర్యాలు గల ప్రత్యేక బస్సును కొనుగోలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఖరీదైన బస్సుల కోసం దుబారా ఖర్చుచేస్తారా అని దేవరపల్లికి చెందిన పొగాకు రైతు సుబ్బారావు తన సూసైడ్ నోట్‌లో సీఎంను ప్రశ్నించిన సంగతి తెల్సిందే.

ఎంపీల రవాణా ఖర్చులు ఎంతో తెలుసా?

ఎంపీల రవాణా ఖర్చులు ఎంతో తెలుసా?

Others | Updated: December 26, 2015 10:34 (IST)
ఎంపీల రవాణా ఖర్చులు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ:  2013-14 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యులు చేసిన ఖర్చు ఎంతో తెలుసా... అక్షరాలా 147.38 కోట్లు. అయితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 135.8 కోట్లుగా ఉంది. సమాచార హక్కు చట్టం కింద వేద్ పటేల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశీయ రవాణా ఖర్చుల కింద ఎంపీల విమాన ప్రయాణాలే కాకుండా రైలు, రోడ్డు ప్రయాణ ఖర్చులు, రోజువారి భత్యాలు కూడా వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం పార్లమెంట్ సంభ్యుల జీత భత్యాలను భారీగా పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంది. బేసిక్ శాలరీని నెలకు 50 వేల నుండి లక్ష రూపాయలకు, నియోజక వర్గ భత్యం 45 వేల నుండి 90 వేలకు, సెక్రటేరియల్, ఆఫీస్ అలవెన్స్ ను కూడా  45 వేల నుండి 90 వేలకు పెంచే ప్రతిపాదన ఉంది.
 

Wednesday, 16 December 2015

'బిహార్ కంటే దారుణంగా ఏపీ'

Sakshi | Updated: December 17, 2015 10:42 (IST)
'బిహార్ కంటే దారుణంగా ఏపీ'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు గతంలో బిహార్ రాష్ట్రం కంటే దారుణమని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిహార్‌కు తాతలా తయారైందని చెవిరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏమన్నారంటే...
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాఫియాను ప్రోత్సహిస్తూ దుశ్శాసన పాలన చేస్తున్నారని విమర్శించారు
  • తప్పులన్నీ మీరుచేసి, ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసి, మీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే, వాళ్లను శిక్షించాల్సింది పోయి మా పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. వీళ్ల అదృష్టం వల్ల ఇప్పటివరకూ ఏ ఎన్నికలూ రాలేదు
  • ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఎంత కసిగా, ఎంత కోపంతో ఉన్నారో ఏవైనా చిన్న ఎన్నికలొస్తే తెలిసేది
  • చంద్రబాబు చెంప ఛెళ్లుమనేలా తీర్పు ఇచ్చేవారు
  • తొమ్మిదేళ్ల పాటు సాగిన నరకాసుర పాలన, దుశ్శాసన పాలన మళ్లీ కొనసాగుతోందని ప్రజలు వాపోతున్నారు
  • ఎమ్మెల్యేలకు విమాన టికెట్లు ఇచ్చి విదేశాలకు పంపారు
  • ఒకే ఇంట్లో ఉండి, తమ్ముడు చేసేది అన్నకి తెలియదంటే ఎవరు నమ్ముతారు? నిఘా డీజీపీయే నిందితులతో ఫొటోలు తీయించుకుంటున్నారు
  • మరో నిందితుడు చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు. ఇక్కడ ఆటవిక రాజ్యం కొనసాగుతోంది
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. బీహార్‌కు తాతలా తయారైంది
  • అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మీడియా చేతిలో పెట్టుకుని ఏమైనా చేసేయొచ్చని అనుకుంటే ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు
  • అందరం చేయి చేయి కలుపుదామని, తప్పు ఎవరు చేసినా శిక్షించేలా ముందుకెళ్దామంటే మహిళలపై జరుగుతున్న దారుణాల మీద మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు
  • మాకు విమర్శించాలన్న ఆలోచన లేదు.. తప్పును సరిదిద్దాలన్నదే మా ఆలోచన
  • అసెంబ్లీలో కూడా మాట్లాడేందుకు వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోతోంది