Tuesday, 25 October 2016

బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు - రెండు రాష్ట్రాలకే

రెండు రాష్ట్రాలకే
Posted On: Thursday,October 20,2016

http://www.prajasakti.com/WEBCONTENT/1855423

- కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ తీర్పు
- అభ్యంతరాలు, వాదనలకు నాలుగు వారాలు గడువు
- తదుపరి విచారణ డిసెంబర్‌14కు వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
            ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ చేయాలని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పింది. కర్ణాటక, మహారాష్ట్రకు వీటితో సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలను నాలుగు వారాల్లోగా ట్రిబ్యునల్‌ ముందు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే కష్ణా జలాల పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం ఉమ్మడి ఏపికి కేటాయించిన నీటినే రెండు రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్‌ తీర్పుతో 2010లో కష్ణా ట్రిబ్యునల్‌ ఇచ్చిన 1001 టిఎంసిలు మాత్రమే ఏపి, తెలంగాణ రాష్ట్రాలు ప్రాజెక్టుల వారీగా పంచుకోవాల్సి ఉంటుంది. జలాల పంపిణీ రెండు రాష్ట్రాల మధ్యే జరగాలని కేంద్ర జలవనరుల శాఖ కూడా ట్రిబ్యునల్‌ దష్టికి గతంలోనే తీసుకెళ్లింది. కష్ణా జల వివాదంపై ఏర్పడిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 2013 నవంబరు 29న తుది తీర్పు చెప్పింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే 65 శాతం నీటి లభ్యత, సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలను కూడా కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014 జనవరిలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులో చేసిన కేటాయింపులో నాలుగు టిఎంసిలను తగ్గించి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ తుది తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయాలని కోరుతూ మహారాష్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత తెలంగాణ కూడా ఈ కేసులో భాగస్వామి అయింది. కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో మొదట రెండు రాష్ట్రాలకా? నాలుగు రాష్ట్రాలకా? అన్నది నిర్ణయించడానికి ట్రిబ్యునల్‌ తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుంది.. దీని ఆధారంగా నాలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. గతేడాది ట్రిబ్యునల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో మరమ్మతు చేయడానికే ఏడాది పట్టింది. ట్రిబ్యునల్‌కు నిర్ణయించిన రెండేళ్ల గడువులో ప్రాథమిక అంశంపై కూడా విచారణ పూర్తి కాలేదు. ఆగస్టుతో గడువు ముగియగా, కేంద్రం ఆర్నెల్లు పొడిగించింది.

తెలుగు రాష్ట్రాలకు నిరాశ
బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్‌ అవార్డు మేరకు కష్ణా జలాల్లో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 మిగతా టిఎంసిల నీటిని వాడుకుంటున్నాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టిఎంసిల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టిఎంసిలు, మహారాష్ట్రకు 35 టిఎంసిలను కేటాయించింది. అయితే కష్ణా నదీ బేసిన్‌ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించింది. కష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు పున్ణకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం: దుమ్మలపాటి శ్రీనివాసరావు, ఏపి అడ్వకేట్‌ జనరల్‌ తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాతే దీనిపై ప్రభుత్వంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఏపి అడ్వకేట్‌ జనరల్‌ దమ్మలపాటి శ్రీనివాసరావు చెప్పారు. ఈ తీర్పు దురదష్టకరమన్నారు. ఇది రెండు రాష్ట్రాలకు శరాఘాతం వంటిందన్నారు.

తీవ్ర నిరాశే : విద్యాసాగర్‌ రావు
బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్‌ రావు అన్నారు. ట్రిబ్యునల్‌ తీర్పును పూర్తిగా పరిశీలించాకే భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నికర జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వాటలెంతో భవిష్యత్‌లో తేలుతుందన్నారు.

No comments:

Post a Comment