‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’
Sakshi | Updated: October 19, 2016 12:52 (IST)
‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’
న్యూఢిల్లీ : కృష్ణా జలాల పున: పంపిణీపై నెలకొన్న వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ జరగాలని ట్రిబ్యునల్ బుధవారం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
దీనిపై నాలుగు వారాల్లోగా అభ్యంతరాలు తెలపాలని రెండు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ సూచించింది. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించిన విషయం తెలిసిందే.
అయితే కృష్ణా నదీ బేసిన్ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. కృష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు తిరిగి పునఃకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. కాగా, కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు వాటికి ఇంతకు ముందు ఇచ్చిన వాటాలోనే పంచుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర ట్రైబ్యునల్‌లో వాదనలు కొనసాగించాయి. ఈమేరకు తీర్పు వెలువడింది.

No comments:
Post a Comment