ప్రతిపక్ష నేతగా జగన్ విఫలం: ఉండవల్లి
18-10-2016 01:05:56
హైదరాబాద్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘విపక్షం విఫలమైంది. ప్రభుత్వాన్ని ఎదిరించి ఏమీ చేయలేకపోతోంది. జగన్ తన బాధ్యతను సక్రమం గా నిర్వర్తించడంలో విఫలమయ్యారు’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్చంద ఆదాయ వెల్లడిలో దరఖాస్తుకు 11 చార్జ్‌షీట్లు ఉన్న జగన్ ఎలా అర్హుడని ప్రశ్నించారు. ఆయన్ను తాను విమర్శిస్తున్నానంటే టీడీపీలో చేరతానని కాదని, ప్రజల సమస్యల పరిష్కారానికి స్వయంగా పోరాటం చేస్తానని అన్నారు. ‘రాష్ట్ర ఆదాయం పెరిగితే ప్రజలకు మంచిదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వృద్ధి 35 శాతం ఉండాలి. కానీ 7శాతం మాత్రమే ఉండడానికి కారణాలేంటో ప్రభుత్వం వివరించాలి. విదేశీ పెట్టుబడుల గురించి సీఎం చంద్రబాబు బ్రహ్మాండంగా చెబుతున్నారు. హైదరాబాద్ ఆర్‌బీఐ వెబ్‌సైట్ చూస్తే మనం ఆరో స్థానంలో ఉన్నాం. ఇక పోలవరం కడతారా.. కట్టరా? కుడివైపు పట్టిసీమ, ఎడమవైపు పురుషోత్తంపట్నం ఎత్తిపోతలు చేపట్టారు. వీటికి అదనంగా రూ.2,400 కోట్లు విద్యుత ఖర్చవుతోంది. 2018లోపు పోలవరం పూర్తిచేసేటట్లయితే ఇప్పుడు పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ఎందుకు’ అని సీఎంను నిలదీశారు. చంద్రబాబు ఎన్నో ప్రశ్నలకు ప్రజలకు సమాధానాలు చెప్పాలని చెప్పారు.

No comments:
Post a Comment