Wednesday, 31 July 2013

రాములమ్మపై కేసీర్ వేటు

చెల్లికి చెల్లు

August 01, 2013

హైదరాబాద్, జూలై 31 : 'రాములమ్మ'పై టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గత కొన్నాళ్లుగా పార్టీతో పెరుగుతూ వస్తున్న దూరం ఇక శాశ్వతం కానుంది. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు రావడం... ఆ వార్తలను ఆమె ఖండించకపోవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. విజయశాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం అర్ధరాత్రి తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. "పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతిని ఇప్పటికే అనేకసార్లు క్షమించాం. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇస్తాం. పొలిట్‌బ్యూరో ఏకాభిప్రాయం మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని టీఆర్ఎస్ తెలిపింది.

టీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గడంతో... విజయశాంతి కొన్నాళ్లుగా పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనడంలేదు. ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విభజన అంశంపై అటు రాష్ట్రం, ఇటు కాంగ్రెస్ పెద్దలు తలమునకలైన సమయంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశమై మెదక్ ఎంపీ సీటుపై హామీ ఇప్పించుకున్నారు.

ఈ విషయాన్ని 'ఆంధ్రజ్యోతి' బుధవారం ప్రచురించింది. బుధవారమే ఆమె మీడియాతో మాట్లాడారు. 'కాంగ్రెస్‌లో చేరుతున్నారా? టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా?' అని వచ్చిన వార్తలపై సూటిగా స్పందించలేదు. "ఈ ప్రచారం గురించి తర్వాత మాట్లాడుకుందాం. తెలంగాణపై ప్రకటన వచ్చిందనే సంతోషంలో ఉన్నాను. దానిని అలాగే ఉండనివ్వండి'' అని బదులిచ్చారు. తెలంగాణపై కాంగ్రెస్ చేసిన ప్రకటన అద్భుతంగా అభివర్ణించారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన సంబరాల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించగా... 'అనారోగ్య కారణాల వల్లే' అని బదులిచ్చారు

No comments:

Post a Comment