ప్రభుత్వం వెల్లడించిన నల్లధనంలో 10వేల కోట్లు జగన్‌వే: మంత్రి
10-10-2016 12:04:24
విజయవాడ: నల్లధనం వెల్లడిలో జగన్ సొమ్మే ఎక్కువని, హైదరాబాద్ నుంచి ప్రకటించిన నల్లధనం వెల్లడిలో రూ. పది వేల కోట్లు జగన్‌వేనని ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. జగన్ అవినీతి సంపదతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చన్నారు. లోకేష్‌పై దుష్ప్రచారం చేస్తే ప్రజలు హర్షించరని, చదువుతో పాటు సంస్కారం నేర్చుకున్న వ్యక్తి లోకేష్ అని ఆయన చెప్పారు. తుని ఘటనలో వైసీపీ పాత్ర త్వరలో బహిర్గతం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందులలో ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు. పులివెందులకు నీళ్లు రావంటూ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని, పులివెందులకు నీళ్లిచ్చి అక్కడే సన్మానాలు చేయించుకుంటామని ఉమా సవాల్ విసిరారు. పోలవరం పనులు మరింత వేగవంతం చేస్తామని అన్నారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. తోటపల్లిని పూర్తిచేయని అసమర్థ ప్రతినిధి బొత్స సత్యనారాయణ అని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షలకోట్లు సంపాదించారని మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు

No comments:
Post a Comment