భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు
02-01-2016 22:46:50
హైదరాబాద్ ( ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు కోసం తూర్పు తీరంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నం ముస్తాబవుతోంది. ఈ సదస్సు కోసం హార్బర్ పార్క్‌లోని ఎపిఐఐసికి చెందిన విశాలమైన స్థలంలో సకల హంగులతో వేదికను ఏర్పాటుచేస్తున్నారు. ఏసీ హాంగర్స్‌తో ప్రత్యేకంగా కన్వెన్షన్ సెంటర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక లాంజ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో మెగా ఈవెంట్స్‌ను హోస్ట్ చేసేందుకు వీలైన అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ఏదీ లేకపోవడంతో భారీ ఖర్చుతో ఈ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. హార్బర్ పార్క్‌లో జరుగుతున్న ఏర్పాట్లు అబ్బురపరిచే విధంగా ఉన్నాయని వైజాగ్ పారిశ్రామికవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. ఇవి, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం పెట్టుబడుల ఆకర్షణ మహాయాగానికి ఏర్పాట్లని, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అయుత చండీయాగం కోసం తన ఫామ్ హౌజ్‌లో సకల హంగులతో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలతో పోల్చుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 10 నుంచి 12 తేదీల మధ్య మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన సుమారు 1,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, అధికారులు, విధాన నిర్ణేతలతో సహా కేంద్ర, రాషా్ట్రలకు చెందిన వివిఐపిలు అనేకమంది హాజరవుతున్నారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో (విభజన తర్వాత) జరుగుతున్న తొలి మెగా ఈవెంట్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధపెట్టారు. గడువు సమీపిస్తుండటంతో పరిశ్రమల శాఖ అధికారులు ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను షోకస్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సాధారణంగా భాగస్వామ్య సదస్సుల్లో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం ఆచరణలోకి వచ్చేసరికి అందులో 20-30 శాతం కూడా కార్యరూపం దాల్చకపోవడం రివాజుగా వస్తోంది. గతంలో ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి అనుభవాలున్నాయి. అయితే, ఈ సారి పకడ్బందీగా కార్యాచరణను ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సదస్సులో వచ్చే పెట్టుబడి ప్రతిపాదనల్లో కనీసం 60-70 శాతమైనా కార్యాచరణలోకి రావాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ‘ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ఎ షేర్డ్ అండ్ సస్టేనబుల్ వరల్డ్ ఎకానమి - టు ప్రమోట్ సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు ఇతివృత్తంగా ఉంటుంది. నిజానికి ఈ భాగస్వామ్య సదస్సును వేలాది మంది డెలిగేట్స్‌తో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌గా నిర్వహించాలని భావించినా వైజాగ్‌లో వసతి సౌకర్యాల పరిమితి దృష్ట్యా ప్రభుత్వం కొంత సంయమనం పాటించిందని అంటున్నారు. విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్స్ కేటగిరిలో 650 గదులు, త్రీస్టార్, ఫోర్‌స్టార్ విభాగంలో సుమారు 475 గదులున్నాయి. టుస్టార్ విభాగంలో 400 గదులు, సింగిల్ స్టార్ విభాగంలో మరో 400 గదులున్నాయి. అయితే విదేశీ అతిథులను ఫైవ్‌స్టార్ కేటగిరిలోనే ఉంచాల్సి వస్తుంది. భాగస్వామ్య సదస్సు సందర్భగా పలు కీలక అంశాలపై చర్చలు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో .. విశాఖ భాగస్వామ్య సదస్సు
03-12-2015 23:19:36
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో విశాఖలో అంతర్జాతీయ సిఐఐ-పారిశామ్రిక భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం భావిస్తోంది. జనరవి 10-12వ తేదీ వరకు విశాఖలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈసదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో జరిగే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సునకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని, కేంద్ర మంత్రులను కూడా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భద్రతాలోపం: విశాఖ సిఐఐ సదస్సులోకి నకిలీ ఐఎఎస్ ప్రవేశం
By: Pratap Published: Monday, January 11, 2016, 20:01 [IST]
http://telugu.oneindia.com/news/andhra-pradesh/fake-ias-enters-into-cii-partnership-summit-170982.html
విశాఖపట్నం: దేశ, విదేశీ ప్రముఖులు పాల్గొంటున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో భద్రతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం పోలీసు యూనిఫాంలో ఓ ఆగంతకుడు ప్రవేశించగా, సోమవారంనాడు ఓ నకిలీ ఐఎఎస్ అధికారి ప్రవేశించాడు. తాను ఐఎఎస్ అధికారనంటూ ఆ ఆగంతకుడు సదస్సులోకి ప్రవేశించాడు.
అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రమేష్ నాయుడిగా గుర్తించారు. ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి కారులో వచ్చిన అతను ఆయన వెంటనే లోనికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. తీరా అనుమానం వచ్చి ఐడి కార్డు అడగ్గా దాన్ని చూపించలేకపోయాడని సమాచారం. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై చీటింగ్ కేసులు కూడా నమోదై ఉన్నట్లు గుర్తించారు.
ఆదివారంనాడు పోలీసు యూనిఫాంలో ఓ వ్యక్తి ప్రవేశించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అతి సన్నిహితంగా సంచరించినట్లు చెబుతున్నారు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సన్‌రైజ్ ఏపీకి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
https://telugu.yourstory.com/read/a3299b3f31/sunrise-epiki-rs-5-lakh-crore-investment-proposals
CHANUKYA
JANUARY 12, 2016
331 అవగానా ఒప్పందాలు, 4.8 లక్షల కోట్ల పెట్టబడులు, 10 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు.. ఇదీ మూడు రోజుల పాటు విశాఖ వేదికగా సాగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సారాంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 'సన్ రైజ్ స్టేట్'గా ప్రమోట్ చేసి.. పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక టార్గెట్‌గా పెట్టుకున్న ఏపి సిఎం చంద్రబాబు ఇందులో సక్సెస్ సాధించారు. దేశవిదేశాల నుంచి కార్పొరేట్ ప్రముఖులను ఆకర్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన పెట్టుబడి హామీలనే పొందారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సారి ఐటి హంగామా తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్ రంగాల జోరే ఎక్కువగా కనిపించింది. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని ప్రాంతాలూ కవర్ అయ్యేలా పెట్టుబడి ప్రతిపాదనలు రావడం కూడా ప్రోత్సాహకర విషయమే.
పార్ట్‌నర్షిప్ సమ్మిట్... పెట్టుబడులను ఆకర్షించడంలో బంపర్ హిట్ అయింది. మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ సమావేశాలు ప్రోత్సాహకర వాతావరణంలో మగిశాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మొదటి రోజు డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాలకు పరిమితమైన అవగాహనా ఒప్పందాలు రెండో రోజు రిటైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు విస్తరించింది. ఈ సందర్భంగా రిటైల్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజున పర్యాటక రంగానికి సంబంధించిన అవగాహనా ఒప్పందాలు ఎక్కువగా కుదిరాయి. అంతే కాకుండా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున హామీల వర్షం కురిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి జాగ్రత్త పడింది. ఐటి రంగానికి మాత్రమే పరిమితం కాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద పీట వేశారు. పోర్టులను అభివృద్ధి చేసి గుజరాత్‌తో పోటీపడేందుకు ఏపి సర్కార్ సిద్ధమవుతోంది.
కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, జయంత్ సిన్హా, అనంత కుమార్ సహా.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్పొరేట్ దిగ్గజాల్లో అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్, గ్రంధి మల్లికార్జున రావు, బాబా కళ్యాణి, కిషోర్ బియానీ వంటి వాళ్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. నలభైకి పైగా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించి, పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఫార్మా, విద్యుత్ కంపెనీలకు పరిమితమైన విశాఖ ప్రాంతం.. భవిష్యత్తులో డిఫెన్స్ రంగానికి కూడా వేదిక కాబోతోందని అనిల్ అంబానీ వెల్లడించారు. రాంబిల్లిలో నేవల్ బేస్ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించారు. నెల్లూరులో రూ.1200 కోట్లతో ఆటోమోటివ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు భారత్ ఫోర్జ్ అధినేత బాబా కళ్యాణి ప్రకటించారు. గుంటూరు, విజయవాడ, అమరావతి నగరాలకు పైప్డ్ గ్యాస్ అందించాలనే లక్ష్యంతో కృష్ణపట్నం పోర్టులో రూ.3 వేల కోట్లతో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నట్టు పెట్రోగ్యాస్ సంస్థ వెల్లడించింది. 11 సంస్థలో చిత్తూరు శ్రీసిటీ అవగాహన కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల విలువ దాదాపు రూ.12 వేల కోట్లు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కుదిరిన 65 ఎంఓయూల విలువ దాదాపు రూ.6 వేల కోట్లు. స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రెట్టింపు చేస్తామని ఫాక్స్‌కాన్ సంస్థ తెలిపింది. వచ్చే మూడేళ్లలో రూ.5 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ చేయబోతున్నట్టు అమరరాజా సంస్థ కూడా ప్రకటించింది.
'' బలమైన నాయకులు ఇంపాజిబుల్‌ను పాజిబుల్ చేసి చూపిస్తారు. వాళ్ల ఆలోచనా ధోరణే వేరుగా ఉంటుంది '' - అనిల్ అంబానీ, అడాగ్ గ్రూప్ ఛైర్మన్
విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి 840 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం హడ్కో రూ.7500 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ రూ.5 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని స్పష్టమైన ప్రకటనలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తన మద్దతు తెలిపింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ రూ.38500 కోట్ల పెట్టుబడితో విస్తరణ, కొత్త ప్రాజెక్టుల అభివృద్ధి చేపడ్తామని స్పష్టం చేసింది. పుట్టపర్తిలో 4 వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్, ఆంధ్రలో మరో ప్రాంతంలో 2250 మెగావాట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 20 వేల కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. 100 ఎకరాల్లో విశాఖలో నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - (నైపర్) నెలకొల్పుతామని కూడా హామీనిచ్చారు. విజయవాడలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఏర్పాటు చేస్తామి ప్రకటించారు. హెచ్‌పిసిఎల్ - గెయిల్ భాగస్వామ్యంతో రూ.30 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మిస్తామని కూడా కేంద్రం నుంచి స్పష్టమైన హామీవచ్చింది. విశాఖలో హెచ్‌పిసిఎల్ పెట్రోకెమికల్ రీజియన్‌ను విస్తరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
'' పెట్టుబడులకు ఏపి అనువైన రాష్ట్రం. ఇక్కడ ప్రస్థానం ప్రారంభించిన నేను దేశ, విదేశాలకు విస్తరించాను'' - జిఎంఆర్
పర్యాటక రంగంలో కూడా 7840 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి. విజయవాడలో ఏడున్నర ఎకరాల్లో ఎనిమిది వేల సీటింగ్ కెపాసిటీ గల అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయబోతున్నట్టు మురళీ ఫార్చ్యూన్ సంస్థ ప్రకటించింది. 10 వేల ఎకరాల్లో 73 వేల కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ సిద్ధం చేస్తామని ఎస్సెల్ గ్రూప్ స్పష్టం చేసింది.
'' ఒక్క ఐటి వెంటపడకుండా అభివృద్ధిలో వివిధ రంగాల భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్త పడ్డాం. ఆశ్చర్యంగా ఈ సారి చిన్న, మధ్య తరహా కంపెనీలు ఎన్నో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి'' - సురేష్ చిట్టూరి, సిఐఐ ఏపి ఛైర్మన్
మూడు రోజుల పాటు సాగిన విశాఖ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఏపి సిఎం చంద్రబాబులో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రాష్ట్ర రాజధాని నిర్మాణం సహా.. కొత్త ఉద్యోగాల రూపకల్పనకు మార్గం సుగమమైనట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది కూడా ఈ సదస్సు విశాఖలో జరుగుతుందని సిఐఐ స్పష్టం చేసింది. దావోస్‌లా ప్రతీ ఏడాదీ పారిశ్రామికవేత్తలతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు.
భాగస్వామ్య సదస్సు - 2016 పేర రాష్ట్ర సంపద లూఠీ - సిపియం పార్టీ
http://cpimap.org/content/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81-2016-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%B2%E0%B1%82%E0%B0%A0%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రం దేశంలో కెల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలోకి వెళుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం హారెత్తిస్తున్నారు. వాస్తవంగా ఈ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని భావిస్తున్నాం.
* పెట్టుబడుల ఒప్పందాల పేర రాష్ట్రంలో రైతుల భూములు, ప్రభుత్వ భూములు పెద్దఎత్తున పెట్టుబడి దారులకు కట్టుబెడతారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 10 లక్ష ఎకరాల భూములు సేకరించాని నిర్ణయించింది. వెంటనే 5లక్ష ఎకరాలు సిద్ధం చేయాలని సదస్సులో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
* విశాఖ జిల్లాలోని ప్రభుత్వ భూములు, రైతుల భూములు, కొండలు, సహజ వనరులు, విశాఖ స్టీల్‌ప్లాంట్, బి.హెచ్.పి.వి, రైల్వే, పోర్టు, జివిఎంసి, ఆంధ్రాయూనివర్సిటీ తదితర సంస్థల భూములు పారిశ్రామిక వేత్తకు ధారాదత్తం చేయబడతాయి.
* రాష్ట్ర తీర ప్రాంతం మొత్తం కొద్ది మంది బడా సంస్థల ఆధిపత్యానికి కట్టబెట్టబడుతుంది. లక్షలాది మత్య్సకారులను, ప్రజలను బలవంతంగా నిర్వాసితులను చేయబోతున్నారు.
* రాష్ట్రంలో గనులు, నీరు, భూమి అటవీ సంపద వంటివి వనరులు కొల్లగొట్టబడతాయి.
* రాష్ట్రంలోని పట్టణ, నగర ప్రాంతాల్లోని స్థానిక మున్సిపల్ సంస్థ కార్యకలాపాల ప్రైవేట్‌పరమవుతాయి. పౌర సేవలు మరింత ప్రైవేటీకరణకు దారితీస్తాయి. వీటి ఆధీనంలోని భూములు, స్థలాల విభాగాలు ప్రైవేట్ సంస్థ సొంత ఆస్తులుగా మార్చబోతున్నారు.
* రిటైల్ రంగంలోకి భారీ ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతించడం వల్ల లక్షలాది చిరువ్యాపారులు దివాళా తీస్తారు. లక్షలాది మంది నిరుద్యోగులౌతారు. రిటైల్ వ్యాపారం కొన్ని సంస్థల చేతుల్లో కేంద్రీకృతమౌతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం.
* పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాసేదిగా తన నిజస్వరూపాన్ని బహిర్గత పరుచుకున్నది.
* రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు చాలా వరకు కార్యరూపం దాల్చవు. 2012లో కూడా పెట్టుబడుల భాగస్వామ్యం సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు. అప్పుడు కూడా 6 లక్ష కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలి.
* సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రతి సం॥రం ఏదో ఒక రాష్ట్రంలో 1995 నుండి జరుగుచున్నది. సర్కస్ కంపెనీ వలే ఈ సంస్థలు అన్ని చోట్ల పాల్గొంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే విచ్చతవిడిగా దోపిడి చేసుకోవటానికి సకత సదుపాయాలు కల్పిస్తుందో అక్కడ పెట్టుబడులు పెట్టటానికి సిద్ధపడతాయి. ఇందులో చంద్రబాబు నాయుడు ప్రధమస్థానంలో నిలిచాడు.
* ఈ ఒప్పందా ద్వారా పారిశ్రామిక చట్టాలు, కార్మికచట్టాలు, పర్యావరణ చట్టాలు అన్ని మార్చివేసి పెట్టుబడిదారుల అరాచకాలకు నియంత్రణ లేకుండా చేస్తారు. కార్మికులకు ఉపాధి, వేతన భద్రత ఇతర చట్టబద్ద హక్కు తొలగించడతాయి. నిర్వాశితులకు, స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తాయి.
* రిలయన్స్ సంస్థ విశాఖపట్నం రాంబిల్లి వద్ద 5వేల కోట్ల పెట్టుబడిలతో షిప్‌యార్డులను నిర్మిస్తానని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలు అయిన గార్డెన్ రీచ్ షిప్‌యార్డు (జి.ఆర్.ఎస్) రాంబిల్లి ప్రాంతంలో షిప్‌యార్డు నిర్మిస్తుందని ప్రచారం చేసిన రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందో తెలపాలి. ఇందులో పెద్ద కుట్ర ఉందని భావిస్తున్నాం. రియన్స్ వల్ల విశాఖనగరంలో ఉన్న హిందూస్థాన్ షిప్‌యార్డుకు తీవ్ర ప్రమాదం వాట్లిలుతుంది. గత 8 ఏళ్ళ నుండి కేంద్ర ప్రభుత్వాలు దీనికి ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వకుండా నష్టాల్లోకి నెడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్‌ఎస్‌ఎల్‌కు ఆర్డర్స్ కొరకు నేటికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.
రాబోయే 15 ఏళ్ళలో భారత నౌకాదళంలో 90శాతం నౌకను ఆధునీకరించి రీఫిట్ చేయాల్సి ఉంది. దీనికి కనీసం ఏడాదికి 20 వేల కోట్ల రూపాయల చొప్పున సుమారు 15 ఏళ్ళలో 3లక్ష కోట్లు కేంద్ర రక్షణ శాఖ వెచ్చించనుంది. ఈ ఆర్డర్స్ ఎట్లాగైన దక్కించుకోవడానికి రిలయన్స్ సంస్థ విశాఖలో షిప్‌యార్డును నిర్మించడానికి పూనుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం విశాఖకు తీవ్ర నష్టం.
రిలయన్స్ సంస్థ గుజరాత్‌లోని పిపవాషిప్‌యార్డును ఇటీవల కొనుగోలు చేసింది. రక్షణ రంగ పరికరాల తయారీ కొరకు 13 రకాల లైసెక్స్ కొరకు అంబానీ కేంద్ర ప్రభుత్వానికి ధరఖాస్తు చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే రక్షణరంగ ఆర్డర్స్ అన్ని అంబానీ వశం చేసుకోవటానికి పెద్ద కుట్రగా ఉంది. ఇది బిజెపి, టిడిపి సహకారంతోనే జరుగుతున్నదనిపిస్తున్నది.
* ఇప్పటికే ప్రమాదకర పరిశ్రముగా పరిగణించబడిన వాటికి తిరిగి ఈ సదస్సులో వాటి కార్యకలాపాలు విస్తరించుకోవడానికి ఒప్పందాలు చేసుకోవడం అన్యాయం. ఉదా: శ్రీకాకుళంలో ఉన్న ట్రైమాక్స్ బీచ్ శాండ్ సంస్థ 2500 కోట్లుతో విస్తరణకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక ఆంధోళనలు జరుగుచున్నాయి. బీచ్‌శాండ్ తీయడం వల్ల సముద్రపు నీరు సుదూర ప్రాంతాలకి చొచ్చుకెళ్ళి గ్రామాల భూగర్భ నీరు ఉప్పు నీరుగా మారుతున్నాయి. పర్యావరణం కలుషితం అవుతున్నది. తాజా ఒప్పందం అక్కడి ప్రజలకు, మత్య్సకారులకు తీవ్ర నష్టం.
* ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్దరణ కొరకు చంద్రబాబు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో 28 ఫెర్రొఎల్లాయిస్ పరిశ్రమలు మూతపడ్డాయి. 12జ్యూట్ పరిశ్రమలు మూతపడ్డాయి. చక్కెర పరిశ్రమలు కునారిల్లుతున్నాయి. షిప్‌యార్డు, బిహెచ్‌పివిలకు ఆర్డర్స్ లేవు. స్టీల్‌ప్లాంట్‌కి సొంత గనులు కేటాయించకపోవడం వల్ల తీవ్ర ఒడిదడుకులు ఎదుర్కొంటున్నది.
* విశాఖ నగరంలో ఉన్న ఐటి పరిశ్రమలు అగమ్యగోచరంలో ఉన్నాయి. ఐటి దిగ్గజాలైన విప్రో, సత్యం మహేంద్ర వంటివి పూర్తయి 6 ఏళ్ళయిన ప్రారంభించలేదు. అనేక సంస్థలు రుషికొండ మీద నిర్మాణమైన ప్రారంభంకాలేదు. ప్రారంభమైనవి మూసివేస్తామని ప్రకటిస్తున్నారు.

No comments:
Post a Comment